– మీ మంత్రుల ఫామ్ హౌస్ లను ముందు కూలగొట్టు
– హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ అండ
– అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలే
– కలెక్టర్ అయిన ఆర్డీఓ అయిన ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి
– బావమరిదికి కాంట్రాక్టులు వచ్చేలా చేయటమే ఇన్నోవేటివ్ థింకింగ్
సిరిసిల్లలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: ఈ ప్రభుత్వం లో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేతికి తెలుస్తలేదు. వీళ్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో….సర్కస్ నడుపుతున్నారో తెలుస్తలేదు. ఒక శాఖ పర్మిషన్ ఇస్తే మరొక శాఖ ఇళ్లను కూలగొడుతుందా? పర్మిషన్ ఇచ్చి తర్వాత ఇళ్లు కూలగొడితే దానికి బాధ్యుడు ఎవడు? ఒక చిన్న పాప, ఒక గర్భిణీ ఇళ్లు కూలగొట్టదని బతిమాలిన కనికరం చూపలేదు. నీ ప్రభుత్వం చేసిన తప్పుకు ఎవరు బాధ్యులు?
నీ అన్న ఇళ్లు ముట్టనివ్వవు. బడుగుల బతుకులు మాత్రం చిధ్రం కావాలి. మీ అన్నకు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేంత సమయం. పేదలను మాత్రం బుల్డోజర్లతో తొక్కేస్తావా? హైదరాబాద్ లో ప్రజలు ఓట్లేయలేదని వాళ్లపై పగ తీర్చుకుంటమంటే ఊరుకోం.
హైదరాబాద్ లో మేము కట్టిన 40 వేల డబుల్ బెడ్ రూమ్ లు వాళ్లకు ఇవ్వు. బాధితులకు ముందు మేము కట్టిన ఇళ్లను ఇవ్వు. తర్వాత వాళ్లను కదిలించు. నీ భాషలో చెప్పాలంటే చేతనైతే పర్మిషన్ ఇచ్చిన వాళ్లమీద చర్యలు తీసుకో. పేదవాళ్లు మాత్రమే బతుకు దెరువుకోసం నాలాలాా మీద ఇళ్లు కట్టుకుంటున్నారు.
మూసీ నది మీద పెద్ద పెద్ద బిల్డర్లు బడా బిల్డింగ్ లు కడుతున్నారు. వాటిపై చర్యలేవీ? మీ మంత్రుల ఫామ్ హౌస్ లను ముందు కూలగొట్టు. పేదోళ్లను చావకొట్టి ఏం సాధిస్తావ్? హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ అండగా ఉంటది. ఈ ముఖ్యమంత్రి మతి లేని నిర్ణయాల కారణంగా, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్లలో నేతన్నలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ బతుకమ్మ చీరల ఆర్డర్ ను సిరిసిల్లకు ఇచ్చారు.
రంజాన్ తోఫా, క్రిస్ మస్ కానుక, యూనిఫామ్ ల ఆర్డర్లు కూడా ఇచ్చి, ఇక్కడి నేతన్నలకు ఆదాయం డబుల్ అయ్యేలా కేసీఆర్ చేశారు. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉండి ఆయన ఇచ్చిన మాట ప్రకారం, సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యల నివారణకు కృషి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. బతుకమ్మ చీరల ఆర్డర్ల కారణంగా, సిరిసిల్లలో ఆత్మహత్యలు ఆగిపోయాయి. సంక్షోభం ముగిసింది.
ఇప్పుడిప్పుడే నేతన్నలు కాస్త ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. సిరిసిల్లను మరో తిరుపూర్ చేయాలని మేము ప్రయత్నించాం. కానీ ఈ ముఖ్యమంత్రికి బుర్రలేదు. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ప్రజలు గెలిపించారని కోపం. కాంగ్రెస్ ను గెలిపిస్తలేరన్న కోపంతో బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేశారు. బతుకమ్మ చీరల్లో కుంభకోణం అయ్యిందన్నారు. అసెంబ్లీ వేదికగా విచారణ చేసుకోవాలని నేనే సవాల్ విసిరాను. ఈ ముఖ్యమంత్రి పిచ్చోడు. పిచ్చి నిర్ణయాల కారణంగా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక బంద్ చేశారు. ఎందుకు బంద్ చేశారో తెలియదు. మంచి పథకాలను బంద్ చేయాల్సిన అవసరమేమిటి? ఇప్పటికే 22 మంది నేతన్నలు చనిపోయారని లిస్ట్ ఇచ్చినా. ఆటో డ్రైవర్లు, రైతులు చనిపోతున్నారని, చనిపోయిన వారి పేర్లతో లిస్ట్ ఇచ్చినా. ఇప్పటికీ దాని మీద స్పందన లేదు.
