– ఏపీ కోసం కాదు.. వైసీపీ కోటరీ కోసమే ఈ బడ్జెట్
-బడ్జెట్‌పై ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందన
అందరూ బాగుండాలి అనేది చంద్రబాబు గారి విధానం…
వైసీపీ కోటరీ బాగుండాలి అనేది జగన్ రెడ్డి ఎజెండా…
అమ్మ ఒడి అబద్ధం
నాన్నబుడ్డీ నిజం
వాహన మిత్ర అబద్ధం
ఆటోడ్రైవర్లని మోసం చేయడం నిజం
అటెండెన్స్ పేరుతో అమ్మఒడి కట్ చేస్తున్నారు.ఒక ఏడాది అమ్మ ఒడి ఎగ్గొట్టారు ఇచ్చే 15 వేలలో ఒక వెయ్యి కోసి 14 వేలు ఇస్తున్నారు.
విద్యార్థినులకు సైకిళ్లు ఆపేశారు.
బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లు మూసేశారు
ఎయిడెడ్ స్కూళ్లను డెడ్ చేశారు
పింఛను వంచనకి పాల్పడ్డారు
మూడువేలిస్తామని హామీ ఇచ్చి మోసగించారు
వైఎస్, ఆయన కొడుకు కలిపి ఇచ్చిన పింఛను 625
ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన పింఛను 1850
45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ పింఛను ఇస్తామన్న జగన్‌రెడ్డి
మహిళల్ని మోసం చేసారు
కరెంటు బిల్లులు నిబంధన అడ్డంపెట్టుకుని
8 లక్షల మందికి పింఛను నిలిపేశారు
వాహన మిత్రలోనూ మోసం
6లక్షల ఆటోలు, డ్రైవర్లు ఉంటే 1.74 లక్షల మందికే ఇచ్చారు
ఆటోవాలాలకు ఇచ్చింది 10 వేలు
ఫైన్ల రూపంలో లాక్కున్నది 20 వేలు
పెట్రోల్ డీజిల్ ధరలపై పన్నులు పెంచేశారు
పేదలకు ఇళ్ల స్కీం..7 వేల కోట్ల స్కాం
లక్షల ఇళ్లు కట్టామన్న సర్కారు..
కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం మూడేళ్లలో 5 ఇళ్లు పూర్తి
దశలవారీగా మద్యనిషేధం హామీ ఇచ్చి ..ఇప్పుడు మద్యం ఆదాయంపైనే ఆధారపడింది జగన్ సర్కారు. టిడిపి హయాంలో ఆబ్కారీపై ఆదాయం 6 వేల కోట్లు వస్తే..జగన్ రెడ్డి మద్యంపై 16,500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు
బూమ్ బూమ్ బీరు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ వంటి బ్రాండ్లని
పెద్ద ఎత్తున అమ్ముకోవాలనేది జగన్‌రెడ్డి ఆలోచన. దీని వెనుక ఎంత ఆదాయం సొంతానికి వస్తుందో మీరే ఆలోచించండి.
మందుబాబుల్ని తాకట్టుపెట్టి 25 వేల కోట్లు అప్పు తీసుకున్నాడు.
చేనేతలకి 3.50 లక్షల మగ్గాలుంటే కేవలం 80 వేల మందికి నేతన్న నేస్తం ఇచ్చి మోసగించారు.
చేనేతలకు అన్ని సంక్షేమ పథకాలు నిలిపేసి నేతన్న నేస్తం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మూడేళ్లుగా యార్న్ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం.
మూడేళ్లలో 25 మంది చేనేత కళాకారులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆదుకోవడం కాదు కదా…కనీసం పట్టించుకోని జగన్ ప్రభుత్వం.
ఫీజులు రీయింబర్స్ మెంట్ 16 లక్షల మంది విద్యార్థులకు చంద్రబాబు ఒకేసారి రీయింబర్స్ చేశారు. మూడు నాలుగు విడతలుగా జగన్ ఇస్తూ…విద్యార్థుల్ని ఆందోళనకి గురిచేస్తున్నారు.
బడ్జెట్‌లో విదేశీ విద్య ప్రస్తావనే లేదటిడిపి హయాంలో 3 వేల మంది విదేశాలు వెళ్లి.. జగన్ మోసంతో వారంతా అక్కడ ఇరుక్కుపోయారు.
ఆరోగ్యశ్రీలో వెయ్యి దాటిన అన్నింటికీ ఉచితవైద్యం అని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి, ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పేరు చెబితే అసలు వైద్యమే చేయడంలేదు.
బడుగుబలహీన వర్గాలంటే చిన్నచూపు
ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ నిధులు బడ్జెట్‌లో లేవు. సబ్ ప్లాన్ నిధులు కూడా మళ్లించేశారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కి గతేడాది బడ్జెట్‌లో 10 వేల కోట్లకు పైగా కేటాయించి, వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. క్రిష్టియన్ కార్పొరేషన్‌కి 130 కోట్లు ఇచ్చి 11 కోట్లు ఖర్చు చేశారు. మైనారిటీల సంక్షేమానికి 1208 కోట్లు కేటాయించి 94 కోట్లు మాత్రమే వెచ్చించారు.
ఎస్సీ కార్పొరేషన్ కి కేటాయించిన 5 వేల కోట్లు నిధులలో 340 కోట్లు ఖర్చు అయ్యింది.
గవర్నర్ ప్రసంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం కేటాయించిన నిధుల ప్రత్యేక ప్రస్తావన లేదు. బడ్జెట్‌లోనూ లేకుండా మోసగించారు. కులాలవారీగా కార్పొరేషన్లు పెట్టి
రూపాయి నిధులివ్వలేదు.కార్పొరేషన్ పాలకవర్గం కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వలేదు.
జగన్ హామీలు అంతా మోసం
జగన్ బడ్జెట్ అంతకంటే మోసం
జగన్ రెడ్డి ఒక చేత్తో 10 రూపాయలిచ్చి మరో చేత్తో 100 లాగేస్తున్నారు. ప్రజల్ని ఇంతగా మోసం చేసిన ఆయన జగన్ మోహన్ రెడ్డి కాదు…జగన్ మోసపు రెడ్డి