ఈ జీవో రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వర్తిస్తుంది

-చీకటి జీవో కాదు… ప్రాణాలు నిలిపే జీవో
– ప్రజల ప్రాణాలు కాపాడే ఈ జీవో అవసరమా.. కాదా..?
– ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదని బాబు చెప్పగలడా?
– కందుకూరు మారణకాండకు బాబు సభాస్థలే కారణం కాదా..?
– ర్యాలీలు, రోడ్‌ షోలు నిషేధం అని జీవోలో ఎక్కడైనా చెప్పారా..?
– జరిగిన మారణకాండకు సిగ్గుతో తలదించుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
– కనీస సంస్కారం లేకుండా ఉన్మాదిలా, తనది రాక్షస సంస్కృతి అని బాబు నిరూపిస్తున్నాడు
-ః వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుసజ్జల రామకృష్ణారెడ్డి
– కుప్పంపై చంద్రబాబు దండయాత్ర
– అన్ని రాజకీయ పార్టీలూ ప్రజలప్రాణాలకు కట్టబడి ఉండాల్సిందే
– ఆ జీవోకు వైఎస్సార్సీపీ కూడా కట్టుబడే ఉంటుంది.. ఉండక తప్పదు
– చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించి గెరిల్లా యుద్ధం చేయాలనుకుంటున్నాడా..?
– తనను ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లు బాబు కలరింగ్‌
– బాబు ముందు గాయాలు, కట్లు ప్రదర్శన.. వెళ్ళాక అన్నీ మాయం
– కుప్పం ప్రజలకు చేసింది చెప్పుకోలేకే ఇన్ని డ్రామాలు
– చంద్రబాబును అడ్డుకున్నది పోలీసులు కాదు… జనం పట్టించుకోవడం లేదు
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

కుప్పంపై చంద్రబాబు దండయాత్ర:
-తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబునాయుడు చేసిన మానవ తప్పిదం వల్ల జరిగిన దుర్ఘటనల్లో 8 మంది కందుకూరులో, గుంటూరులో ముగ్గురు చనిపోయారు
-దాని తర్వాత ఒక బాధ్యత కలిగిన వ్యవస్థగా ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం భావించింది.
-ప్రజల ప్రాణాలను హరించేంతగా రిస్క్‌ ఉండటం వల్లే రోడ్లపై సభలు కరెక్ట్‌ కాదు అని జీవో ఇచ్చింది
-ఏ రాజకీయ పార్టీ అయినా రోడ్లపై సభలు పెట్టొద్దు…ప్రత్యామ్నాయ స్థలాల్లో సభలు పెట్టుకోవాలని సూచించింది
-అపోహలకు తావు లేకుండా సుధీర్ఘ వివరణతో ప్రభుత్వం జీవో తెచ్చింది
-ఈ ప్రభుత్వం తెచ్చిన జీవోకు కట్టుబడి ఉండేది లేదు..ఉల్లంఘిస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఛాలెంజ్‌ చేస్తున్నారు.
-ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ప్రభుత్వ జీవోను చాలెంజ్‌ చేస్తూ నేరుగా కుప్పం మీదకు దండయాత్రకు వెళ్లాడు
-దానికి చంద్రబాబు ఎన్ని భాష్యాలు చెప్పినా, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉటంకించినా జరిగిన ఘోరాన్ని, చేసిన తప్పును తప్పించలేవు
-ఎన్ని విమర్శలు చేసినా.. జీవో యొక్క ఉద్దేశాన్ని తగ్గించలేవు..పైగా పెంచుతాయి కూడా
-ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలకు, జరిగిన మారణకాండకు సిగ్గుతో తలదించుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సింది
-నైతికంగా నేను బాధ్యత వహిస్తానని చెప్పాల్సిన పెద్ద మనిషి ..తనకు కనీస సంస్కారం కూడా లేదని, తానొక ఉన్మాదిని, తనది రాక్షస సంస్కృతి అంటూ చెప్పుకొస్తున్నాడు
-వ్యవస్థలన్నిటినీ నా కాలు కింద వేసుకుని తొక్కుతానంటూ చొక్కాలు చించుకుని, రొమ్ము విరుచుకుని ప్రతిపక్ష నాయకుడు కుప్పం వీధుల్లో ప్రదర్శనలు ఇస్తున్నాడు
-ఏ ప్రభుత్వాలైనా జరుగుతున్న పరిణామాలను బట్టి కావాల్సిన చర్యలు, నిర్ణయాలు తీసుకుంటాయి
-వాళ్లు చీకటి జీవో అంటున్న ఈ జీవో.. అవసరమా లేదా అనేది నేను ప్రజల్ని మేము అడుగుతున్నాం..ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం
-ఏరోజుకా రోజు టీడీపీ రాజకీయ ఎజెండా ఫిక్స్‌ చేసే పచ్చ మీడియా ఈరోజు ఎజెండా చైతన్య రథం
-అసలు ఎందుకొచ్చింది ఈ పరిస్థితి..? చంద్రబాబు తనకు తాను ఒక సంక్షోభం సృష్టిస్తాడు

