Home » వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది

వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది

-టీడీపీ,బీజేపీ, జనసేన పొత్తు రాష్ట్రం కోసమే
-ప్రశాంతమైన కోనసీమలో 10 రోజులు ఇంటర్నెట్ కట్ చేసే పరిస్ధితి ఎందుకొచ్చింది?
-కోనసీమను బంగారు సీమగా తయారు చేయాలన్నదే మా ఆలోచన
-ఎన్టీయే అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు రూ.1.50 కే కరెంట్ ఇస్తాం
-వాలంటీర్లూ…జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు
-అమలాపురం ప్రజాగళం బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు

అమలాపురం: వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని, అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…..ఇవాళ పవన్ నేను కలిసొచ్చాం..మా జోడి సూపర్ డూపర్ హిట్. మమ్మల్ని తట్టుకుని ఎవరైనా నిలబడగలరా? టీడీపీ, బీజేపీ, జనసేన కలయిక మా కోసం కాదు, రాష్ట్రం కోసం. ప్రశాంతమైన కోనసీమను దుర్మార్గులు మరో పులివెందుల చేయాలనుకుంటున్నారు. నేను చేయనిస్తానా? మూడు పార్టీల అజెండా ఒక్కటే…అందాల కోనసీమను బంగారు సీమగా తయారు చేయాలన్నదే మా ఆలోచన. ప్రశాంతమైన కోనసీమలో 10 రోజులు ఇంటర్నెట్ కట్ చేసే పరిస్ధితి ఎందుకొచ్చింది? దీనికి కారణం వైసీపీ పాలన కాదా?

టీడీపీ,బీజేపీ, జనసేన పొత్తు రాష్ట్రం కోసమే
టీడీపీ,జనసేన,బీజీపే పొత్తు రాష్ట్రం కోసమే. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అవినీతి పరుడు, అహంకారి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వ కూటమి ఏర్పాటు చేసి విభజన చట్టంలోని అన్ని హామీలు సాధించాం. ఎయిమ్స్ సహా 11 విద్యా సంస్ధలు తీసుకొచ్చాం. కేంద్రం సహకారంతో పోలవరం 72 శాతం పూర్తి చేశాం. అది పూర్తయి ఉంటే నేడు గోదావరి జిల్లాలకు నీళ్లొచ్చేవి. కానీ జగన్ పోలవరాన్ని ఆపేశారు. 3 ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.

5 ఏళ్లలో రాష్ట్రం అన్నింటిలోనూ వెనుకబడిపోయింది. టీడీపీ హయాంలో వ్యవసాయం, ఆక్వా, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ఆరోగ్య సూచిక, విద్యా ప్రమాణాల్లో నెం. 1 స్ధానంలో ఉన్నాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చాం. కానీ నేడు ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నారా? కోనసీమలో సైతం రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి అప్పుల పాలయ్యారు. యువతకు ఎవరికైనా ఉద్యోగాలొచ్చాయా? మీకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలి. యువతకు స్కిల్స్స్ నేర్పించాలని పవన్ నాతో అన్నారు. నాడు చిరంజీవి ప్రోత్సహంతోనే సినిమాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. ప్రతి పనికి నైపుణ్యం అవసరం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్సిస్తాం. స్ధానికంగా ఐటీ టవర్స్ ఏర్పాటు చేస్తాం. కోనసీమను పర్యాటకంగా అభివృద్ది చేస్తాం.

రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం విక్రయిస్తున్నారు. రూ. 60 ఉన్న బాటిల్ రూ. 200 కి పెంచారు. ఈ నాసికరం మద్యం త్రాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. 5 ఏళ్లలో సీఎం ఒక్కసారైనా గంజాయిపై సమీక్ష చేశారా? అప్పుల్లో రాష్ట్రం నెం. 1 స్దానంలో ఉంది. మద్యాన్ని తాకట్టు పెట్టి రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీసులు, రైతు బజార్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ, కరెంట్ చార్జీలన్నీ పెరిగాయి. జగన్ సంక్షేమం గోరంత, ప్రచారం కొండంత. మేం జగన్ కంటే అధిక సంక్షేమం అందిస్తాం. పాలన చేయమని ప్రజలు అధికారం ఇస్తే మాఫియాను నడుపుతూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు.

ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అన్ని దోపిడినే. మెడపై కత్తి పెట్టి ప్రజల ఆస్తులు రాయించుకుంటున్నారు. జగన్ అన్నం తినటం మానేసి టిఫిన్ గా ఇసుకను, లంచ్ గా మద్యం, డిన్నర్ గా మైన్స్ తింటున్నాడు. రాష్ట్రంలోని సహజ వనరులన్నీ దోచేశాడు. మీ పొలం పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? మీ పొలంలోని సర్వే రాళ్లపై ఆయన బొమ్మలా? ఈ ముఖ్యమంత్రి రంగుల పిచ్చోడు. భూపరిరక్షణ చట్టం అంటూ ప్రజలు భూములు లాగేస్తారు. ఈ చట్టం వచ్చిందంటే మీ భూమి మీ పేరు మీద ఉండదు. 99 శాతం మ్యానిఫెస్టో హామీలు అమలు చేశానని జగన్ అంటున్నాడు. మనుషులను పట్టుకొచ్చి…సమస్యలు పరిష్కారం చేశానంటూ డ్రామాలాడుతున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించామని అబద్దాలు చెప్పారు. వాస్తవానికి ఆరోగ్య శ్రీ ఎక్కడా పని చేయటం లేదు.

ప్రతి సారి బటన్ నొక్కానని జగన్ అంటున్నారు. ఆ నొక్కుడు లో జగన్ బొక్కిందెంత? వైసీపీ వాళ్లు దోచించెంత? మద్యపాన నిషేదానికి, ఉద్యోగాల నోటిఫికేషన్ , కి బటన్ ఎందుకు నొక్కలేదు? టీడీపీ హయాంలో అమలు చేసిన 27 సంక్షేమ పధకాలు రద్దు చేశారు, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీ విద్య, కార్పోరేషన్ రుణాలు అన్నీ రద్దు చేశారు. దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరి చేశారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరినైనా అలాగే చంపి డోర్ డెలివరి చేసినా ఆశ్చర్యం లేదు.

జగన్ వి దింపుడు కళ్లెం ఆశలు
పవన్ డబ్బుల కోసం రాలేదు, ఆయనకు డబ్బు కావాలంటే సినిమాలు తీసుకుంటే డబ్బులు వస్తాయి. కానీ ఆయన ప్రజల కోసం రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం వచ్చారు. పవన్ పై , నాపై జగన్ బూతులు తిట్టిస్తున్నారు. రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. మీ ఉత్సాహం చూస్తుంటే ఇది పెనుతుఫాన్ గా మారుతుంది. ఈ తుఫాన్ కి అడ్డొచ్చినా ఎవరైనా కొట్టుకుని పోవటమే. మీకు పవన్ మీద అభిమానం అంటే సరిపోదు. పవన్ చెప్పినట్టు మీరంతా కూటమి అభ్యర్దులకు ఓట్లేయాలి. టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు టీడీపీకి పడవని జగన్ దింపుడు కళ్లం ఆశతో ఉన్నాడు. అభ్యర్ది ఏ పార్టీ అయినా 3 పార్టీల వారు ఆ అభ్యర్దికే ఓటు వేయాలి.

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. ఓటు చీలడానికి వీలు లేదు, వైసీపీని పాలనను అంతం చేయాలని పవన్ మొదటే చెప్పారు. దీని కోసం మేం త్యాగాలకు సిద్దం పడ్డాం. అందరం కలిసికట్టుగా సమిష్టిగా ముందుకెళ్తున్నాం. మా త్యాగాలు రాష్ట్రం కోసమే. నేను, పవన్ మీ కోసం తిట్లు భరించాము. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

వైసీపీ పాలనలో ప్రతి స్కీమ్ స్కాం కోసమే
ఇళ్ల పట్టాల పేరుతో అమలాపురంలో 100 ఎకరాలు సేకరించారు. ఎకరాకు రూ. 10 లక్షలపైగా స్ధానిక మంత్రి, ఆయన అనుచరులు మింగేశారు. మెడికల్ కాలేజీ పేరుతో రైతుల దగ్గర 50 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వం రూ. 78 లక్షలు ఇస్తే రైతులకు రూ. 50 లక్షలు చెల్లించారు. మిగతా సొమ్మంతా మంత్రి దోచేశారు. పట్టణ మున్సిపాలిటి పార్కింగ్ స్ధలం కూడా మంత్రి అనుచరులు అద్దెకు తీసుకున్నారు. ఆక్వా చెరువు తవ్వాలంటే కప్పం కట్టాలి. ఎన్టీయే అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు 1.50 పైసలకే కరెంట్ ఇస్తాం.

