Suryaa.co.in

Telangana

‘కమ్మ‘టి బంధం వారిది!

కష్టజీవులు, సాయం చేయడమే వారికి తెలుసు
నా ఉత్నతికి శ్రీనివాసరావు కారణం
పోచారం గెలుపు వెనుక ఉంటామన్న కమ్మ సంఘం
బాన్సువాడ కమ్మ సంఘం సమావేశంలో స్పీకర్ పోచారం
కమ్మ వారితో నాకు గత ముప్పై సంవత్సరాలుగా ఆత్మీయత
కమ్మ వారు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు
బాబును విడుదల చేయాలని స్పీకర్ పోచారం డిమాండ్
బాన్సువాడ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కి మద్దతుగా వర్ని మండల కేంద్రంలో “కమ్మ వారి ఆత్మీయ సమ్మేళన సభ”.
కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన పోచారం శ్రీనివాస రెడ్డి
సమ్మేళన సభకు ముందు కమ్మ సంఘం ప్రతినిధులు, సభ్యుల ఆద్వర్యంలో 300 కార్లతో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల మీదుగా భారీ ర్యాలీ. బాన్సువాడ పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి అభివాదం చేసిన పోచారం

ఆత్మీయ సమ్మేళన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఆత్మీయ సమ్మేళనం ద్వారా నాకు మద్దతు తెలిపిన కమ్మ సోదర, సోదరీమణులు అందరికీ నా కృతజ్ఞతలు. కమ్మ వారితో నాకు గత ముప్పై సంవత్సరాలుగా ఆత్మీయత ఉన్నది, ఇది విడదీయరాని బంధం. కమ్మ సామాజిక వర్గం వారిని ఎల్లప్పుడూ నా కుటుంబ సభ్యులు గానే భావిస్తాను.

వ్యవసాయం చేసుకుంటున్న నన్ను ప్రోత్సహించి రాజకీయాల వైపు తీసుకువచ్చారు నా రాజకీయ గురువు శ్రీనివాస రావు గారు. తరువాత నన్ను ప్రోత్సహించి, రాజకీయంగా అవకాశాలు కల్పించింది NT రామారావు గారు. 1994 నుండి కమ్మ వారు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కమ్మ కుటుంబాలు నన్ను తమ కుటుంబ సభ్యుడిగా భావించి ఎప్పుడు వచ్చినా భోజనం పెట్టి ఆదరించారు.ఇది గొప్ప సమావేశం, నేను నా జీవితంలో ఎప్పుడూ మరవను. మన బందాన్ని ఇంకా బలపరుచుకోవాలి.

రాష్ట్రంలో మొదటిసారిగా బాన్సువాడ నియోజకవర్గంలో కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మీకు ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా అనుక్షణం వెంట ఉంటాను. కాలికి ముళ్ళు దిగితే నా పంటితో తీస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశానంటే దానికి కారణం కేసీఆర్ పెద్ద మనసుతో నిధులు మంజూరు చేయడమే. మంచి మెజారిటీతో విజయం సాదిస్తానని సర్వేలు చెబుతున్నాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక మెజారిటీ బాన్సువాడ లో వస్తుందని సర్వేలో ఫలితం వచ్చింది.బాన్సువాడ లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకడం లేదు.ఈరోజు మీ ర్యాలీ తో ప్రత్యర్ధుల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. నియోజకవర్గంలో గ్రామాలు, కుల సంఘాలు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ నలుగురికి సహాయం చేసే దాన గుణం కలిగిన వారు కమ్మ కులస్తులు.వ్యవసాయ రంగంలో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం అయితే, తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ వన్ బాన్సువాడ నియోజకవర్గం.

దక్షిణ భారతదేశంలో అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబు. రాజకీయ కక్షలతో ఆయనను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా ఖండిస్తున్నా. తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఈసందర్భంగా కమ్మ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. 1994 నుండి తామంతా పోచారం గారి వెంటే ఉన్నామని, తాము అందరం పోచారం గారికే ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు.

రైతు కుటుంబాలకు చెందిన తమకు వ్యవసాయం అభివృద్ధి కోసం అవసరమైన సహాయం అందించడంతో పాటుగా గ్రామాల అభివృద్ధికి నిధులను మంజూరు చేశారు. రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారు. పోచారం మా కుటుంబ సభ్యులు, మేము ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉన్నామని స్పష్టం చేశారు. ఇంత మేలు చేసిన పోచారం గారిని గెలిపించి రుణం తీర్చుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా పోచారం నామినేషన్ ఫీజు కోసం వర్ని మండలం నెహ్రూ నగర్ కు చెందిన అప్పసాని శ్రీనివాస రావు రూ. 25,000 నగదు సహాయం అందించారు.

LEAVE A RESPONSE