కందుకూరు మారణకాండకు బాబు సభాస్థలే కారణం కాదా..?:
-ప్రభుత్వం తెచ్చిన చట్టం ఎందుకు వద్దు అనేది చంద్రబాబు చెప్పాలి..ఎక్కడంటే అక్కడ సభలు పెట్టుకుందామా..?, ప్రజల ప్రాణాలో పోయినా ఫర్వాలేదా?
– కందుకూరులో మర్యాదగా సభ జరిగిందా..? అలా జరిగి ఉంటే..నువ్వు నిలపాల్సిన చోట వాహనం నిలిపి ఉంటే ఆ మారణకాండ జరిగి ఉండేదా..?
-అక్కడ అమాయకపు ప్రాణాలు పోయాయే..పోలీసులు అనుమతి ఇచ్చిన చోటే చంద్రబాబు తన వాహనం ఆపి ఉంటే అది జరిగేదా..?
-రోడ్లమీద జరిగే ఇలాంటి సభల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
-అది టీడీపీ కానీ, వైఎస్సార్సీపీ, జనసేన లాంటి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు
-దానిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి చేయాలా వద్దా..?
-అందుకే ఆ జీవో తెచ్చాం. ఏ మాత్రం వివేకం ఉన్నా ఇది మంచి నిర్ణయం అంటున్నారు
-దానికి మేం కూడా కట్టుబడి ఉండాలి. మాకు కూడా సులభమే.
-జగన్మోహన్‌రెడ్డి గారి వెహికల్‌ కూడా ఎక్కడంటే అక్కడ ఆపితే మాకూ లాభమే…కానీ రిస్క్‌ ఉంటుంది. ఎవరైనాసరే.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకూడదన్నదే ఆ జీవో ఉద్దేశం.

కుప్పంలో సభ ఎక్కడ పెట్టుకుంటారో కూడా టీడీపీ చెప్పలేదు:
-అందుకే ఈ కట్టుబాటుకు వైఎస్సార్సీపీ కూడా లోబడే ఉంటుంది. ఉండక తప్పదు
-కానీ చంద్రబాబు నేను ఉల్లంఘిస్తాను..ఏం చేస్తారో చూస్తాను అంటున్నాడు
-కుప్పంలో టీడీపీ వారు అక్కడి డిఎస్పీకి చంద్రబాబు పర్యటన గురించి ఒక వాట్సప్‌ మేసేజ్‌ పెట్టారు..దానికి డిఎస్పీ రిప్లై ఇచ్చారు
-అందులో సెక్షన్‌ 30 పోలీసు యాక్టు అమలులో ఉంది…దాని ప్రకారం సభలు, సమావేశాలు ఎక్కడ పెడతారో ముందస్తు సమాచారం ఇవ్వాలని డిఎస్పీ చెప్పారు
-కొత్తగా ఒక జీవో వచ్చింది…అందువల్ల సభలు జరపాలంటే ఎక్కడ జరుపుతారో చెప్తే దానికి అనుమతులు ఇస్తాము అని డిఎస్పీ చెప్పారు
-సెక్షన్‌ 30 ప్రకారం ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని చూడా చెప్పారు
-చంద్రబాబుకు అనుమతులు తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది..? గెరిల్లా వార్‌ ఫేర్‌ లా చేయాలనుకుంటున్నాడా..?
-చట్టానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నారా..? చట్టం వెలుపల ఉండాలి అనుకుంటున్నారా..?
-నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను..నేను తుంటరిగానే ప్రవర్తిస్తాను అని చంద్రబాబు అంటే పోలీసులు తమ పని తాము చేసుకుపోతారు.
-చంద్రబాబు ఒక ప్రతిపక్ష నాయకుడు, సిఎంగా చేశారని అక్కడ డిఎస్పీ ఎంతో వినమ్రంగా సమాధానం చెప్తూనే ఉన్నాడు
-రోడ్ల మీద వద్దన్నారు…పక్కనపెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు అని కూడా చెప్పారు
-పలానా చోట సభ పెట్టుకుంటాం అని టీడీపీ వారు చెప్పి ఉంటే అక్కడ సమస్యే ఉండేది కాదు
-మైక్‌ పర్మిషన్‌ రిజెక్ట్‌ చేశారు కాబట్టే వాహనం తీసుకెళ్లారు. దానికి కారణం ఈయన ఎక్కడ సభ పెట్టుకుంటాడో కూడా చెప్పలేదు..అనుమతి తీసుకోలేదు
-ఇవేమీ చేయకుండా నా ఇష్టారాజ్యం నేను ఎక్కడైనా కూర్చుంటా..నేను ఏమైనా చేస్తాను అంటున్నాడు చంద్రబాబు.

