Suryaa.co.in

Andhra Pradesh

బాబు జైలు బ్లాక్ నీళ్లలో ఏదో కలుపుతున్నారు!

– బాబు స్నానం చేసేది ఆ నీళ్లతోనే
– ఆ నీళ్లను పరీక్షించాల్సిందే
– బాబు జైలు గది అంతా వేడి
– బాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమే ప్రత్యామ్నాయం
– అమలాపురం మాజీ ఎంపీ జి. హర్షకుమార్

చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు . జైలు విషయాలు తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయంలో పుష్కరాల అప్పుడు నన్ను 18 రోజులు జైల్లో ఉంచారు. తర్వాత జగన్ హయంలో 48 రోజులు జైల్లో ఉంచారు.

చంద్రబాబు ఉన్న గది డైరెక్ట్ గా 6 గంటలకే సూర్యుడు డైరెక్ట్ గా కిరణాలు పడతాయి.10 గంటల వరకు చాలా వేడిగా ఉంటుంది. తర్వాత 3 గంటల నుంచి వెనుక గోడకు ఎండ తగులుతుంది.మొత్తం మీద పగలు అంత వేడితో ఉంటుంది. జైల్లో ఒక సూపరింటెండెంట్ గది లో మాత్రమే AC ఉంటుంది.చర్మం మీద ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి.

వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లి AC VIP రూమ్ లో పెట్టాలి. దానిలో ఒక బెడ్ ఉంటుంది.అది తక్షణంగా ప్రభుత్వం చేయవలసిన పని. ఇంతకు ముందు ముద్రగడ పద్మనాభం ని అదే గదిలో ఉంచారు. నన్ను చంద్రబాబు హయంలో అక్కడే ఉంచారు.

ఇంకో విషయం . చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే.. చంద్రబాబుకి భోజనం,వాటర్ బయటనుంచి వస్తుంది. ఆయన ఉంటున్న స్నేహ బ్లాక్ లో వచ్చే నీళ్లతో ఆయన స్నానం చేస్తారు. వెంటనే ఆ నీళ్లను లాబ్ టెస్ట్ లకు పంపాలి. దానిలో ఏదో కలుపుతున్నారు అనేది బయటకు వచ్చిన విషయం. ఒకవేళ దీనిమీద నాకు నోటీస్ ఇవ్వాలనుకుంటే… ముందుగా నీళ్లు టెస్ట్ చేయించండి.

ఎందుకంటే నా స్వీయ అనుభవాలు చెప్తున్నాను. ఒకరోజు నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.ఆ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉంచి, అర్ధరాత్రి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కు పంపారు.అక్కడ MRI చేసిన తర్వాత.. స్కాన్ చేసిన తర్వాత obstruction వచ్చింది అని తేల్చారు.దాన్ని నమ్మకుండా ఆ రిపోర్ట్ లను విజయవాడ ,విశాఖపట్నం పంపించారు.వాళ్ళు కూడా నిర్దారించి న తర్వాత, హాస్పిటల్ లో ఉండడానికి permission ఇచ్చారు.

ICU లో 3 రోజులు ఉన్న తర్వాత ఇంకా 3 రోజులు observation లో ఉండాలని డాక్టర్ లు written గా కేస్ షీట్ మీద వ్రాస్తే దాన్ని కొట్టి వేయించి, ICU నుంచి డైరెక్ట్ గా మళ్ళీ జైలు కి పంపేశారు. అంత దుర్మార్గం గా ఆలోచన చేస్తాడు జగన్ .

కాబట్టి ఆయన వాడే స్నానం నీళ్లు కూడా బయట నుంచే పంపాలి. డాక్టర్ లు నిమిత్త మాత్రులు. గవర్నమెంట్ ఏమి చెప్తే అదే వ్రాస్తారు. కాబట్టి వెంటనే ఆయన్ను గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలి.

LEAVE A RESPONSE