సిరిసిల్ల లో మీరు 365 రోజులు పని కల్పిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మరి పది నెలలుగా పని లేకుండా చేశారు. మేము 3, 312 కోట్ల ఆర్డర్లు ఇస్తే, మీరు అంతకు డబుల్ ఇవ్వాలి కదా? తెలిసి తెలియకుండా కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడే మాటలకు నేతన్నలు ఆగం కావొద్దు. మా ప్రభుత్వం పోతదని మేము అనుకులే. 3, 312 కోట్లలో 250 కోట్లు మాత్రమే మేము పెండింగ్ పెట్టాం.
ఉన్నోళ్లకు కాకుండా పేదోళ్లకు ఒక చీర కాదు రెండు చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిండు. ఆ రెండు చీరల ఆర్డర్లు ఇక్కడి సిరిసిల్ల నేతన్నలకు ఇవ్వు. ఏ కారణం చేత సిరిసిల్లను నేతన్నలను గోస పుచ్చుకుంటున్నావ్? పదేళ్లుగా లేని ఆత్మహత్యలు మళ్లీ జరుగుతుంటే నీ మనసు చలించటం లేదా? కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు.
ఇక్కడి అధికారులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగాా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మా ఫోటోలు ఉండవు. నా మీద నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తి, ఇక్కడ ఏదో అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ను పుట్టించిందే కేసీఆర్. ఒళ్లు దగ్గర పెట్టుకోని అధికారులు పనిచేయాలే.
కాంగ్రెస్ నాయకులే పోస్టులు, మార్కెట్ కమిటీ పదవులు అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. 54 పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్ట్ ను బయట పెట్టాలి. రాత పరీక్షల్లో అవకతవకలు జరిగాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు పోస్ట్ లు వచ్చేలా అక్రమాలు చేశారు. కలెక్టర్ అయిన ఆర్డీఓ అయిన ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి.
ఏపీ లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎక్స్ ట్రా లు చేస్తే వాళ్ల పరిస్థితి ఏమైంది తెలుసుకోవాలి. మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కేసీఆరే. అప్పుడు అందరి లెక్కలు తేలుస్తాం. ఈ రోజు అతిగా చేస్తున్న వారికి అధికారంలోకి వచ్చాక మిత్తి తో సహా చెల్లిస్తాం. రేవంత్ రెడ్డి నా మీద ఏమైనా పగ తీర్చుకోవాలంటే నేను సిద్ధంగా ఉన్నా.
కాంగ్రెస్ వాళ్లు ఎన్నో డైలాగులు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికీ రైతు భరోసా లేదు, ఏదీ రుణమాఫీ? రైతులు సెల్పీ లతో నిరసన తెలుపుతున్నారు. నాలుగు రోజులైతే కాంగ్రెసోళ్లు ఊర్లల్లో తిరిగే పరిస్థితి ఉండదు. ఎల్లకాలం మోసం చేస్తామంటే నడవదు. ఈ మూర్ఖపు ప్రభుత్వం చేసే తప్పులకు మూల్యం అనుభవించక తప్పదు.
ఈ సీఎం మాట్లాడితే ఇన్నోవేటివ్ థింకింగ్ అని అంటాడు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవటమే ఇన్నోవేటివ్ థింకింగ్. అర్హత లేని బావమరదికి కాంట్రాక్టులు వచ్చేలా చేయటమే ఇన్నోవేటివ్ థింకింగ్.
ఇన్నాళ్లు మనం ఇళ్లే కట్టలేదంటూ ఆరోపణలు చేసిన ఇప్పుడు మనం కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు ఇళ్లను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవటమే ఇన్నోవేటివ్ థింకింగ్. లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ యువతకు ఆ విషయం చెప్పుకోవటంలో మనం విఫలమయ్యాం.
ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చినప్పటికీ చెప్పుకోలేకపోయాం. ప్రజలకు ఇప్పడిప్పుడే అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. రెండు లక్షల ఉద్యోగాలని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ పోయాడు? రెండు లక్షల ఉద్యోగాలు ఏమో గానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయి.