– వెలగపూడి గోపాలకృష్ణ
ఓ చిన్ని ప్లాస్టిక్ ముక్క మీద మరో రాగిచిప్ అంటి ఉండి, ఎక్కడో ఉన్న శాటిలైట్ నుంచి సిగ్నల్స్ స్వీకరించి, మనకు మాటలూ చిత్రాలూ అందిస్తోంది కదా? అటువంటప్పుడు – ఒక పెద్ద రాగి యంత్రం తో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించి ఆలయం లో స్థాపించడం కుదరదా ? దానికి ఎనర్జీని గ్రహించేటటువంటి శక్తి లేదా ?? విశ్వకర్మాది శిల్పాచార్యులు ముడిరాగి, ఇత్తడిలోహాలని సంగ్రహించి, వేలఏళ్ల క్రితమే ప్రపంచానికంతటికీ విజ్ఞానాన్ని అందించారు. అందుకే దేవాలయాలు కట్టేటపుడు ఆలయగోపురం మీద ఒక శూలం/చక్రం రూపంలో యాంటెన్నా , ఆలయం ముందు ఇత్తడితో ధ్వజస్తంభమ్ తో అనంతమైన శక్తి కేంద్రాలు గా మార్చే అద్భుత విజ్ఞానాన్ని అందించారు ఈ విశ్వానికి !! జగన్నాథ