చంద్రబాబును ఎవరూ అడ్డుకోలేదు:
-ఆయన చేస్తున్న హూంకారాలు చూస్తే ఆయన మానసిక సమతుల్యత తప్పనట్లు కనిపిస్తోంది
-చొక్కాలు చించుకుని, కిందపడి దొర్లడం వంటి విద్యలన్ని రాజకీయ నటుడిగా చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
-కుప్పం వెళ్లి చంద్రబాబు మూడు రోజులు పర్యటన చేసుకోడానికి ఆయనకు ఎవరూ ఎలాంటి ఇబ్బంది క్రియేట్‌ చేయలేదు
-రోడ్‌ షోలు చేశాడు…తిరగడం అన్నీ చేశాడు..ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు
-చంద్రబాబు రోజూ తిరుగుతూనే ఉన్నాడు…వాళ్ల పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూపిస్తూనే ఉన్నారు
-ఈ రోజు మా నాయకులు ఏదో చేశారు అంటూ రాతలు రాస్తున్నారు
-మరి రెండు రోజులుగా చంద్రబాబు కుప్పంలో తిరుగుతుంటే ఎవరూ అడ్డుకోలేదే..?
-ఈ రోజు నా బండి ఇవ్వండి అంటూ రోడ్డుపైనే కూర్చున్నాడు కూడా
-ఆయన చేసేవి ఏవీ ఆపలేదే..? ఎలా చేయగలుగుతున్నాడు..?

కుప్పం ప్రజలకు చేసింది చెప్పుకోలేకే ఇన్ని డ్రామాలు:
-చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గానికి కూడా చేసింది ఏమీ లేదు. అందుకే చెప్పడానికి ఏమీ లేక ఇన్ని డ్రామాలు ఆడుతున్నాడు.
-మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తాననన్న దానికి మించి చేశాడు.
-అట్టడుగు వర్గాల హృదయాల్లోనూ మా నాయకుడే ఉన్నాడు…కుప్పం ప్రజలు కూడా జగన్మోహన్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నారు
-అందుకే మొన్నటి పంచాయితీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలన్నిటిలో జగన్మోహన్‌రెడ్డి కి కుప్పం ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు

చంద్రబాబును జనం పట్టించుకోవడం లేదు:
-ఓపెన్‌ ప్లేస్‌లో మీటింగు పెడితే జనం రారని, రోడ్డు మధ్యలో పెడితే కాస్త జనం గుమిగూడతారని, వాళ్లు తన కోసమే వచ్చారని చెప్పుకోవచ్చని చంద్రబాబు ప్లాన్‌ వేశాడు
-అందుకే నేను అక్కడే సభ పెడతాను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు
-అలా చేయబోయే కందుకూరులో 8 మందిని పొట్టనపెట్టుకున్నావు మహానుభావా అని మేం చెప్తున్నావ్‌
-డ్రోన్‌ షాట్ల కోసం సందుల్లో- గొందుల్లో సభ పెట్టి తనకు పెద్ద పాపులారిటీ ఉందని చూపించుకునేందుకు చేసిన దాని వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
-ఇలాంటి దుందుడుకు, నిర్లక్ష్యపు వైఖరితో ఏ రాజకీయ నాయకుడైనా చేయకుండా ఆ జీవో వచ్చింది

