-వైసీపీ అసమర్దత, అవీనీతి దుబారనే రాష్ట్రానికి శాపం…
-కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని దేశంలో ఏ ఒక్క రాష్ట్రం జీతాలు తగ్గించలేదు
ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య నాయకులతో జరిగిన టెలీ కాన్పరెన్స్‌లో తెలిపారు. కార్యకర్తలు, నాయకులు ఉద్యోగ సంఘాల పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని దేశంలో ఎక్కడా జీతాలు తగ్గించలేదు ఒక్క జగన్ మోహన్ రెడ్డే ఉద్యోగుల వేతనాల కోత విధించి కరోనా సమయంలో రోడ్డు ఎక్కించారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గిందనే ఒక అసత్య వాదనతో ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసింది. తెలంగాణతో పోల్చిన గత సంవత్సరంతో పోల్చిన రాష్ట్ర ఆదాయం పెరిగిందనే విషయం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
రివర్స్ పాలనలో ఐ.ఆర్ కన్నా తగ్గించి ఇవ్వడం చరిత్రలో మొదట సారి. వైసీపీ పాలనలో మా విధానాలతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆర్ధిక మంత్రి పదే పదే చెబుతూంటే ఆదాయం తగ్గిందని అధికారులు ఎలా చెబుతారు.కేవలం వైసీపీ అసమర్దత, అవీనీతి దుబార వల్లే రాష్ట్రంపై అప్పుల భారం, ప్రజలపై పన్ను భారం, ఉద్యోగుల జీతాలలో కోతలు తప్ప మరోకటి కాదు. ప్రభుత్వ కార్యాలయాల రంగులకు సుమారు రూ. 6000 కోట్లు దుబారా చేశారు, నివాస యోగ్యం కాని భూములకు ఎక్కువ రేటుకి ప్రభుత్వ ధనం వెచ్చించి రూ.7000 కోట్లు అవినీతికి పాల్పడ్డారు, సాక్షి ప్రకటనలు, సలహాదారులు ఈ విధంగా ప్రభుత్వ విధానాలతో వచ్చిన నష్టాన్ని కరోనాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగి 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో సైతం టి.డి.పి ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేవలం ఏరియర్స్ గానే 4 వేల కోట్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చిన హెచ్.ఆర్.ఐ 30 శాతం అమలు చేయడం జరిగింది. అబద్దాలే పునాధులుగా, లూటీనే మెట్లుగా పరిపాలన సాగిస్తున్నా జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం.ఈ టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర స్థాయి నాయకులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.