– నేటి యువతకు తెలుగు భాష గొప్పతనం తెలియజేయాలి
– తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్: నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణములోని డా. నందమూరి తారకరామారావు కళ మందిరంలో సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం -2023 ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై , 12 మంది పురస్కార గ్రహితలకు పురస్కారాలను ప్రదానోత్సవం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” తెలుగు కళలను , తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి యువతకు తెలుగు భాష గొప్పతనం వారి తల్లిదండ్రులు తెలియజేయడం లేదన్నారు. కేవలం సంపాదనే ద్యేయంగా తమ పిల్లలను ఆ దిశగా నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. అంతరించిపోతున్న కళలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ బలరాం , సిఎండి ,సింగరేణి కాలరీస్ , ఆచార్య వెళుదండ నిత్యానంద రావు , ఉపాధ్యక్షులు , సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం , కోట్ల హనుమంతరావు ,రిజిస్టర్ , తదితరులు పాల్గొన్నారు.