Suryaa.co.in

Telangana

ఇది బీజేపీ విజయం….రైతుల విజయం..

-కేసీఆర్ మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొనేలా చేశాం
-ఇన్నాళ్లు తక్కువ ధరకు వడ్లమ్మి నష్టపోయిన రైతుల పరిస్థితి ఏంది?
-వాళ్లకు తక్షణమే పరిహారం అందించాల్సిందే
-వడ్ల కొనుగోలు పైసలన్నీ కేంద్రానివే… 97 వేల కోట్లు ఖర్చు చేసింది
-యాసంగి వడ్ల కొనుగోలు భారంపైనా సీఎంవన్నీ అబద్దాలే
-3, 4 వందల కోట్లకు మించి భారం పడే అవకాశమే లేదు
-పెంచిన కరెంట్ ఛార్జీలనూ తగ్గించాల్సిందే
-ప్రజలతో కలిసి ఛార్జీలు తగ్గించేదాకా పోరాడతాం
-రంజాన్ ఉత్సవాలు నిర్వహిస్తే సెక్యూలరిజమా?
– శ్రీరామ నవమి ఉత్సవాలు చేస్తే మతోన్మాదలంటూ కేసులు పెడతారా?
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన చేసిన ఉద్యమాల ఫలితంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దిగొచ్చి వడ్లు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘ఇది బీజేపీ విజయం. రైతుల విజయం. పార్టీ కార్యకర్తల విజయం’’అని అభివర్ణించారు. వడ్లు కొంటావా… గద్దె దిగుతావా? అంటూ బీజేపీ ఇచ్చిన అల్టిమేటంతోనే కేసీఆర్ దిగొచ్చారని అన్నారు. యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని తాము మొదటి నుండి చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. ప్రజలు పెంచిన కరెంట్ ఛార్జీలతో అల్లాడుతున్నారని….. ఆ ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

కరెంట్ ఛార్జీలను తగ్గించేదాకా బీజేపీ పోరాటం కొనసాగిస్తామని, ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
sanjay1దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ తదితరులతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

ఎన్నటికైనా ధర్మమే గెలుస్తది. ఈరోజు కూడా అదే జరిగింది. రైతుల పక్షాన బీజేపీ నిలబడింది. వడ్లు కొంటావా? దిగిపోతవా? అని మేం ఇందిరా పార్క్ వేదికగా నిన్న ధర్నా చేసినం. యాసంగిలో పండించిన ప్రతి గింజా కొనిపిస్తమని మేం మొదటి నుండి చెబుతూనే ఉన్నాం. కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తాం… అన్నాం… ఈరోజు అదే జరిగింది. బీజేపీ పోరాటాల ఫలితంగా రైతులు విజయం సాధించారు… బిజేపీ విజయం సాధించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2, 3 నెలల నుండి యాసంగి వడ్లు కొనం అని చెప్పి రైతుల్ని అరిగోస పుచ్చుకున్నాడు… రైతులు నిద్రలేని రాత్రులు గడిపిర్రు.మేం రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే మాపై రాళ్ల దాడులు చేయించిండు. బీజేపీ కార్యకర్తలు రక్తం చిందించినం. చివరికి ఏమైంది? మా పోరాటానికి దిగొచ్చిండు…

కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు పెట్టలేదని మేం మొదటి నుండి చెబుతూనే ఉన్నాం. కేంద్రమే ఇప్పటి వరకు 97 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పినం.

యాసంగిలో రారైస్ ఇవ్వడం ద్వారా మహా అంటే మూడు, నాలుగొందల కోట్లకు మించి భారం పడదు. కేసీఆర్ చెప్పే 3, 4 వేల కోట్ల ఖర్చయితనేది కూడా పచ్చి అబద్దం. అయ్యేది మూడు, నాలుగొందల కోట్లే. కేంద్రం దాదాపు లక్ష కోట్లు ఖర్చు చేస్తుంటే…. రూ. ఆ మాత్రం భరించలేవా? అని అడిగినం.

ఇన్నాళ్లు దీనిపై గాయి గాయి చేసిండు. లక్ష కోట్లు ఖర్చు చేసిన కేంద్రాన్ని బదనాం చేయాలని చూసిండు. రైతులకు వాస్తవాలు అర్ధమయ్యే సరికి అర్ధమై తోక ముడిచిండు. బీజేపీ దెబ్బకు, రైతుల పోరాటానికి దిగొచ్చిండు. విలేకర్ల ప్రశ్నలకు జవాబివ్వలేక పారిపోయిండు.

పైగా రైతులెవరూ తక్కువ ధరకు అమ్ముకోవద్దు. కనీస మద్దతు ధర 1960 రూపాయలు చెల్లిస్తామని ఇయాళ చెప్పిండు. మరి నిన్నటి దాకా రైతులు… క్వింటాలకు వెయ్యి, 1100 రూపాయలకే వడ్లను అమ్ముకున్నరు. మరి వాళ్లు నష్టపోయిన సొమ్మును ఎవడిస్తాడు….

వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించాలి. వారికి నష్టపరిహారం అందజేయాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.అట్లాగే అడ్డగోలుగా కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై వేల కోట్ల భారం మోపినవ్. ప్రజల కోపాన్ని దారి మళ్లించేందుకు ఇన్నాళ్లు వడ్ల డ్రామాలాడినవ్. ఇగ డ్రామాలు బంద్ అయినయ్… వడ్ల కొనుగోలు మాదిరిగానే పెంచిన కరెంట్, ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాల్సిందే. ఛార్జీలను తగ్గించే వరకు ఊరుకునేది లేదు.

ఛార్జీల పెంపు ఇంటింటికీ, గల్లీగల్లీకి పోయి ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం. ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. ఛార్జీలు తగ్గించేదాకా మా పోరాటం కొనసాగతుంది.కరెంట్ సబ్సిడీల కోసం రూ 12 వేల కోట్లు చెల్లిస్తున్నానని కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే. ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. కేసీఆర్ డబ్బులు చెల్లించకపోవడంతో డిస్కంలన్నీ దివాళా తీసినయ్. 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి మూతపడే దుస్థితికి చేరుకున్నయ్.

ఈ ఏడేళ్లలో రైతులకు ఉచిత కరెంట్ ఇఛ్చింది కేసీఆర్ కానే కాదు… ఎందుకంటే డిస్కంలకు చెల్లించాల్సిన 60 వేలు కోట్లు ఇంతవరకు చెల్లించలేదు. పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్లు బిల్లులు బకాయి ఉన్నా వసూలు చేయడం లేదు. పైగా పొలం కాడ ఫ్రీ కరెంట్ ఇస్తున్నానని చెబుతూ… ఇంటి బిల్లులపై అదనపు భారం మోపి జనం నడ్డి విరుస్తున్నవ్.

డిస్కంలకు చెల్లించాల్సిన బకాయి కేసీఆర్ ప్రభుత్వం కట్టే పరిస్థితి లేదు. రేపు రాబోయే ప్రభుత్వం మీదే ఆ భారమంతా పడబోతోంది. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.ఆర్టీసీ ఛార్జీలను కూడా ఎడాపెడా పెంచి సామాన్య ప్రజలపై ఎనలేని భారం మోపతున్నారు.

విలేకర్లడిగిన ప్రశ్నకు… నాకు వ్యవసాయమే లేదు. నాకు రైతు బంధు ఎట్లా వస్తది? కాలేజీల పేరుమీద కమర్షియల్ భూములు, కబ్జా భూముల మీద రైతు బంధు తీసుకునే అలవాటు నాకు లేదు. ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్న సన్నాసులు అకల్ తో మాట్లాడితే మంచిది.

నా చావు కోరుకుంటున్న సన్నాసులకు ఇదే చెబుతున్నా… నాపై అవాకులు చవాకులు పేలుతున్న సన్నాసులకే నేను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ పైసలు ఇవ్వాలని కోరుకుంటున్నా.ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు. ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసే వాళ్లపై కేసులు పెడుతున్న ముఖ్యమంత్రే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కేసులు పెట్టరా?

పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ పేరుతో దోచుకుంటున్నట్లు ఒప్పుకుంటూనే కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు. లీటర్ పెట్రోలుపై రూ.33 లు దోచుకుంటున్న కేసీఆర్.. ఆ మొత్తాన్ని ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలి. అంచనాలు పెంచి కోట్లు దండుకోవడంలో కేసీఆర్ ను మించినోడు లేడు.

వ్యవసాయ విధానంపై అవగాహన లేని వ్యక్తి కేసీఆర్. పంట ఉత్పత్తి అంచనాలు కూడా వేయలేని అసమర్థుడు సీఎం.మత పిచ్చి లేపుతున్నారంటే మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ… ‘తెలంగాణలో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకోవద్దా? శోభాయాత్ర చేస్తే రాజాసింగ్ పై కేసులు పెడతారా? రంజాన్ పండుగ సమయంలో ఉత్సవాలు చేసుకుంటే సెక్యూలరిజం…. శ్రీరామ నవమి ఉత్సవాలు చేసుకుంటే మతతత్వవాదులంటూ కేసులు పెడతారా?ప్రజలపై ప్రేమతో 111 జీవో రద్దు చేయలేదు. కేసీఆర్ ఆయన కొడుకు, బంధువుల ఫాంహౌజ్ లు ఆ పరిధిలో ఉన్నవి కాబట్టే వాటిని కాపాడుకునేందుకే ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేశారు.

LEAVE A RESPONSE