బాబు ముందు గాయాలు, కట్లు ప్రదర్శన.. వెళ్ళాక అన్నీ మాయం:
-కుప్పంలో ఏమీ జరగకపోయినా నిన్న గాయపడ్డారని ఆస్పత్రికి వెళ్లి పరామర్శకు వెళ్లి డ్రామా చేశాడు
-చంద్రబాబు అక్కడకు వెళ్లడానికి ముందు బాగానే ఉన్న వారు ఆయన వచ్చే సరికి సీన్‌ మారిపోయింది
-అక్కడున్న ఒక యువకుడు బాబు వచ్చే వరకూ బాగానే ఉన్నాడు…ఆయన వచ్చేసరికి తలకు, చేతికి కట్టువచ్చింది
-చంద్రబాబు వెళ్లిపోగానే వారి బెడ్లు అన్నీ ఖాళీ అయ్యాయి.
-ఇంత దిక్కుమాలిన ఆలోచనలు, నాటకాలు బహుశా ఇప్పుడున్న సమకాలీన సమాజంలో చంద్రబాబు తప్ప ఎవరూ చేయలేరు
-మరి ఇవి రామోజీరావు, రాధాకృష్ణ ఇచ్చే సలహాలా..? లేక చంద్రబాబు సహవాసంలో వాళ్లే ఇలా చేస్తున్నారా అనేది అంతుబట్టడం లేదు
-స్ట్రైక్‌ అంటే రెండు బస్సులన్నా పగలాలి అని చంద్రబాబు అనేవాడని దగ్గుబాటి గారు గతంలో తన పుస్తకంలో రాశారు
-ఇలాంటి ఆలోచనలు పుట్టుకతోనే చంద్రబాబుకు ఉండి…దాని ద్వారా రాజకీయం చేయవచ్చు అనే స్థిరమైన నిర్ణయంతో ముందుకు వెళ్తున్నట్లున్నాడు

ర్యాలీలు, రోడ్ షోలు నిషేధం అని ఆ జీవోలో చెప్పలేదే..:
-ఆ పత్రికలు, చానళ్లు ఇర్రెస్పాన్సిబుల్‌ అఫిషియల్‌ మీడియా ఆఫ్‌ తెలుగుదేశం పార్టీ…చంద్రబాబునాయుడు
-రాజకీయ పార్టీలకు పత్రికలు ఉండొచ్చు…వామపక్షాలకు వాళ్ల పత్రికలు కూడా ఉన్నాయి..మాకు సాక్షి ఉంది…
-సాక్షిలో రాసేటప్పుడు బాధ్యతగా ఉంటాం..చంద్రబాబు జగన్‌ ని తిట్టినా దాన్ని కూడా మేం వేస్తాం…జగన్‌ పై చేసిన విమర్శలకు సమాధానం కూడా ఇస్తాం
-కానీ ఆ పత్రికలు అవన్నీ వదిలేశాయి…ఒక వక్రీకరించిన చిత్రాన్ని ప్రజల ముందు పెడుతున్నాయి
-ఈ వారం పదిరోజుల్లో జరిగిన ప్రధాన అంశాలు గమనిస్తే.. అన్యాయంగా ఒక పెద్ద పోలిటికల్‌ పార్టీ తెలుగుదేశం వల్ల 11మంది చనిపోయారు అనేది వాస్తవం
-ఆ తర్వాత జీవో వచ్చింది-ఆ జీవోలో ర్యాలీలు, రోడ్‌ షోలు నిషేధం అని ఎక్కడైనా అన్నారా..?:
-కందుకూరు దుర్ఘటన తర్వాత ప్రభుత్వం సమీక్షించుకుని రోడ్లమీద సభలు జరగడం వల్ల ఉండే రిస్క్‌లను గుర్తించింది
-ప్రత్యామ్నాయ స్థలాలను పోలీసులు సూచించాలి. లేదా అర్గనైజర్లు అయినా స్థలాలు చూపించవచ్చు
-మీ అంతట మీరు ర్యాలీలు, రోడ్‌ షోలకు అనుమతి లేదంటూ చెప్పడం సరికాదు
-చంద్రబాబు ఈ రెండు రోజుల నుంచీ చేస్తున్నది ర్యాలీలు, రోడ్‌ షోలే కదా
-ఆ జీవోలో ఎక్కడైనా ర్యాలీలు, రోడ్‌ షోలు నిషేధం ఉందా చూపించండి
-సెక్షన్‌ 30 అక్కడ ఉంది కాబట్టి సమావేశం గురించి సరైన సమాచారం ఇవ్వలేదు కాబట్టే మైక్‌సీజ్‌ చేశారు.
-నిజంగాచంద్రబాబు చట్టాన్ని గౌరవించే వ్యక్తి అయితే…చట్టానికి లోబడే సంస్థ టీడీపీ అయితే వీరు రిక్వెస్ట్‌ చేస్తే ఎందుకు అనుమతి ఇవ్వరు..?
-వాళ్లు ఇవ్వకపోతే అప్పుడనొచ్చు…మేం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది
-అవేమీ చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఆయనే చొక్కా చింపుకుని, నేలమీద పడి దుమ్ములో దొర్లిదొర్లి, నన్ను కొట్టారు అన్నట్టుగా నానా యాగీ చేస్తున్నాడు

కుప్పంలో చంద్రబాబు చేసినవి రోడో షో లే కదా..:
-ఈ మూడు రోజులు చంద్రబాబు అక్కడ రోడ్‌ షో చేస్తూనే ఉన్నాడు..క్రేన్‌లతో ఆయనకు దండలు కూడా వేస్తూనే ఉన్నారు…ఇక మేం అడ్డుకున్నదేముంది
-చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ కూడా ఉంది..ఆ కోణంలో చూసినా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి కదా…
-నువ్వు చేసిన పనివల్ల గుంటూరులో ముగ్గుర్ని బలితీసుకున్నారు. తీరా ముగ్గురు చనిపోతే నేను చుట్టపు చూపుగా వచ్చాను అంటాడు
-వాస్తవాలను బయటకు తీస్తే టీడీపీ నేతలే అనుమతుల కోసం దరఖాస్తు చేశారు
-ఎవర్ని మోసం చేయాలని ఇన్ని డ్రామాలు చేస్తున్నావ్‌ చంద్రబాబూ..?
-గుంటూరులో పోలీసులు హెల్ప్‌ చేయబట్టే అక్కడ మరణాలు తగ్గాయి.
-నేను లీడర్‌…14 ఏళ్లు సిఎం అని రొమ్ము విరుచుకుని చెప్పుకుంటావ్‌
-కుప్పంలో నిన్ను పోలీసులు అడ్డుకుంటున్నారు అన్న మాట ఆబద్ధం కాదా..?

పోలీసుల సూచనల మేరకే జగన్‌ మీటింగులు:
-మొన్నటికి మొన్న మా మీటింగు కర్నూలులో రాజ్‌ విహార్‌ సెంటర్లో పెట్టాలని ప్రతిపాదన వస్తే ఇరుకు రోడ్డని మేమే వద్దని చెప్పాం..అప్పటికీ ఈ జీవో కూడా లేదు
-జగన్‌ పర్యటనలకు సంబంధించి ప్రతి సారీ పోలీసులకు సమాచారం ఇస్తున్నాం.
-వారి సూచనల ప్రకారం కొన్ని సందర్భాల్లో సభల స్థలాలను కూడా మార్చుకున్నాం
-నిజంగా చంద్రబాబు పార్టీపై అభిమానం ఉన్న వాళ్లు.. ఏదైనా స్థలంలో పెట్టినప్పుడు అక్కడ వరకూ కూడా రాలేరా..?
-ఏదైనా జరిగితే.. అప్పుడు ఇంత జరుగుతున్నా మీ ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నించరా…?

