‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని జగన్ ను చూసి నాయుడు తెచ్చారు అని చంకలు గుద్దుకుంటున్నారు కొందరు.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం గత దశాబ్దంలో జరిగిన కృషి, ఎదురైన సవాళ్లను మూడు ప్రధాన దశల్లో పరిశీలిద్దాం.
చంద్రబాబు తొలి దశ (2014-2019)
లైఫ్ ట్యాక్స్ (Life Tax) రద్దు: ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల పన్నుల చట్టం 1963 ప్రకారం ఆటో రిక్షాలకు చెల్లించాల్సిన లైఫ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేశారు.
ఆ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 9.79 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరింది. ఇందులో 5.66 లక్షల మంది ప్యాసెంజర్ ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆ పన్ను రద్దు ద్వారా ప్రభుత్వంపై రూ. 141 కోట్ల అదనపు భారం పడింది.
వాటితో పాటు ట్రాక్టర్లు, ట్రాక్టర్ ట్రైలర్లకు కూడా పన్ను మాఫీని విస్తరించారు.
కేవలం రూ. 5కే డ్రైవర్లతో సహా పేదలు, మధ్యతరగతి ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.
లైఫ్ ట్యాక్స్ తగ్గింపు ప్రణాళికతో పాటు, భవిష్యత్తులో ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికలను కూడా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు స్వయంగా ఆటో నడిపి, ‘రాష్ట్రానికి మొదటి డ్రైవర్ నేనే’ అని చెప్పుకోవడం ద్వారా డ్రైవర్ల వర్గానికి గౌరవం, గుర్తింపు దక్కేలా బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచార
దశ 2: జగన్ పాలన (2019-2024)
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘YSR వాహన మిత్ర’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి డ్రైవర్‌కు రూ. 10,000 వార్షిక ఆర్థిక సాయం అందించారు. ఇది 2.61 లక్షల మందికి వర్తింపజేశారు. ఈ కాలంలో పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విపరీతంగా పెరిగింది. 12 సంవత్సరాలు నిండిన వాహనాలకు ఏకంగా రూ. 20,000 వార్షిక హరిత పన్ను విధించడం రవాణా రంగానికి తీవ్ర భారం కలిగించింది. అన్న క్యాంటీన్లు రద్దు చేశాడు.
కరోనాతో ఆటోడ్రైవర్ల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. పెట్రోల్ ధరలు పొరుగు రాష్ట్రాల కంటే పది రూపాయలు ఎక్కువ చేశారు. ట్రాఫిక్ పెనాల్టీలు విపరీతంగా పెంచి ఇష్టం వచ్చినట్లు వసూలు చేశారు. ఇక రోడ్లలో గుంతలను పట్టించుకోకపోవడంతో వాటికి వచ్చే రిపేర్లతో వారి బ్రతుకులు దుర్భరంగా.. ప్రాణాంతకంగా మారాయి.
దశ 3: కూటమి ప్రభుత్వం (2024+)
కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ లేకున్నా, డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని నిరూపించింది. ‘స్త్రీశక్తి’ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఎదురైన వ్యాపార నష్టాన్ని గుర్తించి, తక్షణమే ఈ సాయాన్ని ప్రకటించారు.
వార్షిక ఆర్థిక సాయాన్ని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచారు. మొత్తం 3.23 లక్షల దరఖాస్తులు రాగా, 2,90,669 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 436 కోట్లు కేటాయించింది. రవాణా రంగానికి, డ్రైవర్లకు అత్యంత భారంగా మారిన గ్రీన్ ట్యాక్స్‌ను కూటమి ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. 13 సంవత్సరాలు నిండిన వాహనాలకు రూ. 20,000 నుంచి కేవలం రూ. 3,000కు తగ్గించారు.
7-12 సంవత్సరాల వాహనాలకు త్రైమాసిక పన్నులో 50% నుంచి రూ. 1,500కు తగ్గించారు. ఈ నిర్ణయం లక్షలాది మంది పాత ఆటో, లారీ డ్రైవర్లకు ఆర్థికంగా అతిపెద్ద ఉపశమనం కల్పించింది. వేలాది కిలోమీటర్ల మేర రోడ్లను యుద్ధప్రాతిపదికన రిపేర్ చేశారు, కొత్తవి వేశారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు. రోజుకు వంద మిగిలినా.. ఏడాదికి ముప్పై వేలకు పైగా లబ్ధి.
లబ్ధిదారులలో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం లబ్ధిదారుల్లో 80% మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు వర్గాల వారే ఉన్నారు.
మీరే చెప్పండి ఆటో డ్రైవర్లకు ఎవరు మేలు చేశారో.. ఎవరి నుండి ఎవరు కాపీ కొట్టారో?