Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీంకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు

-సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలకు ఇప్పటికైన జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి
-మాజీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బూరగడ్డ వేదవ్యాస్

మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం నాడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసుల్లో ఒకటైన నిరూపించగలిగారా? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీర్పు ఓ చెంపపెట్టు.అధికార గర్వంతో జగన్ రెడ్డి అండ్ కో పెట్టిన కేసులు తప్పుడివి అని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైంది. ఐఆర్ఆర్ కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది

గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించిందిసుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాలకు ఇప్పటికైన జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం.నిజం గెలవాడానికి ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా గెలుస్తుందని జగన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.

అక్రమ కేసులు పెట్టి వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారు.జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సరే రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ వెంటేఉన్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్

జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను రా.. కదలిరా.. ద్వారా చంద్రబాబునాయుడు, వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్, యువ గళం ద్వారా నారా లోకేష్ ఎత్తి చూపించారు.అవిశ్రాంతంగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోరాట యోధులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు అన్నారు.చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల సభలకు హాజరైన ప్రజానికాన్ని చూస్తే అర్ధం అవుతుంది. తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు ఎలా ఉంది అని.

తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల ప్రజలే స్టార్ క్యాంపైనర్లు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళలపై నేరాలు 43% పెరిగాయి.దేశంలో మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది.ఏపీలో ప్రతిరోజు కనీసం 70 కేసులు నమోదవుతున్నాయి.నేరాలలో వరకట్న వేధింపులు, అత్యాచారం, ఆత్మహత్య, లైంగిక వేధింపులో ముఖ్యంగా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైతుల పైరుణభారం ఏపీ రైతులపైనే ఎక్కువగా ఉంది.జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లను మూసివేసి.ప్రభుత్వ పథకాలను నిలిపివేశారు.

అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే ఎంతోమంది నిరుపేదలకు అన్నం దొరికేదని అలాంటి అన్నా క్యాంటీన్ మూసివేసిన చరిత్ర హీనుడు జగన్.చంద్రన్న బీమా, వ్యవసాయ రాయితీలు, విదేశీ విద్యాతో పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన మరో 100 పథకాలను సైతం తొలగించారు.గ్రాడ్యుయేట్ నిరుద్యోగిత రేటులో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది.జగన్ రెడ్డి తన ఓటమిని ఇప్పటికి ఒప్పుకున్నారు. ఒకప్పుడు ‘వై నాట్ 175’ అనే వ్యక్తి ఇటీవల ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఓడిపోయిన తప్పు లేదని అన్నారు.

జగన్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.
జగన్ రెడ్డి చెత్త పరిపాలనతో రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది.

టిడిపీ , జనసేనహామీలు
వెనుకబడిన తరగతుల (BCలు) కోసం ‘ప్రత్యేక రక్షణ చట్టం’ ప్రవేశపెట్టబడుతుంది.
A.P. భూమి పట్టాదారు చట్టం రద్దు చేయబడుతుంది.
అన్యక్రాంతం అయిన భూములను యజమానులకు అప్పగించేందుకు సిట్ ఏర్పాటు చేస్తుంది.
తెలుగుదేశం- జనసేన ప్రభుత్వంలో మద్యం ధరలను తగ్గిచండంతో పాటు.. నాణ్యమైన మద్యం విక్రయిస్తుంది.
18 ఏళ్లు నిండిన మహిళలకు ‘మహాశక్తి’ పథకం కింద ‘ఆడబిడ్డ నిధి’గా నెలకు రూ. 1,500, దీపం పథకం కింద సంవత్సరానికి మూడు LPG సిలిండర్లు అందిస్తుంది.

వైసీపీ పై అసంతృప్తితో పార్టీని వీడుతున్న నాయకులు..
వైసీపీపై అసంతృప్తితో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతున్నారు.పార్టీలో జగన్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పావులుగా వాడుకుంటున్నారు.పార్టీ మీద, వైసీపీ నాయకులు మీద వ్యతిరేకత ఉందనే కారణంతో వారిని ఒక సీటు నుంచి మరో సీటుకు మార్చుతున్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.వైసీపీలో బీసీలకు అన్యాయం జరగతుందని కర్నూలు ఎంపీ సంజీప్ కుమార్ రాజీనామా చేశారు.జగన్ రెడ్డి మీద వ్యతిరేఖతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి రాజీనామా చేశారు.

ఇలా ఇంతమంది తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే జగన్ పరిపాలన విధానంపై నచ్చక పార్టీని వీడుతున్నారు అంటే ఇంకా రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం పైన జగన్ రెడ్డి అవలంబిస్తున్న తీరు పైన సంతృప్తిగా లేరని. వైఎస్ఆర్సిపి పార్టీ ఈసారి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని. మాజీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE