-కోటిపల్లి -నరసాపురం రైల్వే లైన్ కు బడ్జెట్ లో రూ.358 కోట్లు కేటాయింపు పట్ల హరీష్ బాలయోగి హర్షం
కోనసీమ ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ కు ఈ ఏడాది బడ్జెట్ లో రూ.358 కోట్లు కేటాయించడం పట్ల జీఎంసీ బాలయోగి కుమారుడు, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ హరీష్ బాలయోగి హర్షం వ్యక్తం చేశారు. గత నెల 6వ తేదీన ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని వారి కార్యాలయంలో కలిసిన హరీష్ బాలయోగి.. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ పనులు పూర్తిచేయాలని, నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. తన అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించి ఈ ఏడాది బడ్జెట్ లో రూ.358 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైల్వే లైన్ రావడం వల్ల ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. లోక్‌సభ మాజీ స్పీకర్ జియంసి బాలయోగి గారి చొరవతో కోటిపల్లి-నర్సాపూర్ కొత్త లైన్ ప్రాజెక్ట్ 2000-01లో మంజూరు చేశారు. ప్రాజెక్ట్ కు మంజూరైన వ్యయం రూ.2120 కోట్లు. ఇప్పటివరకు రూ. 1048 కోట్ల వ్యయం చేయడం జరిగింది.
ప్రాజెక్ట్ వ్యయంలోలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం తమ వాటాగా కేవలం రూ.2.69 కోట్లు మాత్రమే డిపాజిట్ చేశారు. కోనసీమ రైల్వే లైన్ బాలయోగి గారి చిరకాల స్వప్నం. ఈ ప్రాజెక్టు పూర్తికి తుదివరకు కృషిచేయడం జరుగుతుంది. కోనసీమ ప్రజల కోరిక నెరవేర్చేందుకు రాష్ట్ర వాటాను జగన్ రెడ్డి విడుదల చేయకపోవడం విడ్డూరంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి కోసం చెప్పిన మాటలు చేతల్లో చూపించకుండా ప్రజలను మోసం చేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను విడుదల చేయాలి.