– బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. రేవంత్ సర్కారు అక్రమంగా కేసుల పెడుతోంది. సిఐని ప్రశ్నించినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. ఫిర్యాదులు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వంపై ప్రజలు తప్పకుండా తిరగబడతారు. ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసుల రాజ్యం నడుస్తుంది. కౌశిక్ రెడ్డిని ఇప్పటి వరకు కోర్టు ముందు ఎందుకు ప్రవేశ పెట్టడం లేదో కారణం చెప్పడం లేదు. అక్రమ అరెస్టు లకు భయపడే ప్రసక్తే లేదు.