మెడికల్ కాలేజీలనేవి మిగతా కాలేజీల్లాగా అలా మొదలెట్టేయలేం! ఫస్ట్ నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ తీసుకుని 1 సీట్ కి 5 బెడ్స్ చొప్పున హాస్పిటల్ కట్టి చూపించి;హాస్టల్స్;కాలేజ్ బిల్డింగ్స్ ;ఫాకల్టీ అన్నీ ఫస్ట్ బ్యాచ్ బయటికి వచ్చేటప్పటికి అంటే 5 ఏళ్లలో పూర్తి చేస్తామని అఫిడవిట్ ఇస్తే టెంపరరీ రికగ్నిషన్ ఇస్తారు.
ఇన్ని సీట్లు అని అలాట్ చేస్తారు. ఒక వేళ ఆ టైం కి పూర్తి కాకపోతే సీట్లు ఆపెయ్యొచ్చు;అలాగే కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కి పెర్మనెంట్ రికగ్నిషన్ లేకపోతే ఆ డిగ్రీ ఎక్కడా పనికి రాదు, పీజీ లో చేరలేరు. స్టాఫ్ రిక్రూట్మెంట్,ఫాకల్టీ ఏర్పాటు చెయ్యటం ఇవన్నీ క్రూషియల్.
ప్రభుత్వం లో ఇవి జరగాలంటే ఇప్పుడు జగన్ చేసినట్లే అంతా కంగాళీ గా అవుతుంది. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళు అయితే టైం బౌండ్ గా పనులు జరుగుతాయి, ఫాకల్టీ కూడా తొందరగా వస్తారు. చంద్రబాబు చెప్పిన పిపిపి మోడల్ లో ట్రస్ట్ లు కానీ, పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పని చేస్తూ తొందరగా ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి డిగ్రీ రికగ్నిషన్ కోసం ప్రయత్నం చేసి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ.
జగన్ ప్రభుత్వం లో జరిగినట్లు మూడు నాలుగేళ్లలో 5 ;10 శాతం పనులు చేస్తే కుదరదు, ఆ స్టూడెంట్లు రోడ్ న పడతారు. అందుకే అది ఫెయిల్యూర్ మోడల్ అయ్యి మొదలెట్టిన ఏ కాలేజ్ కూడా పూర్తి స్థాయి లో రెడీ కాక స్టూడెంట్లకి ఇబ్బంది. ఇప్పుడు సీబీఎన్ ప్రభుత్వం పీపీపీ లో పూర్తి స్థాయిలో పని చేస్తే రెండేళ్లలోనే కాలేజ్ లు పూర్తి చేసే అవకాశం ఉంది. హాస్పిటల్స్ పూర్తి స్థాయి స్టాఫ్ తో కాలేజ్ ల్లో టీచింగ్ ఫాకల్టీ పూర్తి స్థాయి లో ఉంటేనే ఇటు
రోగులకి, అటు స్టూడెంట్స్ కి ఉపయోగం. అదే 2019 లో సీబీఎన్ వచ్చి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జిల్లాకో మెడికల్ కాలేజ్ స్కీం ని పూర్తి స్థాయి లో ఉపయోగించుకుని ఈ పాటికే ఆ 17 మెడికల్ కాలేజీ లు రెడీ చేసే వాడు.
అదీ పనిమంతుడికి పిట్టల దొర కబుర్లు చెప్పేవాడికీ తేడా ఇప్పుడు గొడవ చేస్తున్న వాళ్ళు కామ్ గా ఉంటే ఈ టర్మ్ అయ్యేలోపే అన్ని మెడికల్ కాలేజ్ లు రెడీ అవుతాయి