సీమ రెడ్లు చెక్కుతున్న వంచనా శిల్పం త్రీ కాపిటల్స్ కాన్సెప్ట్

సీమ లో బీసీ లు అయిన ‘బలిజలు, బోయ’లు సంఖ్యా పరంగా ‘రెడ్ల’ కన్నా ఎక్కువ. కానీ అధికారం, పదవులు మాత్రం ఎప్పుడూ ‘రెడ్ల’ వే!… నీలం సంజీవరెడ్డి కాలం నుండీ కూడా. ఎక్కువ మంది రెడ్లు ఆర్ధికంగా బలపడ్డా..ఆ అధికార యావ చావలేదు. చావదు!

సీమలో ‘రెడ్ల’తో పోలిస్తే ఆర్ధికంగా, సామాజిక హోదా పరంగా వెనకబడింది, అణిచివేయబడింది, ఫ్యాక్షన్ లో రెడ్ల కోసం తలలు నరుక్కునే బలిజలు, బోయలు మాత్రమే! ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార రంగాల్లో రెడ్ల పద ఘట్టనలో నలిగిపోయింది, నెత్తురోడిందీ వాళ్లే!!

వేదనతోనో, కోపంతోనో, ఆవేశం తోనో ఉద్యమించాల్సింది వాళ్లే!!ఆ అర్హత వారికే ఉంది! ఆ గొంతులో ఆవేదన ఉంటుంది!!.కానీ…..’కరి’ మింగిన వెలగపండు లెక్క సర్వం మింగిన ‘రెడ్లే’ ఉద్యమాలు చెయ్యడం ఏంటి? ఏ ఒక్క బలిజ, బోయ నాయకుడు ఉద్యమంలో ఎందుకు కనబడడో , ‘రెడ్డి’ రాజ్యం చేసేప్పుడు ఈ ఉద్యమ నాయకులు ‘భంగు’ సేవించి సుషుప్తావస్థ లోనే ఎందుకు పడి ఉంటారో!?…. అనేవి సమాధానం లేని ‘భేతాళ ప్రశ్న’లు!!మచ్చుకి కొన్ని ‘ పిల్లి (ఉద్యమ) పద్మనాధ సింహా’లని’, వాటి తోకలని పరిశీలించండి….

reddysగ్రేటర్ రాయలసీమ ఉద్యమ నాయకులు గంగుల ప్రతాప ‘రెడ్డి’, యంవి మైసూరా ‘రెడ్డి'(మాజీ కాంగ్రెస్, టీడీపీ నాయకులు, ముట్లుడిగిన ముత్తైదువులు)….
రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు బైరెడ్డి రాజశేఖర్ ‘రెడ్డి’ (మాజీ,ప్రస్తుత కాంగ్రెస్,టీడీపీ, బీజేపీ నాయకులు) ….
రాయలసీమ విధ్యావంతుల వేదిక నాయకులు మాకిరెడ్డి పురుషోత్తం ‘రెడ్డి’ .(న్యూట్రల్ ‘ ఘోషా’ లో ఉన్న వైసీపీ పే టియం బ్యాచ్)
రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కె. శివనాగి ‘రెడ్డి’ ….
రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక నాయకులు బొజ్జా దశరధరామి ‘రెడ్డి’ ….
రాయలసీమ నీటి అద్యయన వేదిక నాయకులు శ్రీకంఠా ‘రెడ్డి’ ….
UPSC మాజీ సభ్యుడు, APPSC చైర్మన్ గా చేసి పంచరెడ్డి హయాంలో ఉద్యోగాలని ‘రెడ్ల’కి బహిరంగంగా తెగనమ్మి HC చేత బూతులు తిట్టించుకున్న వెంకట్రామి ‘రెడ్డి’,
JNTU ప్రొఫెసర్ శశిధర్ ‘రెడ్డి’
SKU ప్రొఫెసర్ సదాశివ’రెడ్డి’
సీనియర్ అడ్వకేట్ విశ్వనాథ’రెడ్డి’
SVU ప్రొఫెసర్ G. జయచంద్రా ‘రెడ్డి’ ,
కృష్ణ మోహన్ ‘రెడ్డి’
రాయలసీమ అద్యయనాల సంఘం ప్రెసిడెంట్ .. భూమన సుబ్రహ్మణ్య ‘రెడ్డి’

కాగా…..వీళ్ళ సభలకు గొర్రెలకి తోలుకువచ్చే కాంట్రాక్ట్ పొందిన వాళ్ళు:
SDHR విద్యాసంస్తల చైర్మన్ ,డైరక్టర్ – DVS చక్రవర్తి ‘రెడ్డి’ ,D రామ సునీల్ ‘రెడ్డి’
సీకాం విధ్యాసంస్తల చైర్మన్ సురేంద్ర నాథ్ ‘రెడ్డి’
లా కాలేజ్ చైర్మన్ R తిప్పా’రెడ్డి’
YS విద్యార్ది విభాగం రాష్ట్ర కార్యదర్శి L రాజశేఖర్ ‘రెడ్డి

గనులు తవ్వుకుని, ఫ్యాక్షన్ చేసి 8,9 దశాబ్దాలలో అందరినీ తొక్కేసి ఇంతగా బలపడ్డ కులం రాష్ట్రంలో మిగిలిన రెండు ప్రాంతాల్లో ఒక్కటన్నా ఉందా!?
నీటి ప్రాజెక్టుల కోసమో, కంపెనీ ల కోసమో ఉద్యమిస్తే అది జనాల ఉపాధిని, ఆర్ధిక అభివృద్ధిని పెంచుతుంది. సకల కుల అభివృద్ధి జరుగుతుంది!! రాజధాని కోసం ఎగబడితే అది ఇప్పటికే డబ్బు, అధికార రుచి మరిగిన ఆధిపత్య కుల మానవ మృగాల వేట కి మిగిలిన వాళ్ళు ఎర అవడం మినహా బావుకునేది ఏమీ ఉండదు.

‘సీమ’కి కావాల్సింది ‘విద్యా, ఉద్యోగ అవకాశాలు, తద్వారా వచ్చే ఆర్థికాభివృద్ధి!!.’సీమ రెడ్ల’ కి కావాల్సింది రాజధాని ద్వారా తమ ఆస్థుల్లో వచ్చే రియల్ బూమ్, ఫ్యాక్షన్ సంస్కృతి మరింత బలంగా కొనసాగింపు, అధికార యావ, కులాధిక్యత, ఫ్యూడల్ భావజాల సుస్థిరత!!.”సీమ” కి కావాల్సింది వేరు, ‘సీమ రెడ్ల’ కి కావాల్సింది వేరు!!.కృత్రిమ ఉద్యమాలని భుజాల మీదకి వేసుకుని, వంగి నడుస్తున్న, పాకుతున్న ‘ఏసు రెడ్డి’ భక్తులైన వీళ్ళని చూస్తే ‘విషయం’ అర్ధం అవుతుంది!!

– పాకాల పరిశుద్ధరావు

Leave a Reply