– ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
గత నాయకులు వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. మేము వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాం. జవాబుదారీతనం తీసుకొచ్చాము . స్థిరమైన విధానాలతో రాష్ట్రాన్ని నడుపుతున్నాం. నాలుగేళ్లలో పాలనా విధానంలో తేడా గమనించి ఉంటారు. ఉద్యోగులు సైతం ప్రభుత్వంలో భాగం. ఉద్యోగులు సైతం ప్రజలకోసం పని చేయాలన్నది , అందుకు ప్రోత్సాహం అందించాలన్నది సీఎం వైయస్ జగన్ తపన.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గణనీయమార్పులు తీసుకొచ్చాము.భూముల రీ సర్వ్ అనేది ఓ గొప్ప సంస్కరణలు. ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతోనే సాగుతున్నాయి. దీన్ని సీఎం వైయస్ జగన్మననంలో ఉంచుకున్నారు. మీ సాయం, సహకారం అయన గుర్తించారు. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
కోవిడ్ సంక్షోభం వళ్ళ నిలిచిపోయిన పలు పనులు వచ్చేరెండు మూడేళ్ళలో పూర్తి చేస్తారు. ప్రజలకోసం అయన చేస్తున్న సేవ, కృషిలో ఉద్యోగులు సైతం భాగం అయ్యారు. అందుకే ఉద్యోగుల సంక్షేమం కోసం అయన కట్టుబడి ఉన్నారు.