-బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెలుగుదేశం అడుగులేస్తోంది
-రెండున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలు బలహీన వర్గాలు ఎలా అవుతారు?
-బటన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపినపుడే బీసీల అభ్యున్నతి సాధ్యం
-తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు
బడుగు బలహీన వర్గాలను ఆర్ధికంగా సమాజికంగా రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పోరాడిన జ్యోతీరావుపూలే ఆశయ సాధనే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతీరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షత వహించారు.
కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రెండు శతాబ్దాల క్రితమే బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం పోరాటాలు సాగించినప్పటికీ, స్వాతంత్ర్యానంతరం వారికి అభ్యున్నతి సాకారం కాలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాలుగా పిలవబడే వారికి రాజకీయంగా అవకాశాలు దక్కాయి. గ్రామ సర్పంచుల నుండి చట్ట సభల వరకు అన్నింటా బీసీలకు అవకాశం లభించింది. అప్పటి వరకు ఓట్లు వేయడానికి మాత్రమే అన్నట్లు ఉన్న బీసీలు ఓట్లు వేయించుకుని చట్ట సభల్లో అడుగు పెట్టారు.
రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా అభివృద్ధి సాధించారు. బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకుంటే, దాన్ని చంద్రబాబు 34శాతానికి పెంచారు. జగన్ రెడ్డి వచ్చాక కుట్రపూరితంగా రిజర్వేషన్లను 24శాతానికి కుదించి 17వేల మందికి పదవులు దూరం చేశారు. 26 మంది బీసీ నేతల్ని హత్య చేశారు. 2500 మందికి పైగా బీసీ నేతలపై దాడులకు పాల్పడ్డారు. 700 మందికి పైగా బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వేధఇంచారు. 56కార్పొరేషన్లు ఏర్పాటు చేశానంటూ హడావుడి చేస్తున్న జగన్ రెడ్డి, ఎంత ఖర్చు చేశారు? ఎంత మందికి స్వయం ఉపాధి రుణాలిచ్చారు? పైసా బడ్జెట్ ఖర్చు చేయకుండా, కనీసం ఛైర్మన్లు కూర్చోడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారు. ఆదరణ లాంటి పథకాలు రద్దు చేశారు. విదేశీ విద్య, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి విద్యా పథకాలు రద్దు చేశారు. అయినా ఇంకా బీసీల్ని ఉద్దరించానని జగన్ రెడ్డి సిగ్గులేకుండా చెప్పుకుంటున్నాడని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, పూలే లాంటి మహానుభావుల గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. స్వాతంత్ర్యానికి ముందే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి, వారి హక్కుల కోసం పోరాటం చేసిన తీరు హర్షణీయం. చదువుకుంటే కలిగే ప్రయోజనాలేంటో, వచ్చే మార్పు ఎలా ఉంటుందో వందేళ్ల క్రితమే గుర్తించి నలుగురిని చదివించేందుక పూలే శ్రమించారు. మనం బలహీన వర్గాలమని ఎవరైనా అంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశంలో, రాష్ట్రంలో సగానికి పైగా జనాభా ఉన్నాం. రాష్ట్రంలో రెండున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న బీసీలు బలహీన వర్గాలు ఎలా అవుతారు? బీసీలు ఎవరికి ఓట్లేస్తే వారే అధికారంలోకి వస్తారు. దశాబ్దాలుగా ఓటర్లుగానే మిగిలిపోతున్న బీసీలు పాలకులుగా ఉండాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తొలి అడుగు వేశారు. చదువుకుంటేనే సమాజంలో మెరుగైన గౌరవం లభిస్తుందని పూలే భావించి ప్రోత్సహించారు. స్వాతంత్ర్యానంతరం బీసీ జన గణన కూడా చేయలేకపోతున్నాం. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు వచ్చాక సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారు. బీసీలు మనుగడ సాగించాలంటే, ఉన్నత ఉద్యోగాలు పొందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తాపత్రయపడిన వారిలో పూలే తొలి తరం నాయకుడైతే.. తర్వాత అంబేద్కర్, జగ్జీవన్ రాం ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్, చంద్రబాబులే. సమాన హక్కులు కల్పించడంతో పాటు చదువుకుంటేనే మెరుగైన జీవితం ఉంటుందని ఎన్టీఆర్ గుర్తించారు. వారి అడుగు జాడల్లో చంద్రబాబు గారు బీసీలకు అండగా నిలిచారు. పూలే ఆశయ సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందనడానికి గత ఐదేళ్లలో జరిగిన మేలు. ప్రస్తుతం జరుగుతున్న దుర్మార్గమే నిదర్శనం. కార్పొరేషన్లకు చైర్మన్లు ఇచ్చాం. మంత్రుల్ని నియమించాం అంటున్న జగన్ రెడ్డి ఎంత మంది బీసీలకు స్వతంత్ర్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారమిచ్చారో కూడా చెప్పాలన్నారు.
ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు, నూకసాని బాలాజీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పూలే సేవలు చిరస్మరణీయం. అంబేద్కర్ లాంటి వ్యక్తులే పూలేని గురువుగా అభివర్ణించారంటే పూలే గొప్పతనాన్ని మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వందేళ్ల క్రితమే స్కూల్ పెట్టి మహిళల్ని చదివించారు. అంబేద్కర్, పూలే మాదిరిగా ఎన్టీఆర్ బలహీనవర్గాల అబ్యున్నతి ఆలోచించారు. బీసీలకు మేలు చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. వారి గురించి ఆలోచించి, అండగా నిలిచేది తెలుగుదేశం పార్టీ మాత్రమే.
మాజీ మంత్రి, కె.ఎస్.జవహర్ మాట్లాడుతూ, వందేళ్ల తర్వాత కూడా పూలే గురించి మాట్లాడుకోవడం ఆయన చేసిన కృషికి అద్దం పడుతోంది. చదువుతోనే సమాజాభివృద్ధి అని నమ్మి, ఆచరించిన వ్యక్తి పూలే. నాటి పూలే అడుగుజాడల్లో ఎన్టీఆర్ నడిచారు. బలహీన వర్గాలకు అండగా నిలిచారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే విధంగా బీసీలను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారు. విద్య లేనిదే సమాజంలో వికాసం లేదు. విద్యతోనే సమాజాభివృద్ధి అని నమ్మి భార్యను కూడా చదివించి, ఆమెతో మరికొంత మందికి తరగతులు బోధించేలా చేసి విద్యావంతుల్ని చేసిన మహనీయుడు పూలే. అటువంటి మహనీయుడి ఆదర్శాలను పునికిపుచ్చుకుని తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని వక్తలు పేర్కొన్నారు.
అనంతరం సమాజంలో బడుగు బలహీనవర్గాల నుండి ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి, సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్నవారిని సత్కరించుకోవడం, ప్రోత్సహించడం మన బాధ్యత అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మృదంగం కళాకారిణి, పద్మశ్రీ దొండమూడి సుమతి, రచయిత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు, రంగస్థల నటుడు చిన్ని వెంకటేశ్వర్లు, సీనియర్ పాత్రికేయులు అన్నవరపు బ్రహ్మయ్య, కవి, బీసీ వాది వీరంకి నాగేశ్వరరావు, సేవారంగంలో స్థిరపడిన దామెర్ల ప్రశాంతి, జానపదం, చెక్కభజన కళాకారుడు దానబోయిన సాంబయ్య, జానపదం కోలాటం కళాకారుడు దానబోయిన అప్పారావు, వైద్య రంగంలో విశేషమైన సేవలందిస్తున్న డాక్టర్ నిమ్మల శేషయ్య, శిల్పి ఆరాధ్యుల వెంకటరమణను సత్కరించారు. అదే సమయంలో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య, కోటయ్య, ఖాదర్ బాషా, బైలడుగుల పిచ్చయ్య, తమ్మిశెట్టి నీలకంఠ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్సీ పర్చూరు అశోక్ బాబు, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, సింహాద్రి కనకాచారి, తిరుమల రాజమండ్రి నారాయణ, గంజాం రాఘవేంద్రరావు, తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్, ఎర్రబోతు రమణ, మరుపిల్ల తిరుమలేష్, రమాదేవి, గుర్రపుశాల రామకృష్ణ, అప్పారావు, జంపన శ్రీను, వేములకొండ శ్రీనివాసరావు, కాకు మల్లికార్జున యాదవ్, ఈశ్వరరావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.