– ప్రజల్లో చైతన్యం నింపిన వాడు దాశరథి
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
– తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవం
– అగ్నిశిఖ కవితా సంకలనం ఆవిష్కరించిన సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్
– ఎన్టీఆర్ దాశరథి ఆత్మగౌరవం దెబ్బతీశారు
– దాశరధికి కవిగా రావాల్సిన పేరు రాలేదు కె. శ్రీనివాస్
– “ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ” నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్: దాశరథి పుట్టి వంద సంవత్సరాలు అవుతున్న సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని గత సంవత్సర కాలం నుంచి ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి విజ్ఞప్తి చేస్తూ వస్తుంది.
గొప్పకవి దాశరథి ఆయన వేడుకలు , ఘనంగా నిర్వహించాలని, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ వచ్చింది.
దాశరథి ఉత్సవాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించలేదని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి కన్వీనర్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
దాశరథికి ఈ ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వలేదని బాధ ఉన్నది. మన వంతుగా మన దాశరథి నీ గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించి, తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా, సంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించే సంస్థగా మన వంతు కర్తవ్యంతో ఈ సభను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
దాశరథి సొంత బిడ్డ లక్ష్మణ్ ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరం. రాచరిక పాలనలో మాట్లాడితే గొంతులుకోసే కర్కోటమైన పాలన జరుగుతుండేది. అలాంటి సమయంలో దాశరధి చిన్న గూడూరులో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించారు. అన్యాయాన్ని ఎదిరిస్తున్న దాశరధిని ఆ ఊరు నుంచి ఆ కుటుంబాన్ని ఎల్లగొడితే ఖమ్మం వెళ్ళి తలదాచుకున్నారు. అయినా సరే ఆనాడు హైదరాబాద్ స్టేట్ గా ఉన్న రాష్ట్ర మొత్తం జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేవాడు.
ధైర్యంగా నిజం రాజును ఎదిరించి ప్రజల్లో చైతన్యం నింపిన వాడు దాశరధి. చాలా మందిని ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం. వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏసీ రూములలో కూర్చొని అక్కడినుంచే ప్రపంచాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. ఏసీ రూముల నుంచే ఉద్యమాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆనాడు దాశరధి ఆదివాసులు , గిరిజనులు , హరిజనుల దగ్గరికి వెళ్లి సామాజిక వివక్షను తుడిచి పెట్టాలని అనుకున్నాడు.
సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. దాశరధి ఉపన్యాసాలు వినే అవకాశం నాకు దొరికింది. ఎన్టీఆర్ ఆస్థాన పదవులు రద్దుచేస్తే దాశరధి పదవిపోయింది. తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో పార్టీ పెట్టిన ఎన్ టీఆర్ దాశరథి ఆత్మగౌరవం దెబ్బతీశారు. నేటి యువతరానికి దాశరధి కనెక్ట్ అవుతారు. 1949లో తెలంగాణ తల్లి అనే పదం వాడింది దాశరధి. అంతకంటే మందు ఎవరూ తెలంగాణను మాతృభూమిగా, తెలంగాణ తల్లిగా భావించలేదు.
నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని దాశరధి అన్నారు. దాశరధి తెలుగువాళ్లంతా కలిసి ఉండాలని అనుకున్నారు. దాశరధి తన మరణాంతరం 1995లో తెలంగాణలో ఉద్యమంలో సాంస్కృతిక భావనతో చేరారు. తెలంగాణ ఉద్యమం అనేది కేవలం రాజకీయ ఉద్యమం కాదు. సాంస్కృతిక,భాషా ఉద్యమం.
తెలంగాణకు ఒక గర్వం ఉంది.
ప్రభుత్వం దాశరధికి చేయాల్సిన విధంగా చేయలేదు. తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాయి. దాశరథి శతజయంతి ఉత్సవాలకు కవిత చొరవ తీసుకోవడం మంచి పరిణామం. తెలంగాణ కవికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు
ప్రభుత్వం దాశరథి శత జయంతిని పట్టించుకోలేదు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో అధికారంలోకి వచ్చారు. కవులు, కళాకారులను పదవుల నుంచి తొలగించి వారి ఆత్మాభిమానం దెబ్బతీశారు. టంగుటూరి అంజయ్యకు అవమానం జరిగిందని ఆత్మాభిమానం పుట్టింది. టంగుటూరి అంజయ్య భాషను గేలి చేస్తే అంజయ్య మాట్లాడింది అసలైన తెలుగు అని దాశరధి అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో దాశరధి పాటలు ఉపయోగపడ్డాయి. దాశరథి పాటలో తెలంగాణ పేరు లేదు కానీ పరిణామం ఉంది. దాశరధిని ఆంధ్రా ప్రాంతం కవులతో సమానంగా చూస్తున్నామా? దాశరధికి కవిగా రావాల్సిన పేరు రాలేదు. సినిమా పాటలు రాశారు కాబట్టి దాశరథికి పేరు వచ్చింది. తెలంగాణ సంస్కృతికి కోట, కవచం, బురుజు లాంటి వారు దాశరథి.