తెలంగాణ చరిత్రలో నిలిచిన వీరుడు మన టైగర్ నరేంద్ర

మన మందరం గర్వంగా పిలిచే పేరు “భాయ్ సాబ్ “,
ప్రతి ఒక్కరి మదిలో నిలిచిన పేరు “టైగర్ నరేంద్ర ” ,
కాషాయ జెండానే తన ఎజెండాగా ,
హిందువుల రక్షణే తన ధ్యేయంగా ,
సంఘ కార్యకర్తలే తన కుటుంబంగా ,
సంఘ్ పరివార్ సిద్ధాంతాలే ప్రాణంగా,
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపకులుగా,
పాతబస్తీ అరాచక శక్తులకు సింహస్వప్నంగా,
అయోధ్య రామమందిర నిర్మాణమే లక్ష్యంగా,
జనసంఘ్ విస్తరణలో కామారెడ్డి జిల్లా ప్రచారక్ గా,
ఎమర్జెన్సీలో జైలే తన జీవితంగా,
తెలంగాణ సాధనే తన జీవిత ఆశయంగా ,
భాజపా జెండా తెలంగాణలొ రెపరెపలాడే దిశగా,
అను నిత్యం పోరాటాలు
లాఠీలు తూటాలకు ఎదురొడ్డిన వీరులు
అలుపెరుగని నిరంతర ఉద్యమాలు
ప్రగతి కోసం పాదయాత్రలు
ప్రజా ప్రతినిధిగా శిశు మందిరాల నిర్మాలు
పల్లె పల్లెలో విస్తరించినవారి అభివృద్ధి పథకాలు
మన హైందవ సమాజం కోసం రథయాత్రలు
మన కాషాయ జెండా కోసం చివరి శ్వాస వరకు ఆరాటం
తెలంగాణ చరిత్రలో నిలిచిన వీరుడు మన నరేంద్ర గారు!!

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు