-వైసిపి దమనకాండపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించిన -చంద్రబాబు, టిడిపి నేతలు
రాష్ట్రంలో అక్రమ కేసులతో వేధిస్తున్న పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తున్నట్లు ప్రకటించిన టిడిపి అధినేత
-టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు
• మూడేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారు.
• వేధింపులు, హింసతో ప్రజలను, రాజకీయ పార్టీ నేతలను భయపెడుతున్నారు.
• మూడేళ్ల పాలనలో 60 మంది టిడిపి ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారు.
• గ్రామ స్థాయి లో 4 వేల మందిపై కేసులు పెట్టారు.
• 6 గురు మాజీ ఎమ్మెల్యేలను జైలుకు పంపారు.
• 4గురు మాజీ మంత్రులను అరెస్టు చేసి జైలుకు పంపారు.
• నాతో సహా పార్టీలో టిడిపి నేతలు అందరిపైనా కేసులు పెట్టారు.
• దళితులు, గిరిజనులు, బిసి, మైనారిటీలపై హత్యాకాండ జరుగుతోంది.
• రాష్ట్రంలో కోవిడ్ ను సరిగా ఎదుర్కోని కారణంగా 88 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
• రాష్ట్రంలో 2552 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
• రాష్ట్రంలో 37 మంది టిడిపి కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. ఇందులో 24 మంది బిసి నేతలు ఉన్నారు.
• డిజిపి మారినా రాష్ట్రంలో పోలీసు శాఖలో మార్పు రాలేదు.
• పోలీసులు ఇప్పటికైనా మారకపోతే…మార్చే శక్తి ప్రజలకు ఉంది.
• ఒక్క మాచర్లలో 5 గురి చంపేస్తే…4 గురు యాదవ వర్గం వారే.
• చంద్రయ్యను చంపిన సమయంలో కఠిన చర్యలు తీసుకుని ఉంటే జల్లయ్య హత్య జరిగేదా
• మాచర్ల నియోజకవర్గంలో మూడేళ్లు అయినా….ప్రజలు సొంత గ్రామాలకు ఎందుకు రాలేకపోతున్నారు….పోలీసులు ఏం డ్యూటీ చేస్తున్నారు.
• మాచర్లలో జల్లయ్యను చంపితే మా నేతలు వెళ్లకూడదా….పోలీసులు మా హక్కులు ఎలా ఉల్లంఘిస్తారు.
• అనంతబాబు అనే ఎమ్మెల్సీ డ్రైవర్ ను చంపేసి డెడ్ బాడీ ఇంటి దగ్గరకు తెచ్చిపడేస్తాడా.
• ప్రజా సంఘాలు, టిడిపి నేతలు ఆందోళన చేస్తే తప్ప ఎమ్మెల్సీని అరెస్టు చెయ్యరా.
• రాష్ట్రంలో డిజిపి ఉన్నాడా…..ఆలిండియా సర్వీసెస్ పాస్ అయ్యారా…ఖాకీ బట్టలకు డిజిపి న్యాయం చెయ్యాలి.
• కోనసీమలో చిచ్చు ఎవరు పెట్టారు…ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి మళ్లీ అందరినీ వేధింపులకు గురి చేస్తున్నారు.
• కోనసీమలో తప్పుడు కేసులకు మళ్లీ అక్కడ ఆత్మహత్యలు చేసుకోవాలా…?
• వివేకా ది గుండెపోటు అని నమ్మించబోయి దొరికిపోయారు…నాపై హత్యానేరం మోపారు.
• వివేకా హత్య కేసులో సంబంధం ఉన్న ముగ్గురు ఎందుకు చనిపోయారు
• వివేకా కేసులో ఉన్న శ్రీనివాస రెడ్డి, గంగిరెడ్డి, గంగాధర్ రెడ్డి మరణాలకు కారణం ఏంటి.
• డ్రైవర్ దస్తగిరి తనను చంపేస్తాను అని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.
• సిబిఐ కేసులో అప్రూవర్ గా మారిన వ్యక్తికి ప్రాణ హాని ఉంది అంటే ఏం చెప్పాలి.
• కడప నుంచి వెళ్లిపోకపోతే బాంబులు వేస్తాం అని సిబిఐని బెదిరించారు.
• సిబిఐ ఆత్మవిమర్శ చేసుకోవాలి…..సిబిఐ విశ్వసనీయతకే పెను సవాల్
• పరిటాల రవి హత్య కేసులో నిందితులను ఇలాగే చంపేశారు.
• సిబిఐ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతే దేశాన్ని ఎవరు కాపాడుతారు.
• జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులు ఏమయ్యాయి.
• 2 లక్షల మంది టెన్త్ విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అయ్యారు.
• 8 మంది టెన్త్ విద్యార్థుల మరణాలకు కారణం ఎవరు.
• మీ ఇంగ్లీష్ మీడియం ఏమయ్యింది….నాడు నేడు ఏమయ్యింది.
• వ్యవసాయం సర్వనాశనం అయ్యి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
• వైసిపి చేసేది సామాజిక న్యాయం కాదు…సామాజిక హత్యలు
• పోలీసుల అక్రమ కేసులనుంచి క్యాడర్ ను కాపాడుకుంటాం.
• రాష్ట్రంలో సిఐడి ఎందుకు ఉంది…..41 ఎ నోటీసు ఇవ్వడానికి కాదు.
• అతి కీలక కేసులు వస్తే పరిష్కరించడానికి సిఐడి విభాగం ఉంది..వేధింపులకు కాదు.
• ఎంపి రఘురామ కృష్ణం రాజును అరెస్టు చేసి తీవ్రంగా వేధిస్తారా.
• ఎపి పోలీసులకు సమర్థులు అనిపేరు…ఇప్పుడు పూర్తిగా పోలీసు వ్యవస్థ నాశనం అయ్యింది.
• పోలీసు శాఖను డిజిపి నడిపించడం లేదు…తాడేపల్లి నౌకరు పాలిస్తున్నాడు.
• అందుకే డిజిపిలు మారినా…..పోలీసు శాఖ పనితీరుమారడం లేదు.
• ఎస్ సి లపే అట్రాసిటీల కేసులు పెడతారు….ఇది మన పోలీసుల ఘనత
• నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం.
• అక్రమంగా వ్యవహరించిన పోలీసులను వదిలేది లేదు.
• దాడి చేసిన వైసిపి పై కేసులు పెట్టకుండా…బాధితులు అయిన టిడిపినేతలపై కేసులు పెడుతున్నారు.
• ఏడు ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41 ఎ నోటీసులు ఇవ్వాల్సిందే. ఈ నిబంధన పాటించడం లేదు.
• సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది…పోలీసులు చట్టం బద్దంగా ఉండాలి.
• మహిళలను విచారించే సమయంలో ఇంటి వద్దనే విచారించాలని నిబంధనలు ఉన్నాయి.
• గౌతు శిరీష ను అడ్వకేట్ సమక్షంలో ఎందుకు విచారణ చెయ్యలేదు. పోలీస్ స్టేషన్ కు ఎందుకు పిలిపించారు.
• శిరీషను విచారించింది పోలీసులా…వైసిపి గూండాలా. బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకోలేదు. యూనిఫాం ఎందుకు వేసుకోలేదు.
• పోలీసులకు మానవత్వం ఉందా….సిగ్గు ఉందా…అన్నదానం పెడుతుంటే అడ్డుకుంటారా…
• అన్నదానం అనేది మన సాంప్రదాయం….దాన్ని అడ్డుకుంటారా.
• అన్న క్యాంటీన్ రద్దు చేసింది కాకుండా….అన్నం పెట్టే వాళ్లని అడ్డుకుంటారా…
• ఫైబర్ గ్రిడ్, స్కిల్ డవలప్మెంట్, అమరావతిలో విచారణకు పిలిచి నాపేరు, అచ్చెన్న పేరు, లోకేష్ పేరు పెట్టమని ఒత్తిడి చేస్తున్నారా లేదా….
• అక్రమంగా నేతలను నిర్భందించిన ప్రతి పోలీసు అధికారిని కోర్టుకు లాగుతాం.
• రౌడీషీట్లు ఓపెన్ చేసి ప్రతి రోజు స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారు.
• పోలీసు కేసుల సమయంలో ప్రజలకు ఉన్న హక్కులపై ఇంటింటికి ప్రచారం చేస్తాం.
• నేరస్తుల పట్ల వ్యవహరిస్తున్నట్లు రాజకీయనేతలపై పోలీసులు వ్యవహరిస్తున్నారు.
• నారాయణ అరెస్టు ఎంత అక్రమంగా చేశారో చూశాం.
• మాజీ మంత్రి నారాయణను కాదు…వివేకా హత్యలో నిందితులను అరెస్టు చెయ్యాలి….అనుమానాస్పద మరణాలకు కారకులను అరెస్టు చెయ్యాలి.
• అడ్వకేట్ ను ఎందుకు విచారణ సమయంలో అనుమతించడం లేదు
• అడ్వకేట్ ను అనుమతించకపోతే విచారణ నుంచి నిందితులు వచ్చెయ్యవచ్చు.
• అక్రమ అరెస్టులు కారణం అయిన అధికారులు, జడ్జిలు కూడా సస్పెండ్ అయ్యారు.
• ప్రైవేటు కేసులు వేసి పోలీసుల అక్రమ కేసుల పై పోరాడుతాం.
• అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ట్రిబ్యునల్ వేసి అక్రమ కేసులు అన్నీ స్టడీ చేస్తాం…..నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటాం.
• విద్యార్ధుల ఆత్మహత్యలపై లోకేష్ మీటింగ్ పెడితే…సిగ్గులేకుండా దానిలోకి వైసిసి ప్రజా ప్రతినిధులు వస్తారా?
• పైగా తమ పార్టీనేతలు చేసిన పనిని గొప్ప పనిగా చెప్పుకుంటారా.. ?
• బ్రాందీ షాప్ లవద్ద టీచర్లను కాపలా పెట్టినప్పుడే వారు నైతికంగా చనిపోయారు.
• కాలువల్లో పూడిక తీయకుండా, ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా క్రాప్ హాలిడేకు మేం కారణం అంటారా?
• అక్వా, హార్టికల్చర్ రైతులుకూడా క్రాప్ హాలిడే ప్రకటించడానికి ప్రభుత్వమే కారణం
• జగన్ రాష్ట్రానిక పట్టిన అరిష్టం, దరిద్రం. అందుకే క్విట్ జగన్…సేవ్ ఆంధ్రప్రదేశ్.
• జగన్ 175 గెలవడం కాదు…..వచ్చే ఎన్నికలే వైసిపికి చివరి ఎన్నికలు.
• రాజకీయాల్లో ఉండే అర్హత కూడా జగన్ కు లేదు.
• ఒక్క చాన్స్ అన్నారు….అదే చివరి చాన్స్ అయ్యింది. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన కారణంగానే రాజకీయాల్లో ఉండే అర్హతను జగన్ కోల్పోయారు.
• పథకాలకు 300 యూనిట్లు నిబంధన, మూడు రాజధానులు అని ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే తాట తీసేవారు.
•పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు భరోసా ఇస్తూ మీటింగ్ పెడితే దొంగల్లా దూరారు.
•దాన్ని ఏ2 సమర్థిస్తాడా..?
•వైసీపీ నేతలు బరితెగించారు.. లేకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది.
•ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరు.. వస్తానంటే రమ్మనండి.. చూద్దాం
•నేరస్తులకు నేరాలోచనలే వస్తాయి.
•ఎన్నిసార్లు వస్తారో రమ్మనండి చూద్దాం.. ఖబడ్దార్.