Suryaa.co.in

Telangana

సీబీఐ విచారణ చేసుకున్నా అభ్యంతరం లేదు

– కొందరి ఒత్తిడి తో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు
– మృతుడి పై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి
– రౌడీ షీట్ కూడా ఉంది
– మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

హైదరాబాద్: భూపాల పల్లి లో రాజలింగ మూర్తి హత్యను బీ ఆర్ ఎస్ మాజీ శాసన సభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతోంది. ఈ హాటీని బీ ఆర్ ఎస్ పార్టీ కి కేసీఆర్ కు హరీష్ రావు కు ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నించడం దుర్మార్గం. స్థానిక భూ వివాదం నేపథ్యం లో ఈ హత్య జరిగిందని ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైంది.

కొందరి ఒత్తిడి తో రాజలింగ మూర్తి భార్య నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ హత్యపై సీబీ సీఐడి విచారణ ను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. సీబీసీఐడీ కాదు సీబీఐ విచారణ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మేడిగడ్డ పై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారు. దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం. మృతుడి పై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి రౌడీ షీట్ కూడా ఉంది. బీ ఆర్ ఎస్ పై నా పై ఆరోపణలు చేయడం ద్వారా విచారణను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.

హత్యలో అరెస్టయిన వ్యక్తుల పేర్లతో రాజలింగ మూర్తి పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి మతి భ్రమించింది. బట్ట గాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. హత్యా రాజకీయాలు కాంగ్రెస్ కు అలవాటు. బీ ఆర్ ఎస్ హత్యారాజకీయాలను ప్రోత్సహించదు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పై కూడా కోమటి రెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ ను హత్య చేశారని ఆరోపించారు.

వేముల వీరేశం ఇపుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు. కోమటిరెడ్డి పూటకో మాట మాట్లాడతారు. ఆయన నోటికి మొక్కాలి. పోలీసులు నిస్పాక్షిక విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలి. కాంగ్రెస్ నేతలు కుటిల రాజకీయాలు మానుకుంటే మంచిది.

LEAVE A RESPONSE