Suryaa.co.in

Andhra Pradesh

సీఎం హోదాలో మీకు ఇదే చివరి పుట్టినరోజు

-పుట్టినరోజు పేరుతో ఒక్క రోజులో 100 కోట్లు కొట్టేసిన ఏకైక సీఎం
– ట్విట్టర్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

సీఎం వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆయురారోగ్యాలు కలగాలి. అయితే సీఎం హోదాలో మీకు ఇదే చివరి పుట్టినరోజు అవుతుంది. ఎందుకంటే మీరు మూడు నాలుగు నెలల్లో మాజీ సీఎం అవ్వబోతున్నారు.

ఈ విషయం మీకూ పూర్తిగా అర్ధం అయినట్లు ఉంది. అందుకే ఒక్కరోజులో మీ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ.100 కోట్లు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? ప్రైవేటు సంస్థలను బెదిరించి మరీ యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టిన రోజు నాడూ అబద్ధాలు చెప్పడమే మీ నైజమా?

పుట్టినరోజు పేరుతో ఒక్క రోజులో 100 కోట్లు కొట్టేసిన ఏకైక సీఎం మీరే. పుట్టిన రోజును సైతం ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేకుంటారు కాబట్టే..ముఖ్యమంత్రి గా మీకు ఇది చివరి పుట్టిన రోజు అవుతుంది. అక్రమ పద్దతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి. రాష్ట్రం మాత్రం లూటీ.

LEAVE A RESPONSE