October 3, 2026

ఉంగరం చెప్పిన చంద్రబాబు కథ

తన గురించి చెప్పే ఉంగరం ఉంది…
తన ఆరోగ్యం గురించి తెలిసిపోతుందనే భయం లేదు!

కెమెరా ముందు నిలబడితే చాలు… 30 సెకన్లలో ప్రాథమిక హెల్త్ రిపోర్ట్ సిద్ధం అంటే “నేను సిద్ధం” అన్నారు!
ఏ టెస్టులు చేసుకోవాలో చెప్పేస్తుంది! డబ్బుల కోసం అనవసరమైనవి చెప్పదు!

అక్కడ అందరిలోనూ ఒక్కటే ప్రశ్న: “ఇది నిజంగా పనిచేస్తుందా?”
ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి చంద్రబాబు వేరే ఎవరినీ పిలవలేదు… తానే స్వయంగా కెమెరా ముందు నిలబడ్డారు!
రెడ్‌క్లిఫ్ ల్యాబ్స్ తీసుకొచ్చిన AI ఫేస్ స్కానర్‌ను ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా లైవ్ డెమోలో పరీక్షించారు!
30 సెకన్లు… అంతే!

మార్పులను AI పసిగట్టింది (rPPG టెక్నాలజీ). క్షణాల్లో తెరపై వైటల్స్!
రిజల్ట్స్ చూసి అక్కడున్న నిపుణులకు ఒకింత ఆశ్చర్యం!

పల్స్ రేట్: 68-72 (అత్యంత ఆరోగ్యకరం!)
బీపీ: సుమారు 120/80 – నార్మల్
ఆక్సిజన్ స్థాయి, శ్వాస రేటు, ఒత్తిడి స్థాయి… అన్నీ పర్‌ఫెక్ట్!

ఆ వేగం, ఖచ్చితత్వం నచ్చిన మరుక్షణమే… తన ఉంగరం ద్వారా నిత్యం ఆరోగ్యాన్ని ట్రాక్ చేసుకుంటారు కాబట్టి, ఏమాత్రం ఆలస్యం లేకుండా ప్రజల కోసం అక్కడికక్కడే ఆదేశాలిచ్చారు:

‘సంజీవని’ ప్రాజెక్ట్ కింద ప్రతి పౌరుడి ప్రాథమిక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ టెక్నాలజీని వెంటనే అనుసంధానించాలని సూచించారు.

నివేదికలు చూసి నిర్ణయాలు తీసుకునే నాయకులు ఎందరో ఉంటారు. కానీ “తనపైనే టెక్నాలజీని పరీక్షించుకుని, అక్కడికక్కడే నిర్ణయం తీసుకునే” నాయకత్వం అరుదు!
ఇదీ చొరవ… ఇదీ ఆరోగ్యాంధ్ర దిశగా పడిన అడుగు!

Total Visitors: 2,854,745