Suryaa.co.in

Andhra Pradesh

వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు

-కేసీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు
-8 ఏళ్లు అధికారంలో ఉండి టీఆర్ఎస్ తెలంగాణ‌కు చేసింది ఏంటి?
-హరీష్ రావుకు కేసిఆర్ తో తగువులు ఉంటే అక్కడ చూసుకోండి
-కేసీఆర్ ను మా చేత తిట్టించాలనే విధంగా హ‌రీష్ రావు తీరు కనిపిస్తోంది
-హ‌రీష్ రావు ఒక అధికారిని బూటు కాలుతో త‌న్నారు. అటువంటి ఆయ‌న మాకు నీతులు చెబుతారా..?
-ఆ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్ప‌మ‌నండి
-రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖా మంత్రి అమ‌ర్నాథ్

రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. హ‌రీష్ రావు కేసీఆర్ మ‌నిషా.? లేక‌ రామోజీరావు మ‌నిషా.?. హ‌రీష్ రావుకు ఆయ‌న మేన‌మామ‌తో ఏమైనా గొడ‌వులు ఉంటే.. నేరుగా ఆయన్ను తిట్టాల‌ని ఉంటే ఆయ‌నే తిట్టవచ్చు కదా..!

అలా కాకుండా మ‌మ్మ‌ల్ని ఏదైనా అంటే, మేము వాళ్ల మామ, అక్కడ ముఖ్యమంత్రిగారిని తిడితే ఆయ‌న‌ ఆనంద‌ప‌డలానా..?. కేసీఆర్ ను మా చేత తిట్టించాలనే విధంగా హ‌రీష్ రావు తీరు కనిపిస్తోంది. కేసీఆర్ ను, హరీష్ రావును, టీఆర్ఎస్ ను చూసి నేర్చుకోవాల్సిన దుస్థితి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కేసీఆర్ కు, హ‌రీష్ రావుకు ఏమైనా త‌గువులు ఉంటే వాళ్ళూవాళ్ళూ చూసుకోవాలి. అంతేకానీ మా రాష్ట్రం మీద ఎందుకు ప‌డ‌తారు?. మ‌మ్మ‌ల్ని తిడితే మీకు అక్క‌డ ఏమైనా మార్కులు ప‌డ‌తాయా?

మ‌న కంటే తెలంగాణ ఆర్థిక‌ ప‌రిస్థితి బాగుంది. ఎందుకంటే, హైద‌రాబాద్ నగరం వారికి ఉండ‌డం వ‌ల్ల. ఆ రాష్ట్రం ఆర్థిక ప‌రిస్థితులు బాగున్న క్ర‌మంలో క ూడా.. ఆ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో చెప్ప‌మ‌నండి. మా రాష్ట్రంలో ఉన్న పేద‌లకు ఏ ర‌కంగా సంక్షేమం అందిస్తున్నామో.. ఏ విధంగా మంచి ప‌రిపాల‌న అందిస్తున్నామో.. ఇక్కడకు వ‌చ్చి చూస్తే తెలుస్తుంది. 8 ఏళ్లు అధికారంలో ఉండి టీఆర్ఎస్ తెలంగాణ‌కు చేసింది ఏంటి?

తెలంగాణ ఉద్య‌మంలో గ‌వ‌ర్న‌మెంట్ అధికారుల‌ను ఏ ర‌కంగా ట్రీట్ చేశారో ప్ర‌జ‌లు చూశారు.. నోటికొచ్చిన తిట్లు తిట్టి, బూటు కాళ్ళతో త‌న్నిన సంద‌ర్భాలూ చూశాం. హ‌రీష్ రావు ఒక అధికారిని బూటు కాలుతో త‌న్నారు. అటువంటి ఆయ‌న మాకు నీతులు చెబుతారా..?

మామ, అల్లుళ్ల‌కు ఏమైనా త‌గువులు ఉంటే మీరూమీరు చూసుకోండి. మా రాష్ట్రానికి నీతులు చెప్పే అవ‌స‌రం కానీ, సూచ‌న‌లు ఇచ్చే అర్హ‌త కానీ ఆ ప్రాంతంలో ఉన్న నాయ‌కుల‌కు, ఆ పార్టీకి, ఆ ప్రాంత మంత్రులకు, ముఖ్య‌మంత్రికి లేవు.

LEAVE A RESPONSE