కాపు రామచంద్రా రెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి మృతిపై అనుమానాలున్నాయి

• జులై 04, 2021న కాపు రామచంద్రా రెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఆత్మహత్యా యత్నం చేశారు
• సహస్త్ర కనస్ట్రక్షన్ ఎండీ సుగవాసి చక్రధర్ బిల్లులు చెల్లించకపోవడంతో మంజునాథ్ రెడ్డి ఆత్మహత్య అంటున్న తండ్రి మహేశ్వర రెడ్డి.
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

కాపు రామచంద్రా రెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మంజునాథ్ రెడ్డి వ్యాపారాల రీత్యా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్ మెంట్‌ 101వ నంబరు ఫ్లాటుకి అప్పడప్పుడు వచ్చి కొద్ది రోజులు బసచేస్తారని, వివాద రహితుడని స్థానికులు చెబుతున్నారు ఎలాంటి వ్యక్తి మరణ వార్త తెలిసిన వెంటనే కాపు రామచంద్రా రెడ్డి హుటాహుటిన తాడేపల్లి చేరుకున్నారు.

మీడియా ముందు తన అల్లుడు మరణం వెనుక పలు అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైన్స్, బ్రాహ్మణి స్టీల్స్ కు ఎండీగా కాపు రామచంద్రా రెడ్డి పని చేశారు. గతంలో ఆర్థిక లొసుగులు వచ్చి గాలి జనార్థన్ బెదిరింపులకి భయపడి రామచంద్రా రెడ్డి మార్చి05, 2014లో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అప్పుడే చాలా అనుమానాలు వచ్చాయి. గాలి జనార్థన రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు.

జులై 04, 2021న కాపు రామచంద్రా రెడ్డి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా బళ్లారి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కొడుకు శ్రవణ్ కుమార్ రెడ్డితో కియా కంపెనీ వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో ఆత్మహత్యా యత్నం చేశాడు. వైసీపీ వాళ్లతో ఆర్థిక లావాదేవీలు ఉన్నా, వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉన్నా వేధింపులకు గురిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. వైసీపీ పరంపరలో భాగంగానే కాపు రామచంద్రా రెడ్డి కుమార్తె డాక్టర్ శ్రవంతి భర్త మంజునాథ్ రెడ్డి ఆత్మహత్య ఆన్నారు. ఎవరు రామచంద్రా రెడ్డి కుటుంబం మీద కక్ష్య గట్టారు? ఆ కుంటుంబంలోని వ్యక్తులంతా ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు? మంజునాధ్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అతని మరణం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.

మంజునాథ్ తండ్రి మహేశ్వర రెడ్డి మాట్లాడిన విడియోని మీడియా వారికి చూపించారు. సహస్త్ర కనస్ట్రక్షన్ ఎండీ సుగవాసి చక్రధర్ బిల్లులు చెల్లించకపోవడంతోనే మంజునాథ్ రెడ్డి చనిపోయారని చెప్పిన తండ్రి మహేశ్వర రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామి రెడ్డికి, ఎమ్మేల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి సంబంధించిన రాంకీ కంపెనీకి డైరక్టర్ గా పని చేసిన సుగవాసి చక్రధర్ మంజునాథ్ రెడ్డికి రాంకీ కంపెనీ, సహస్త్ర కనస్ట్రక్షన్ నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. ఏ చిన్న ఘటన జరిగిన పలు అనుమానాలు కలిగేలా వైసీపీ నాయకులంతా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.

అయోథ్య రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకుల అనుచరుడు చక్రధర్ బిల్లులు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బంది పెట్టి మానసిక ఒత్తిడులకు గురయ్యేలా చేసి మంజునాథ్ రెడ్డి మరణానికి కారణమయినతని మీద కేసు పెట్టారా లేదా? అని ముఖ్యమంత్రి, పోలిసులు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. వైసీపీ అక్రమ మైనింగ్ లో తలదూర్చిన వారంతా జగన్ రెడ్డి గ్యాంగ్ చేతుల్లో కనుమరుగవుతున్నారు. జగన్ రెడ్డికి అక్రమ లింకుల్లో ఉన్న వారంతా ఇలా ఆత్మహత్యలకు గురి కావాల్సిందేనా? వైసీపీకి చెందిన సొంత ఎంపీలు, ఎమ్మేల్యేలు సంబంధించిన సంఘటన కనుక వైసీపీ వాళ్ళు, పోలిసులు నిజాలని నిగ్గుతేల్చుతారా లేదా అని ప్రజలలో అనుమానం వ్యక్తమవుతుందన్నారు.