• మంత్రులతో అమరావతిపై దుష్ప్రచారం చేయించిన జగన్ సిగ్గులేకుండా అదే ప్రాంతంలో పేదలకు ఎలా ఇళ్లస్థలాలు ఇస్తున్నాడు?
• సుప్రీంకోర్టు చెప్పినప్రకారమే జగన్ పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చాడా? హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండటానే ఇళ్లస్థలాలు ఎందుకిచ్చాడు?
• మంత్రి జోగిరమేశ్ ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే నోరుపారేసుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు.
• చీకట్లో 7 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి ముసలోడా.. 8 కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్ నమ్ముకున్నవాడు ముసలోడో రమేశ్ చెప్పాలి
• జోగి రమేశ్ మరోసారి హద్దులుదాటితే బడితె పూజ చేస్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
ప్రజా రాజధాని అమరావతిని నిట్టనిలువునా చంపేసిన ముఖ్యమంత్రి, అదే ప్రాంతంలో పేదలకు సెంటుపట్టా భూములు ఇస్తున్నానని జబ్బులు చరుచుకుంటూ నిన్న నానా రకాలుగా మాట్లాడాడని, దళితులు, బలహీనవర్గాలను ఉద్ధరిస్తున్నట్టు కట్టుకథలు చెప్పాడని, నాలుగేళ్లలో పేదలకోసం పెట్టిన దానికంటే రాజధాని విధ్వంసానికే జగన్ ఎక్కువ ఖర్చుపెట్టాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
మంత్రులతో అమరావతిపై దుష్ప్రచారం చేయించిన జగన్ సిగ్గులేకుండా అదే ప్రాంతంలో పేదలకు ఎలా ఇళ్లస్థలాలు ఇస్తున్నాడు?
“ అమరావతిని ముక్కలు చేయడానికి, తనకేసులు వాదించే న్యాయవాదులకే జగన్ ఎక్కువ ఖర్చుపెట్టాడు. ప్రజారాజధానిపై ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ విద్వేషాలను రాష్ట్రమంతా విస్తరించి తనపబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అమరావతి ఎడారి, శ్మశానమని తనమంత్రులతో దుష్ప్రచారం చేయించిన ముఖ్యమంత్రి, బుద్ది లేకుండా అదే ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకొని పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తున్నాడో సమా ధానం చెప్పాలి.
అమరావతిలో పేదలకు జగన్ కడతానంటున్న 50వేలఇళ్లు, పోలవ రం నిర్వాసితులకు కట్టిస్తే, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. ఆ ఆలోచన జగన్ కు రాకపోవడం నిజంగా విచారకరం. అమరావతితో పాటు, పోలవరాన్ని నిర్వీర్యంచేసిన జగన్ రెడ్డి, కావాలనే రాజధానిలో ఇళ్లనిర్మాణం పేరుతో పేదల్ని వంచిస్తున్నాడు. నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఎన్నిఇళ్లు కట్టించాడో కేంద్రప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది.
చేస్తున్నది తప్పని తెలిసే జగన్ రెడ్డి ఆఘమేఘాల మీద రాజధానిలో ఇళ్లనిర్మాణానికి శంఖు స్థాపన చేశాడు
రాజధాని మాస్టర్ ప్లాన్లో ఎక్కడ నివాస సముదాయాలు ఉండాలి..ఎక్కడ ఇతర భవనాలు ఉండాలో స్పష్టంగా పేర్కొంటే, ముఖ్యమంత్రి దానికి విరుద్ధంగా ఎక్కడో ఇళ్ల స్థలాలు ఇవ్వడమేంటి? రాజధానిలో పేదలకు ఇచ్చే ఇళ్లపట్టాలు తుదితీర్పునకు లోబడి ఉండాలని సుప్రీంకోర్టు చెబితే, హైకోర్టులో రాజధాని కేసుల విచారణ పూర్తై, తీర్పు రిజర్వ్ లో ఉంటే, ఆఘమేఘాలమీద జగన్ రెడ్డి ఇళ్లనిర్మాణానికి ఎందుకు శం ఖుస్థాపన చేశాడు?
తాను చేసేది తప్పన్నభయంతో, రాజధానికి భూములిచ్చిన రైతు లకు ముఖంచూపించలేకనే 8 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్ నమ్ము కున్నాడు. మాట్లాడితే పేదలు.. పెత్తందారులనే జగన్ రెడ్డిని మించిన పెత్తందారు దేశంలో మరొకరు ఉండరు.
జగన్ సహా ఆయనపార్టీ నేతలంతా అడ్డగోలుగా ప్రజల సొమ్మును దోచుకున్నవారే. రూ.43వేలకోట్లు జగన్ దోచుకున్నాడని చెప్పడానికి ఆయనపై ఉన్న అవినీతికేసులే నిదర్శనం. అధికారం కోల్పోయిన వెంటనే జగన్ మరలా జైలుకెళ్లడం ఖాయం. అవినీతిలో నిండామునిగిన జగన్ రెడ్డి, సిగ్గులేకుండా తాను పేదలపక్షమని మాట్లాడుతున్నాడు.
ఇంగ్లీషు మీడియం తానే తీసుకొచ్చినట్టు జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. నాడు- నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల్ని నాశనం చేశాడు. ఉపాధ్యాయులు లేకుండా చేసి, వసతులు కల్పించకుండా పేదల విద్యార్థులకు విద్యను దూరంచేశాడు. నాలుగేళ్లలో 7 లక్షలకోట్ల అప్పులుచేసి, రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టాడు. టీడీపీప్రభుత్వం ప్రభు త్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించింది. నాలుగేళ్లలో జగన్ ఒక్క ఉద్యో గం ఇచ్చిందిలేదు. డీఎస్సీ అమలుచేయలేదు.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశాడు.
జగన్ రెడ్డి, అతనిమంత్రుల్ని మించి తిట్టగలం.. సంస్కారవంతులం కాబట్టే సంయమనంతో ఉంటున్నాం
జగన్ రెడ్డి, అతని పనికిమాలిన మంత్రులు తిడితే, మేం తిట్టలేమా? సంస్కారవంతు లం కాబట్టే, మేం బూతులు మాట్లాడటం లేదు. జోగిరమేశ్ కు బూతులు మాట్లాడటం తప్ప తనశాఖలో ఏంజరుగుతుందో తెలియదు. ముఖ్యమంత్రి మంత్రుల్ని బూతులు తిట్టేలా ప్రోత్సహిస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తిం చాలో తెలియని వెధవలు పోలీసుల అండతో పేట్రేగిపోతున్నారు. అధికారం, పోలీసులు పక్కన పెట్టి వస్తే ఎవరికి ఎలా బుద్ధిచెప్పాలో అలానే చెబుతాం.
చిమ్మచీకట్లో 7 కిలోమీటర్లు నడిచి వెళ్లిన చంద్రబాబు ముసలోడా.. 8కిలోమీటర్లు హెలికాఫ్టర్లో వెళ్లిన జగన్ రెడ్డి ముసలోడో సమాధానంచెప్పు జోగిరమేశ్. నిజమైన పేదల పక్షపాతులు ఎవరో, వారిపై స్వారీచేస్తున్న పెత్తందారులెవరో ప్రజలకు బాగాతెలుసు. జోగిరమేశ్ మరోసారి అడ్డూఅదుపు లేకుండా నోరుపారేసుకుంటే బడితపూజ ఖాయమని హెచ్చ రిస్తున్నాం. జోగిరమేశ్ అసెంబ్లీలో మాట్లాడిన బూతుల్ని జగన్ రెడ్డి సమర్థించాడు. రౌడీలను వేసుకొని చంద్రబాబు ఇంటిపైకి వస్తే, మెచ్చి మంత్రి పదవి ఇచ్చాడు.
దళిత సంక్షేమంపై బహిరంగచర్చకు వచ్చే దమ్ము, ధైర్యం నాగార్జున, సురేశ్ లకు ఉన్నాయా?
జగన్ పదవులిచ్చి వెధవల్ని ప్రోత్సహిస్తుంటే, ఒకడినిచూసి ఒకడు రెచ్చిపోతున్నాడు. చేతగాని వెధవలు బూతులు మాట్లాడటం తప్ప, ఒక్కడికీ వాళ్ల శాఖలపై అవగాహన లేదు. వారి శాఖల్లో ఏం జరుగుతుందో తెలిస్తే, ప్రజల మధ్య బహిరంగచర్చకు వస్తే, వారి బాగోతమేంటో తేలుస్తాం. సంక్షేమపథకాలు సృష్టించిందే తెలుగుదేశం పార్టీ. సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీనేతలు, మంత్రులు మాకు సంక్షే మం గురించి చెప్పడం సిగ్గుచేటు. గుడ్డలూడదీసుకొని తిరిగిన ఆదిమూలపు సురేశ్, మేరుగ నాగార్జునలు ఏం మాట్లాడుతున్నారో వారికైనా తెలుసా?
అంబేద్కర్ కు నిజమైన గుర్తింపు, గౌరవం ఇచ్చింది తెలుగుదేశంపార్టీనే. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుచేసింది తెలుగుదేశమే. జగన్ దళితుల్ని ఎలాచూస్తున్నాడో దళిత మంత్రులకు తెలియదా? చంద్రబాబు దళితులకు అందించిన పథకాలు ఎన్ని… జగన్ అమ లు చేస్తున్నవి ఎన్ని? దళితుల సంక్షేమంపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం మంత్రులు మేరుగ నాగార్జున, సురేశ్ కు ఉందా? వాళ్లు ప్రజలసమక్షంలో చర్చకు వస్తే నాలుగేళ్లలో జగన్ దళితులకు ఏం చేశాడో, గతంలో టీడీపీప్రభుత్వం ఏంచేసిందో ఆధారాలతో సహా నిరూపిస్తాం.” అని ఆనంద్ బాబు సవాల్ చేశారు.