రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

నందిగామ : ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మీద, మా యువ నాయకుడు లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ వ్యక్తిగత స్వార్థంతో గత నాలుగు సంవత్సరాలుగా , నందిగామ నియోజకవర్గంలో మీ ప్రవర్తనతో నియోజకవర్గ కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ క్యాడర్ ను నిరుత్సాహానికి గురిచేస్తూ ఈ నాలుగున్నర ఏళ్లలో ఎంపీ కేశినేని నాని పార్టీలో తన ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించడం వాస్తవం కాదా?

ముఖ్యంగా నందిగామ నియోజకవర్గంలో చంద్రబాబు మీద రాళ్ళు వేయించిన మొండితోక బ్రదర్స్ ను పదే పదే పొగడడం ద్వారా తెదేపా కార్యకర్తలను మానసికంగా ఇబ్బంది పెట్టారు. కొండలను,గుట్టలను దోచేసిన నేతలు మీ దృష్టిలో నిజాయితీపరులైతే క్రమశిక్షణ కలిగిన పార్టీలో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీ దృష్టిలో ఏంటో మీరే చెప్పాలి. అయినా మేము ఎక్కడా నోరు జారకుండా మనసులో మా భాధను ఆవేదనను అణుచుకుని భాధను మౌనంగా భరించమే తప్ప ఎక్కడా పార్టీ గీత దాటి ప్రవర్తించలేదు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడ కూడా అధిష్టానం నిర్ణయాన్ని అధినేత నిర్ణయాన్ని దాటకుండా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగామే తప్ప ఎక్కడా అసహనాన్ని ప్రదర్శించలేదు. ఈ రోజుతో అవినీతిపరులైన అధికార పార్టీ నేతలతో మీకున్న అనుబంధం గుట్టు రట్టయింది.పార్టీ మారిన వెంటనే మీరు చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చాయి.రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి మీరే ప్రత్యక్ష సాక్షులు. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు మా అధినాయకుడు మీద మా లోకేష్ మీద చేస్తే సహించేది లేదు

Leave a Reply