Suryaa.co.in

National

వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు కూడా స్థానం లేదు

– కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ

ఢిల్లీ: వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పిస్తారంటూ కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉంటారని, ముస్లిమేతరులు ఉండరని అమిత్ షా ఉద్ఘాటించారు. వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.

వక్ఫ్ బోర్డుల ద్వారా మైనారిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, ఇస్లాం ధార్మిక సంస్థలను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు ఏంచేయాలి? వక్ఫ్ సంపదను అమ్ముకుని తినేవారిని పట్టుకోవాలి. వక్ఫ్ పేరుతో ఆస్తులను వందల ఏళ్ల పాటు షాపులకు కిరాయికి ఇచ్చినవారిని పట్టుకోవాలి. వక్ఫ్ ఆదాయం తగ్గుతూ వస్తోందని అమిత్ షా అన్నారు.

LEAVE A RESPONSE