-రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది
-టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్
జగన్ రెడ్డి పాలనలో కొంత మంది పోలీసులు డ్యూటీలు మరిచి వైసీపీకి పాలేరుల్లా తయారయ్యారని టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది, ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోవడమే మానేశారు. దేశంలోని ప్రజలందరికి రాజ్యాంగం ఒక రక్షణ కవచమైతే దానికి పోలీస్ వ్యవస్థ కవచం. మహత్తరమైన పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రజలకు కష్టం వస్తే పోలీసులకు చెప్పుకుంటారు పోలీసుల నుండి ఆపద వస్తే ప్రజలు ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? తప్పుడు కేసులు నమోదు చేయడం కొంత మంది పోలీసులకు బాగా అలవాటైపోయింది. పోలీసులు ప్రజలను బక్షించడానికి ఉన్నారా? లేక శిక్షించడానికి ఉన్నారా?
చిత్తూరులోని కుప్పం, పూతలపట్టులో దాదాపు 200 మందిపై తప్పుడు ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ను ఒక విద్యార్ధి ప్రశ్నించాడని అతనిపై తప్పుడు కేసు నమోదు చేశారు. ప్రశ్నించిన గ్రామస్థులు, తెలుగుదేశం నాయకులు 24 మందిపై తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టారు. అట్రాసిటి విలువ పోలీసులకు తెలుసా? ఎఫ్ఐఆర్ అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు గా మారిపోయింది. తప్పుడు ఎఫ్ఐఆర్ లు కట్టడం వలన వచ్చే అనర్ధాలను సుప్రీంకోర్టు జడ్జి మెంట్ ప్రకారం చూస్తే ‘‘These days there are quite many incidents when the common man is troche, harassed by the police by negligently and deliberately larging ferevlessly false FIR’s against such persons. How even sully face such severe face hardship the police officer can be held liable for deliberately larging a false FIR’s against a person with intention of cause injure to such person. తప్పుడు ఎఫ్ఆర్ లు కట్టిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 156, 220, 166 ప్రకారం మూడు సంవత్సరాల పాటు శిక్షర్హులు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన సొంత నియోజకర్గంలో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయడానికి వస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో కుప్పంలో దొంగల ముఠాను దింపి దాడులు చేయించారు. పైగా టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. సెక్షన్ 307 ప్రకారం రాత్రి 1.00 గంటకు ఎఫ్ఐఆర్ కట్టి ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేశారు అంటే మూడు గంటల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తారా? ప్రైమ్ఆఫెసీ ఎవిడెన్సీ పూర్తి అవుతుందా? ఇదేనా చట్టాన్ని అమలు చేయడం అంటే? పోలీసుల నెత్తిపై మూడు సింహాలు ఇచ్చింది అందుకేనా ? రాజ్యాంగాన్ని నిలబెట్టే అధికారం ఉంది కదా అని మూడు సింహాలు ఇచ్చారు. ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది.
ఐపీఎస్ అంటే ఉమేష్ చంద్ర గుర్తుకు వస్తారు. ఆయన నిస్వార్థంగా పని చేశారు. అందుకే ప్రజలు ఆయనను ఆరాధిస్తారు. కేవలం 5 ఏళ్లు పని చేసే వైసీపీ నాయకుల కోసం పోలీసులు అడుగులకు మడుగులు వత్తడం సిగ్గుచేటు. గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో మేము ప్రజల దగ్గరకు వస్తాం.. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు. మీరే మా ఇంటికి వస్తారు, సమస్యలు చెబితే మళ్లీ మీరే కేసులు పెడుతున్నారు. పెన్షన్ రాలేదని చెప్పినందుకు అట్రాసిటీ కేసు పెడుతున్నారు. ఈ మాత్రం దానికి గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈ రకంగా చూస్తే 5 కోట్ల మంది ప్రజలపై పోలీసులు కేసులు పెట్టే పరిస్థితికి దిగజారిపోతారు. తప్పుడు ఎఫ్ఐఆర్ లు కట్టి విలువైన పోలీస్ కెరీయర్ ను, ట్రాక్ రికార్డ్ ను కోల్పోతున్నారు.
పోలీసుల వేధింపుల వలన ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే మైనార్టీ కుటుంబం పోలీసుల వేధింపుల వలన సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నారాయణ అనే దళితుడ్ని పోలీసులు కొట్టి చంపి చెట్టుకు వేలాడిదీసి ఆత్మహత్యలా సృష్టించారు. సాంప్రదాయానికి విరుద్ధంగా పోలీసులే అంత్యక్రియలు చేస్తారా? ఇదేనా రాజ్యాంగాన్ని రక్షించే విధానం? నెల్లూరు జిల్లాల్లో కరుణాకర్ అనే నిరుపేద దళితుడి సూసైడ్ నోట్ చూస్తే వైసీపీ నాయకుల అరాచకాలు, పోలీసుల నిర్లక్ష్యం, చేతగానితనం స్పష్టంగా కనపడుతుంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులను చూస్తే రౌడీలు, గూండాలు ప్యాంట్లు తడుపుకునేవారు. కాని నేడు మాఫియా, లిక్కర్ డాన్ లను చూసి పోలీసులు ఒణికిపోతున్నారు. మంచి పోలీసులకు వేధింపులు తప్పడం లేదు. సేవ్ ఏపీ పోలీస్ అనే ప్లకార్డ్ ప్రదర్శించినందుకు అనంతపురంలో ప్రకాష్ అనే దళిత పోలీస్ కానిస్టేబుల్ ను డిస్మిస్ చేస్తారా? రాజ్యాంగంలో ఆర్టికల్ 19 (ఏ)లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అని ఉంది. ఇదేనా మన దేశంలో సర్వీస్ రూల్స్ అమలు చేయడం అంటే? అదే విదేశాల్లో అయితే ఒక్క పోలీసు నల్లబ్యాడ్జ్ ధరిస్తేనే మొత్తం వ్యవస్థ అంతా ఒణికిపోతుంది. వారి సమస్య తీరే వరకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
అరెస్ట్ లు చేయడం, రిమాండ్ కు పంపించడం, వేధించడం మాత్రమే పోలీసులకు తెలుసు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సెక్షన్ 219 ఐపీసీ ప్రకారం తప్పుడు రికార్డు, తప్పుడు సాక్షాధారాలు, తప్పుడు ఎఫ్ఐఆర్ లు సృష్టించి ప్రజలను ఇబ్బందులు పెడితే 7 ఏళ్లు శిక్షపడుతుంది. వైసీపీ నాయకుల కోసం పోలీసులు ఎందుకు ఇలాంటి శిక్షకు గురవుతారు? ప్రజలకు పోలీసులంటే గౌరవం ఉంది. దాన్ని పోగొట్టుకోవద్దు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై డెఫర్ మేషన్ సూట్ లు వేస్తాం. అప్పుడు మీరు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే మీచే తప్పుడు కేసులు వేయించారో వాళ్లు ఎవ్వరూ రేపు మీ వెంట ఉండరు. కేవలం మీరు మాత్రమే కోర్టు బోనులో చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని టిడిపి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సూచించారు.