మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ : ఎన్నికలప్పుడు రేవంత్ ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. వాటిలో ఏవీ అమలు చేయకపోవడంతో బీ ఆర్ ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తున్నాం. అది సీఎం రేవంత్ రెడ్డికి నచ్చకే అరెస్టులతో డై వెర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. లగచర్ల ఘటన లో 16 మంది రైతులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని కుట్ర పూరితంగా అరెస్టు చేశారు. కావాలనే మూడు నెలల కాల్ డేటా తీశారు. లగచర్ల లో కుట్ర లేదు పాడు లేదు. ఎలాగైనా కే టీ ఆర్ ను దేంట్లోనైనా అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు.
కే టీ ఆర్ నరేందర్ రెడ్డి తో సురేష్ తో మాట్లాడితే తప్పేమిటీ ? ఫార్ములా వన్ రేసులో కే టీ ఆర్ ను ఇరికించాలని చూశారు. ఇప్పుడు లగచర్ల ఘటనలో ప్రయత్నం చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ నేతలందరినీ జైల్లో పెట్టాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నారు. ఎంత మందిని జైల్లో పెట్టినా గ్రామానికి వంద మంది కేసీఆర్ లు ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడం. రేవంత్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం ఊరుకునేది లేదు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్.. కే టీ ఆర్ ను ప్రథమ ముద్దాయి అని ఎలా అంటారు? పోలీసులకు డైరెక్షన్ చేస్తున్నారా?
ఈ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఉందా ?: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
లగచర్ల ఘటనలో ప్రభుత్వం కట్టు కథలు చెబుతోంది. బీ ఆర్ ఎస్ ను బద్నామ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు.
ఈ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఉందా ? నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసే పద్ధతీ అదేనా ? కేసీఆర్ హయం లో ఇలా జరిగిందా ? ప్రజల మధ్యకు వెళితే ఎలా తిడుతున్నారో రేవంత్ కు అర్థమవుతుంది. కేసీఆర్ పాలనలో భూ సేకరణ ఎపుడైనా జరిగిందా ఇలా వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలి. పాలనా చిన్నా భిన్నం అయింది.
దాడులను బీ ఆర్ ఎస్ ప్రోత్సహించదు : మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్
కేసీఆర్ హయం లో భూ సేకరణ సందర్భంగా అధికారులను ప్రజలు నిలదీస్తే మేము వారిని ఒప్పించి మెప్పించాము. లగచర్ల లో అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. అధికారులు గ్రామాల్లోకి వెళ్లేప్పుడు ఒక్క సారి అక్కడి పరిస్థితులు బేరీజు వేసుకుని వెళ్ళాలి. దాడులను బీ ఆర్ ఎస్ ప్రోత్సహించదు. అన్ని పార్టీల వాళ్ళు లగచర్ల లో ఉన్నారు ..అందరూ ఒకే మాట మీద ఉన్నారు. కేవలం బీ ఆర్ ఎస్ పార్టీకి ఈ ఘటన ఆపాదించడం సరికాదు.
కేసులకు బీ ఆర్ ఎస్ భయ పడదు: పార్లమెంటరీ పార్టీ నేత కె .ఆర్ .సురేష్ రెడ్డి
కేసీఆర్ హయం లో భూ సేకరణ దేశం లోకెల్లా ఆదర్శంగా జరిగింది. రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే కొడంగల్ లో భూ సేకరణ జరగడం లేదు. భూ సేకరణ జరిగినా అక్కడ కంపెనీ రాదని రైతులు రేవంత్ మీద అప నమ్మకం మీద ఉన్నారు. రేవంత్ కుట్రలను ఖండిస్తున్నాం. కేసీఆర్ అహింసా యుతంగా తెలంగాణ సాధించారు. హింస ను బీ ఆర్ ఎస్ ప్రేరేపిస్తుందంటే ఎవరూ నమ్మరు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే బీ ఆర్ ఎస్ అక్కడ ప్రశ్నిస్తూనే ఉంటుంది. కేసులకు బీ ఆర్ ఎస్ భయ పడదు. ఎన్ని అరెస్టులు చేసుకున్నా మా పోరాటం ఆగదు.