గుంతల్లో రోడ్డు వెదుక్కోవడమే జలగన్న జమానాలో వెరైటీ!!

– నారా లోకేష్

సాధారణంగా దేశంలో ఎక్కడైనా రోడ్లపై గుంతలు కామన్. అయితే జలగన్నజమానాలో గుంతల్లో అక్కడక్కడ మాత్రమే రోడ్డు కన్పించడం వెరైటీ. ఇది యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట ప్రధాన రహదారి. రహదారి పొడవునా భారీగోతులతో నిండిపోయి రోడ్డు ఎక్కడుందా అని వెదుక్కునే పరిస్థితి నెలకొంది. ఇటీవల పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ డబుల్ రోడ్డు అయితే తెలంగాణా, సింగిల్ రోడ్డు ఉంటే ఎపి అని ఎగతాళి చేసినా సైకో సిఎం జగన్ కు సిగ్గూ,లజ్జాలేదు. అస్తవ్యస్తమైన పాలనతో 12లక్షలకోట్ల అప్పుతో ఖజానా ఖాళీచేసి రోజువారీ ఖర్చులకు కూడా వెదుక్కునే పరిస్థితి తెచ్చాడు. ఈ దివాలాకోరు ముఖ్యమంత్రి మొఖం చూసి కాంట్రాక్టర్లు పరారవుతున్నారు. అందుకే యావత్ ఆంధ్రపదేశ్ నోట ఇప్పుడు వస్తున్న మాట సైకో పోవాలి… సైకిల్ రావాలి?!

Leave a Reply