సూపర్ – 10
ప్రజల కోసం సూపర్ సిక్స్ పధకాలు రూపొందించాం. వాటికి మరో నాలుగు అంశాలు పవన్ కళ్యా ను జత చేశారు. సూపర్ 10 తో మీ ముందుకొస్తున్నాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ. నెలకు రూ. 1500 ఇస్తాం. ఆంక్షలు లేకుండా ప్రతి నెల ఒకటే తేదీనో మీ బ్యాంక్ ఖాతాలో జమచేస్తాం. తల్లికి వందనం కింద ఎంతమంది విద్యార్దులున్నా…వారికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, యువతకు నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ. 3 వేలిస్తాం. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తాం. ఫించన్ రూ. 4 వేలకు పెంచి ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకే తెచ్చి ఇస్తాం. ఏప్రిల్ నెల నుంచే రూ. 4 వేల ఫించన్ ఇస్తాం. వికలాంగుల ఫించన్ రూ. 6 వేలకు పెంచుతాం.

వాలంటీర్లూ…జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు
ఎన్టీయే అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల జీతం రూ. 10 వేలకు పెంచుతాం. జగన్ వారికి రూ 5 వేలిచ్చి వాళ్ల చేత ఊడిగం చేయించుకుంటున్నారు. వాలంటీర్లు రాజకీయాలకు దూరంగా ఉండండి. రాజీనామాలు చేసి వైసీపీకి సహకరించొద్దు. రాజీనామాలు చేస్తే మళ్లీ మీ ఉద్యోగం రాదు, జగన్ ఉద్యోగం కోసం మీ ఉద్యోగాలు పొగ్గొట్టుకోవ్వదు. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ అందరికీ డిక్లరేషన్ ప్రకటిస్తాం.

అధికారంలోకి వచ్చాక అమలాపురం నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తాం
అమలాపురం నియోజకవర్గంలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తాం. కొబ్బరి రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడతాం. చేనేత కార్మికులకు ఈ ప్రభుత్వం ఇచ్చే రూ. 24 వేలు పధకం కొనసాగిస్తాం. కష్టాల్లో ఉన్న చేనేతల్ని ఆదుకుంటాం. ఇసుక మాఫియాతో నష్టపోయిన 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తాం. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తాం.

అమలాపురం నుంచి రామచంద్రాపురం, మండపేటను కలుపుతూ కోటిపల్లిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తాం. బాలయోగి చిరకాల వాంచ కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ పూర్తి చేస్తాం. శెట్టిబలిజలకు కళ్యాణ మండపం నిర్మిస్తాం. మాల సమాజం అభివృద్దికి పాటుపడ్డ పీవీరావు ఘాట్ నిర్మాణానికి నిధులిస్తాం. కాపు, అగ్నికుల క్షత్రియ, మిగతా బీసీల కులాలను ఆర్దికంగా పైకి తీసుకొస్తాం. ప్రతి ఏడాది రూ. 30 వేల కోట్ల చొప్పున లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసి అనేక అభివృద్ది పనులు చేస్తాం. పనులు చేసే బాధ్యత మాది, కూటమికి ఓటేసి గెలిపించేందుకు మీరు సిద్దమా? మూడు పార్టీల మద్య ఓటు బదిలీ జరగాలి.

అధికారులు ఎన్నికల కోడ్ పాటించాలి
నేను పవన్ కలిసి రెండు రోజులు రోడ్ షో చేస్తే జగన్ కి భయంతో జర్వం వచ్చింది. ఓటమి భయంతోనే పవన్ పర్యటనలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న పవన్ హెలికాప్టర్ రాకుండా కుట్రపన్నారు. ఖబడార్ జాగ్రత్త. అధికారులంతా ఎన్నికల కోడ్ పాటించాలి. మాకు వర్తించిన రూల్సే జగన్ కి వర్తించాలి. జగన్ పదవికాలం అయిపోయింది. జగన్ అహంకారి, చిరంజీవి, రాజమౌళిని ఇంటికి పిలిచి జగన్ అవమానించారు. పవన్, బాలకృష్ణ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించలేదు. అయినా పవన్, బాలకృష్ణ వీటిని లెక్కచేయకుండా ముందుకెళ్లారు. జగన్ సంస్కారం లేని వ్యక్తులు సీఎం కుర్చీలో కూర్చోడానికి అనర్హులు. ప్రజలంతా టీడీపీ, జనసే,బీజీపీ కూటమిని ఆశీర్వించాలని చంద్రబాబు నాయుడు కోరారు.

Leave a Reply