Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థి ఇష్టంగా చదవాలి కానీ కష్టంగా చదవకూడదు

ఎస్ డి ఆర్ వరల్డ్ స్కూల్, ఆకాంక్ష జూనియర్ కాలేజ్ దశమ వార్షికోత్సవ వేడుకలలో హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

నంద్యాల: పట్టణ శివారులో ఉన్న ఎస్ డి ఆర్ వరల్డ్ స్కూల్, ఆకాంక్ష జూనియర్ కాలేజ్ యొక్క దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనముగా కన్నుల విందుగా విజయవంతముగా జరిగాయి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖ హాస్య నటుడు విద్యావేత్త పద్మశ్రీ బ్రహ్మానందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమకు ఇష్టమైన కోర్సును ఎన్నుకొని అందులో ప్రతిభ కనబరచాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమములో 800 మంది విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని. పదివేల మందికి పైగా తల్లిదండ్రులు పాల్గొనడం జరిగిందని . ఇంతటి అద్భుతమైన కార్యక్రమమునకు వచ్చినందుకు సంతోషాన్ని ప్రకటిస్తూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని మొదటి నుండి పర్యవేక్షించిన సంస్థ అధినేత శనివారపు కొండారెడ్డి కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ.. విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యను విద్యార్థి ఇష్టంగా చదవాలి కానీ కష్టంగా చదవకూడదు. తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లల మీద మానసికమైన ఒత్తిడి కి గురి చేయవద్దని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి , మైన్స్ ఓనర్ దస్తగిరి రెడ్డి , జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి , గుండం శేషి రెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ఎస్ విజయ్ శేఖర్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE