– నోట్ రాసి బాలిక ఆత్మహత్య
– బాలిక తండ్రి ఆరోపణ
రంగంపేట: నా చావుకు ఆ ముగ్గురే కారణమని ఓ బాలిక తన సుసైడ్ నోట్లో పేర్కొని, ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలివి. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని బాధపడిన తల్లిదండ్రులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
మా కుమార్తె రాసుకున్న సూసైడ్ నోట్ దొరకడంతో, ఆమె ఫోనులో ఉన్న వీడియోలు, ఫోటోలు వెతికి చూసి షాక్ అయ్యారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో బెదిరిస్తూ, లైంగిక దాడి చేసి, వీడియోలు చిత్రీకరించారని ఆ బాలిక తండ్రి ఆరోపించారు.
ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు వదులుతామని రెండేళ్ళుగా ఆ బాలికను చిత్రహింసలు పెట్టారని అతని తండ్రి ఆరోపించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడిందని బాలిక తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఆ ముగ్గురు మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
