Suryaa.co.in

Features

హిమాలయాల గురించి ఎవరికీ తెలియని 5 రహస్యాలు ఇవే..

అద్భుతమైన హిమాలయాలకు ఉన్న అందాలు మాటల్లో వర్ణించలేనివి. హిమాలయాల్లో పర్యటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో చాలా ప్రదేశాలు ఊహించని విధంగా అనేక కల్పనలతో ముడిపడి ఉన్నాయి.

హిమాలయాలు అంటేనే గుర్తొచ్చేవి మానస సరోవరం, కైలాష్, అమర్ నాథ్ మొదలైన పవిత్ర స్థలాలు. ఇవి కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన హిమాలయాల్లో రహస్య ప్రదేశాలు చాలా ఉన్నాయి. హిమాలయాల్లోని ఈ రహస్యాలను సైన్స్ కూడా ఇప్పటి వరకు ఛేదించలేకపోయింది. ఈ పనిలో కూడా శాస్త్రవేత్తలు విజయం సాధించలేకపోయారు. అలాంటి రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1)గురుభోంగ్ మార్ సరస్సు

ప్రపంచంలో ఉన్న పెద్ద సరస్సుల్లో గురుభోంగ్ మార్ సరస్సు ఒకటి.
ఈ సరస్సు సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తులో, టెస్టా నదితో కలిసి ఉంటుంది.

కంచనగంగా పర్వతం పక్కనే ఇది ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ సరస్సులోని నీరు చలికాలంలో కూడా గడ్డ కట్టవు, దీనికి ఓ కారణం ఉంది.

ఆ సరస్సు ఎప్పుడూ గడ్డ కట్టి ఉండటంతో ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలను గురు పద్మ సాంబవ అనే ట్రైబల్ దేవుడు చూస్తాడు. దీంతో తన వద్ద ఉన్న ఒక ఆయుధంతో సరస్సులోని ఒక ప్రదేశంలో టచ్ చేస్తాడు… అప్పటి నుంచి ఆప్రదేశంలో నీరు గడ్డకట్టకుండా ఉంటాయి. దీంతో అక్కడి ప్రజల నీటి కష్టాలు తీరుతాయి, ఆ నీరు మైనస్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా గడ్డ కట్టవు.

2 ) జ్ఞానగంజ్ అనేది ఓ సిద్ధ ఆశ్రమం

ఈ ఆశ్రమంలో ఉండేవారికి చావు అనేది ఉండదట, ఇక్కడ ఉండే వారు గాలిని పీల్చుకుని జీవిస్తుంటారు, అయితే ఈ ప్రదేశం అందరికీ కనబడదు. దేవుడి మీద నమ్మకం ఉండి, ఎవరికీ ద్రోహం చేయకుండా, అందరి మంచి కోరుకునే వారికి మాత్రమే ఈ ప్రదేశం కనిపిస్తుందట… అక్కడ ఉండే యోగులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. వారు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతామో కూడా చెప్పగలరు. మన పూర్వం కూడా చెప్పగలరట.

3 )రూప్ కాండ్ సరస్సు:

ఈ సరస్సుకు అస్థి పంజరాల గుట్ట అని కూడా అంటారు. ఇక్కడ పుర్రెలు, ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తాయి. అయితే అవి ఎవరివి అనేది ఇంకా రహస్యంగానే ఉంది. కొంత మంది అవి రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారివి అంటారు. వీరంతా రాజ కుటుంబానికి చెందిన వారని, ఒక దేవత శాపం కారణంగా ఇలా మరణించారని మరికొందరు చెబుతారు, దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇవి ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.

4 ) గ్యాంగ్ ఖార్ ప్యునేసం:

ఇది ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతం. ఇప్పటి వరకు ఎవరూ ఈ పర్వత శిఖరాన్ని చేరుకోలేదు, ఈ పర్వతం భూటాన్ లో ఉంది.ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించకపోవడంతో దీనిని ఒక రహస్య ప్రదేశంగా పిలుస్తున్నారు. భూటానీస్ లు ఈ ప్రాంతాన్ని దేవుళ్లు, యతిలు సహా అనేక పౌరాణిక జీవాలకు నిలయంగా నమ్ముతారు. ఇక్కడ అనేక వింత సంఘటనలు, వర్ణించలేని శబ్ధాలు, విచిత్రమైన కాంతులు ఏర్పడుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే వారు చెబుతారు.

5 ) మౌంట్ కైలాష్:

మౌంట్ కైలాష్ అనేది హిమాలయాల్లోనే వింతైన ప్రదేశం, ఇక్కడి నుంచే ప్రపంచ మొదలవుతుందని చెబుతారు. ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడని నమ్ముతారు. ఇది సముద్ర మట్టానికి 21,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

– జానకీదేవి, తణుకు

LEAVE A RESPONSE