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.
కోర్టు ఏం చెప్పిందో కానీ…ఆ పత్రికలు మాత్రం నిప్పులు చెరిగాయి:
-సలహాదారులకు సబంధించి కోర్టు ఏం చెప్పిందో నాకు తెలియదు…
-ఆ పత్రికలు మాత్రం నిప్పులు చెరిగారు అంటూ రాసుకొచ్చారు
-న్యాయ వ్యవస్థ…ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థపై బాస్‌ కాదు…అలా అని ఉంటారని కూడా నేను అనుకోవడం లేదు
– వాళ్ల రాతలు చూసి రియాక్ట్‌ కాలేము. వాళ్లు నోటికొచ్చినట్లు రాసేస్తున్నారు
-ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ ఇండిపెండెంట్‌. ఎగ్జిక్యూటివ్‌ లో కూడా ఈ మధ్య కాలంలో సంక్లిష్టత పెరిగింది. దానికి అనుగుణంగా నిపుణుల అవసరం కూడా ఉంటుంది.
– ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ విధానాలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమర్ధంగా ఉండేందుకు సలహాదారులను పెట్టొచ్చు.
-కేంద్రంలో కూడా పెడుతన్నారు..చంద్రబాబు హయాంలో కూడా పెట్టారు.
– చంద్రబాబు హాయంలో కన్సల్టెంట్‌ అనే పేరుతో వందల కోట్లు దోచేశాడు…జగన్‌గారు అవసరాన్ని బట్టి సలహదారులను పెడుతున్నారు.
– చేసిన మంచి చెప్పుకోడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు…జగన్‌ గారిని ఎత్తిచూపడానికి వారి వద్ద ఏమీ లేదు.
-అందుకే ప్రాధాన్యం లేని ఇలాంటి అంశాలన్నిటినీ బయటకు తీసుకువస్తున్నారు..దాని ద్వారా శునకానందం పొందుతున్నారు
– సలహాదారులు ఉండాలా లేదా..? దాని రాజ్యాంగ బద్ధత ఏమిటీ అని పరిశీలించే హక్కు న్యాయ వ్యవస్థకు ఎప్పుడూ ఉంటుంది.
-అదే సమయంలో ప్రభుత్వం అనేది ఎవరికీ సబార్డినేట్‌ కూడా కాదు. ప్రభుత్వం జవాబు ఇవ్వాలంటే శాసనవ్యవస్థకు ఇవ్వాలి…
-ఒక వేళ నియమాలకు విరుద్ధంగా చేస్తే కోర్టులు ప్రశ్నిస్తాయి.
-ఒక వ్యవస్థ తీసుకున్న నిర్ణయం.. అన్నీ ఆలోచించే తీసుకుని ఉంటుందని నమ్మకంతో వ్యవస్థల మధ్య సంబంధాలు ఉండాలి.
– అలా కాకుండా నేనేదైనా కామెంట్‌చేయవచ్చని ఎవరైనా అన్నా నష్టమే జరుగుతుంది. రాజ్యాంగం ఆశించిన సమన్వయం కూడా దెబ్బతింటోంది.

చంద్రబాబు దగ్గర సరుకు లేదు కాబట్టే :
-వైఎస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు రంకెలు వేస్తున్నాడు..తాను ఏం చేశానో చెప్పి…మేం ఏం చేయలేకపోయామో చెప్పుకుని ప్రజల వద్దకు వెళ్లాలి
-అమరావతి దగ్గర నుంచి ప్రతిదానిలో చంద్రబాబు ఒక వర్చువల్‌ ప్రపంచంలో బతుకుతున్నాడు…దానితోటే గోదారిని ఈది అవతలకు వెళ్లాలని చూస్తున్నాడు
-అది చీకటి జీవో కానేకాదు…ప్రజలకు ఇబ్బందులు తొలగించే వెలుగునిచ్చే జీవో
-దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయన న్యాయస్థానాలకు కూడా వెళ్లొచ్చు..అప్పుడు ఎందుకు ఈ జీవో తేవాల్సి వచ్చిందో కూడా ప్రజలు నిత్యం మాట్లాడుకుంటూనే ఉంటారు

Leave a Reply