– కండక్టర్ అవతారమెత్తిన డిప్యూటీ స్పీకర్ రాజు
ఉండి: ఆయన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్సిక్స్ హామీ ప్రకారం.. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించింది. ఆ సందర్భంలో రఘురామకృష్ణంరాజు బస్సెక్కి, కండక్టర్ అవతారమెత్తారు. టికెట్లు ఇచ్చే మిషన్ను మెడలో వేసుకుని, మహిళలకు ఫ్రీ బస్సు టికెట్ ఇచ్చి, సరదాగా కాసేపు వారితో కలసి ప్రయాణించారు. ఉచిత బస్సు పథకంపై ఎలా ఫీలవుతున్నారని వారితో మాటామంతీ కలిపారు. ఆ చిత్రమే.. ఈ ‘చిత్రం’
