Suryaa.co.in

Andhra Pradesh

ఈ మూడు సమాజం కోసం పుట్టిన పార్టీలు

-నేతలు నియోజకవర్గ ప్రజల కోసం పని చేయాలి
-బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ: కూటమి మీద ఉన్న విశ్వాసంతో మనందరిని ప్రజలు ఆశీర్వదించారు. గత పాలన లో రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. బటన్ నొక్కి పథకాలు ఇస్తున్న అనే అహంకార ధోరణి ఉన్న పాలనతో ప్రజలు విసుగుచెందారు. పొత్తులో భాగంగా ఎవరైతే సీటు ఆశించి, రాకపోయినా కూటమి కోసం ప్రతి ఒక్కరు పని చేశారు.

ఈ మూడు పార్టీ ల కలయిక సమాజం కోసం పుట్టిన పార్టీ లు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుంది. ప్రజలే దేవుళ్ళు,సమాజమే దేవాలయం అన్న నినాదం తో ఉన్న టీడీపీ. సమాజంలో ఇబ్బంది వివక్షత కి గురవుతున్న ప్రజలకి జనసేన అండగా నిలిచింది.

మూడు పార్టీ ల నినాదంతో ఒక్కటై రాష్ట్ర అభివృద్ధికి అవసరమని ప్రజలు గమనించారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించటానికి కూటమి ముందుకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్వర్తించేలా కృషి చేస్తుంది.

కూటమి లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఓటమి చెందిన నేతలు కానీ వారి నియోజకవర్గ ప్రజలు కోసం పని చేయాలి. దేశ అభివృద్ధి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ నాయకులు అమిత్ షా, మోదీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం కృషి చేస్తారు. గెలుపు కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు.

LEAVE A RESPONSE