అన్న ప్ర‌సాదంపై దుష్ప్ర‌చారం త‌గ‌దు

– టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో భ‌క్తుల‌కు నిత్యం అందించే అన్న ప్ర‌సాదం అద్భుతంగా ఉంద‌న్నారు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి రోజూ వేలాది మంది స్వామి , అమ్మ వార్ల‌ను ద‌ర్శించు కునేందుకు వ‌స్తార‌ని, ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా వెంగ‌మాంబ అన్న‌దాన స‌త్రంలో అన్న ప్ర‌సాదం అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అన్నం అంద‌జేస్తున్న‌ట్లు చెప్పారు భూమన క‌రుణాక‌ర్ రెడ్డి. దేశ వ్యాప్తంగా భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాదాలు అందిస్తున్న ఆల‌యాల్లో టీటీడీ ప్ర‌థ‌మ స్థానంలో నిలుస్తోంద‌న్నారు. అయితే అన్న‌ప్ర‌సాద భ‌వంలో బియ్యం స‌రిగా ఉడ‌క లేద‌ని కొంద‌రు భ‌క్తులు ఆందోళన చేసిన‌ట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply