Suryaa.co.in

Andhra Pradesh

మహనీయుల త్యాగాలు మరువం

– సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ కు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జయంతి,వర్ధంతి కార్య క్రమాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు. ఆయన జయంతి,వర్ధంతి కార్య క్రమాలను ప్రభుత్వం చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించటం శోచనీయం అని విమర్శించారు.

విజయవాడలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు స్వంత జిల్లా నెల్లూరుకు ఆయన పేరు పెట్టడం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహనీయుల సేవలకు అవసరమైన కార్యక్రమాలు నిర్వహించటంలో ముందు ఉంటారని వివరించారు.

బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యం
తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పార్టీ అధ్యక్ష పదవిని బలహీన వర్గాల వారికి ఇవ్వటం గొప్ప విషయమని మంత్రి అన్నారు. మంత్రివర్గంలోను,ఇతర పదవులు కేటాయించటంలోనూ బీసీ లకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి ఇచ్చారు అన్నారు.

ప్రతి నియోజకవర్గంలో లక్ష మందికి పార్టీ సభత్వం ఉండాలని ముఖ్యమంత్రి లక్ష్యం పెట్టుకున్నారని, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శాసన సభ్యులు గద్దే రామ్మోహన్ రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, గొట్టిపాటి రామకృష్ణ, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE