ఇక తమిళనాడులోనూ బిజెపి కార్యకర్తల హత్యలు మొదలు?

ఏమీ లేని చోట మేము ఉన్నాము అంటూ స్టాలిన్ కు హెచ్చరిక చేయగలిగాడు అన్నామలై
(పార్థసారథి గారి విశ్లేషణ)

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు-BJP ప్రస్థానం !
తమిళనాట ద్రావిడ పార్టీలకి తప్పితే ఉత్తరాది పార్టీలుగా పిలువబడే జాతీయ పార్టీలకి అక్కడ అవకాశం ఉండదు. ఇది అయిదు దశాబ్దాలుగా స్థిరంగా,బలంగా ఉన్న ఒక సిద్ధాంత పరమయిన విశ్వాసం!తమ మనుగడ కోసం అబద్దాలని ప్రచారం చేసి ప్రజలని తమ గుప్పెట లోపెట్టుకొని ఒకరి తరువాత మరొకరు అనే దామాషా పద్ధతిలో DMK,AIDMK పార్టీలు పాలిస్తూ వచ్చాయి. మొదట బ్రాహ్మణ వ్యతిరేక ప్రచారం తరువాత తమిళ భాషా ఉద్యమం ప్రధానంగా ప్రజల మెదళ్ల్లోకి విజయవంతంగా చొప్పించగలిగాయి ద్రావిడ పార్టీలు!

నాస్తిక వాదం – కమ్మ్యూనిజం రెండూ కవల పిల్లలు! కమ్యూనిజం చెల్లని చోట నాస్తిక వాదం,నాస్తిక వాదం చెల్లని చోట కమ్య్య్యూనిజం ని చెల్లుబాటు చేస్తూ వస్తున్నారు. ఈ రెండు ఉదాహారణల కి తమిళనాడు – కేరళ మన ముందు కనపడుతూనే ఉన్నాయి!

తమిళనాట BJP అనే పదం బూతు మాటతో సమానం అనే వాడు నా మిత్రుడు ! ఇది 10 సంవత్సరాల క్రితం మా మధ్య జరిగిన సంభాషణలో అన్నమాట ! దానికి తగ్గవాడు రావాలి కానీ తమిళనాట BJP కి అవకాశం ఉంటుంది అని నేను అదే సమయంలో అన్న మాట ని గుర్తు చేస్తూ తన IPS పదవిని ఒదులుకొని BJP లో చేరిన అన్నామలై ని చూపిస్తూ మళ్ళీ ఫోన్ చేసి గుర్తుచేసాను. వందమంది అన్నామలై లు వచ్చినా తమిళనాట BJP కి అవకాశం ఉండదు అని మళ్ళీ అదే మాట అన్నాడు.

తమిళనాట స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడగానే నా మిత్రుడు తనంత తానె ఫోన్ చేసి మీరన్నది నిజం ! అన్నామలై చాల స్లో పాయిజన్ లాగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు! మీ అంచనా నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తున్నది. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో BJP మూడో స్థానంలోకి రావడానికి అన్నామలై చేసిన కృషి గురుంచి వివరంగా చెప్పుకోవాలి.

లావణ్య ఉదంతం :
తమిళనాడు లోని తంజావూరు జిల్లాలోని మిచెల్పట్టి అనే గ్రామం లోని మిషనరీ పాఠశాల దానికి అనుసంధానంగా ఒక హాస్టల్ ఉంది. మిషనరీ స్కూల్లో చదువుకుంటూ అక్కడి హాస్టల్లో ఉంటున్న 17 ఏళ్ళ లావణ్య అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు సేకరించడానికి వెళ్ళిన ద్రవిడ మీడియా విలేఖరుల ముందు ఆ మిషనరీ స్కూల్ ఫాదర్ మరియు నన్ లు చెప్పింది ఏమిటంటే లావణ్య కి బయటికి చెప్పుకోలేని రోగం ఉందని దాని వల్లే చనిపోయింది అని. దాన్నే ప్రచారం చేశాయి ద్రావిడ మీడియా! తమిళనాట మీడియా మొత్తం ద్రావిడ పార్టీల చేతిలో ఉన్నది అన్నది సత్యం ! మొదట్లో ఈ మీడియా చెప్పిందే నిజమని నమ్మారు అందరూ !

కానీ ఒక పత్రిక ‘దినమలర్ ‘ మాత్రం హాస్టల్ వార్డెన్ తో పాటు ఫాదర్,నన్ లు చెప్తున్నది నిజం కాకపోవచ్చు అనే అనుమానంతో పరిశోధన మొదలు పెట్టింది. దినమలర్ కి తోడుగా డెక్కన్ హెరాల్డ్ విలేఖరి కూడా పరిశోధన మొదలుపెట్టాడు. దాంతో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయట పడ్డాయని చెప్పను ఎందుకంటే ఇలాంటివి దశాబ్దాలుగా జరుగుతున్నవే కదా ?

లావణ్య తల్లి తండ్రులు పేదవారు. అందుకే స్థానిక మిషనరీ స్కూల్లో చేర్చారు లావణ్య ని. కానీ ఆ స్కూల్ కానీ హాస్టల్ లో కానీ పరిస్థితులు భిన్నంగా ఏవీ లేవు. లావణ్య పేదరికం ని టార్గెట్ చేస్తూ హాస్టల్ వార్డెన్ తరుచూ లావణ్య ని క్రైస్తవం తీసుకోమని బలవంతపెట్టేది కానీ లావణ్య అందుకు ఒప్పుకోలేదు. దాంతో శిక్షగా స్కూల్,హాస్టల్ లోని మరుగు దొడ్లు శుభ్రం చేయమని ఆర్డర్ వేసేది. మొదట్లో అన్యమనస్కంగా వార్డెన్ చెప్పినట్లు చేసినా రాను రాను వేధింపులు ఎక్కువ అవడం మొదలయ్యింది. ఒకరోజు స్కూల్,హాస్టల్ మొత్తం ఫ్లోరింగ్ శుభ్రం చేయించేది వార్డెన్. తరువాతి రోజు మరుగుదొడ్లు శుభ్రం చేయించేది. వేధింపులు భరించలేక ఒక రోజు లావణ్య తన తల్లి తండ్రులతో అసలు విషయం ఫోన్ చేసి చెప్పింది. బయట ఫీజులు కట్టి నిన్ను చదివిన్చెంత డబ్బు తమ దగ్గర లేదని ఎలాగో అలాగా సర్దుకొని పోయి నీ చదువు పూర్తీ చేసి వస్తే ఉద్యోగం దొరుకుతుంది అన్నారు. తన పేదరికానికి విలువకట్టలేక మతం మారడానికి ఇష్టం లేక మరుగుదొడ్లు శుభ్రం చేసే యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది లావణ్య.

లావణ్య యాసిడ్ తాగింది అని తెలియగానే హాస్టల్ వార్డెన్ తో పాటు ఫాదర్,నన్ లు మిషనరీ యాజమాన్యానికి తెలియచేసారు దాంతో వాళ్ళు విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి చెప్పవద్దని మిగతా విషయాలు మేము చూసుకుంటాము అన్నారు. హాస్టల్ వార్డెన్ ,ఫాదర్ లు మొదట లావణ్య ని స్థానిక హాస్పిటల్ లో చేర్పించి తరువాత తంజావూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చారు.

ఆత్మహత్య కాదని గుర్తు తెలియని రోగం అని మొదట ప్రచారం చేయడం వలన ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ పరిస్థితి విషమించి చనిపోబోతున్నది అని తెలియగానే తంజావూరు పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మరణ వాంగ్మూలం రికార్డ్ చేసాడు తన మొబైల్ ఫోన్ తో. తన వీడియో మరణ వాంగ్మూలంలో లావణ్య మతం మారమని చేస్తున్న వేధింపుల వల్లనే యాసిడ్ తాగాను అని స్పష్టంగా చెప్పింది కానీ స్టాలిన్ వెంటనే CID పోలీసులని రంగంలోకి దించి మరణ వాంగ్మూలం రికార్డ్ చేసిన కానిస్టేబుల్ ని చెన్నై తీసుకొచ్చి విచారణ పేరుతొ బెదిరించారు.

ఇక లావణ్య తల్లి తండ్రులు ,బంధువులు తంజావూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నాకి దిగారు. లావణ్య కి న్యాయం జరిగేవరకు శవాన్ని తీసుకెళ్ళేది లేదని మార్చురీ ముందు ఆందోళనకి దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక BJP నాయకులు వివరాలని తమిళనాడు BJP అధ్యక్షుడు అన్నామలై కి చెప్పారు దాంతో అన్నామలై రాష్ట్ర వ్యాప్తంగా BJP శ్రేణులని అప్రమత్తం చేయడంతోపాటు ABVP నాయకులని కూడా ఆందోళనలో భాగం చేసాడు. మొదటి సారిగా తమిళనాట హిందువులని జాగృతం చేసే నాయకుడు అన్నామలై రూపంలో రావడంతో హిందువులలో ధైర్యం వచ్చింది. ద్రావిడ పార్టీల గూండాల కి ఎదురొడ్డి మరీ అన్నామలై సభలకి హాజరుకావడం మద్దతు తెలపడం మొదలుపెట్టారు దాంతో ప్రమాదం గ్రహించిన స్టాలిన్ లావణ్య కేసుని CID దర్యాప్తు చేస్తుందని ప్రకటించాడు కానీ కేసుని రాష్ట్ర పోలీసులతో కాకుండా CBI చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ మదురై లోని హై కోర్టు బెంచ్ లో పిటిషన్ వేశాడు అన్నామలై. తంజావూరు హై కోర్టు బెంచ్ CBI దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చింది కానీ CBI దర్యాప్తు చేస్తే నిజాలు బయటపడతాయి అని స్టాలిన్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసాడు కానీ సుప్రీం కోర్టు మదురై లోని హై కోర్టు బెంచ్ ఇచ్చిన ఆదేశాల మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు లావణ్య కేసుని CBI దర్యాప్తు చేసి విచారణ ని తంజావూరు హై కోర్టుకి ఇస్తుంది.

ఈ మొత్తం సంఘటన మీద మొదట దినమలర్ విచారణ మొదలుపెడితే తరువాత డెక్కన్ హెరాల్డ్ జత కట్టింది. ఆపై అన్నామలై చాల వేగంగా స్పందించి విషయాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడమే కాదు న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ చాల వేగంగా చేసాడు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయగలిగే ధైర్యాన్ని అన్నామలై ఇవ్వగలిగాడు. తాజా స్థానిక సంస్థల ఎన్నికలలో BJP కూడా పోటీలో ఉంది అని చెప్పగలిగాడు. ఎన్ని సీట్లు వచ్చ్చాయి ? ఎంత శాతం వోట్లు వచ్చాయి ? ఇవి కాదు అసలు ఏమీ లేని చోట మేము ఉన్నాము అంటూ హెచ్చరిక చేయగలిగాడు అన్నామలై ! ఇప్పుడు ఉనికి చాటుకుంది కన్యాకుమారి,తెన్ కాశీ,చెన్నై లలో కావచ్చు కానీ విజయం ఒక్కసారిగా రాదు కదా ?

ప్రత్యర్దులని కలుగులోంచి బయటికి ఎలా తెచ్చాడో ఒక సారి చూద్దాం !
1. NEET పరీక్షలో పాస్ అవలేక ఒక విద్యార్ధి ఆత్మహత్య చేసుకుంటే దానిని చూపించి BJP NEET ని మన మీద బలవంతంగా రుద్ది మన విద్యార్ధులని చంపేస్తున్నది అంటూ రంకెలు వేసిన స్టాలిన్ ఎప్పుడయితే సుప్రీం కోర్టు లావణ్య హత్య కేసుని CBI దర్యాప్తు చేయడానికి ఆదేశించిందో వెంటనే అన్నీ మూసుకొని కూర్చున్నాడు. మెరుపు వేగంతో అన్నామలై మదురై హై కోర్ట్ బెంచ్లో వేసిన పిటిషన్ స్టాలిన్ ని గుక్కతిప్పుకోకుండా చేశాడు.
2. తమిళనాడులో ప్రాక్సీ ప్రభుత్వాన్ని నడుపుతున్న క్రైస్తవ మిషనరీల గుట్టుని బయటపెట్టాడు అన్నామలై ! తన ప్రసంగాలలో క్రైస్తవ పాఠశాలలో చదవాలి అంటే క్రైస్తవం తీసుకోవాలా ? అంటూ గట్టిగా ప్రజల ని ఉద్దేశించి అడిగాడు దాంతో తమిళనాడు క్రిస్టియన్ బిషప్ ఎస్రా సర్గుణమ్ [Bishop Esra Sargunam] బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు : అవును మా క్రిస్టియన్ సంస్థలలో చదువుకోవాలంటే క్రైస్తవం తీసుకోవాల్సిందే ! ఇష్టం లేనప్పుడు మా సంస్థలలో చదవడం దేనికి ? వేరే విద్యా సంస్థలలో చదివించండి మీ పిల్లలని. మత మార్చడం మా హక్కు ! మేము చేస్తూనే ఉంటాం ! తమిళనాట ఒక రాజకీయ పార్టీ ఇలా ఒక బిషప్ చేత బహిరంగంగా ఇలా ప్రకటన చేయించగలగటం అనేది ఇదే మొదటిసారి. ఈ పని అన్నామలై చేయగలిగాడు. ప్రజలు విస్తుపోయారు. స్టాలిన్ తల పట్టుకున్నాడు! ఈ ఎస్రా సర్గునం అనే భిషప్ ఏది చెప్తే అది చేస్తాడు స్టాలిన్ ! బిషప్ చేసిన ఈ బహిరంగ ప్రకటన ఫలితమే కన్యా కుమారీ,తెన్ కాశీలలో bjp కి వచ్చిన వోట్లు.
3. 23 మంది ABVP మహిళా విభాగం కార్యకర్తలు స్టాలిన్ ఇంటి ముందు ప్ల కార్డులు పట్టుకొని లావణ్య కి న్యాయం జరగాలి అంటూ ధర్నాకి దిగడం చెన్నై ప్రజలకి కొత్త ! DMK గూండాలు ఎలాంటి వారో తెలిసిన ప్రజలకి ఈ ధర్నా కనువిప్పు కలుగచేసింది దాని ఫలితమే కొద్దో గొప్పో చెన్నై కార్పోరేషన్ ఎన్నికలలో వోట్లు పడ్డాయి.

అన్నామలై ప్రజలలో చైతన్యం తీసుకురావంలో విశేష కృషి చేస్తున్నాడు. ప్రజలు కూడా అన్నామలై మాటలు వినడానికి వస్తున్నారు ధైర్యంగా ! మార్పు ఎక్కడ ? ద్రావిడ పార్టీల మూస ప్రసంగాలు వినీ వినీ ప్రజలు విసుగెత్తారు దాంతో అన్నామలై తమిళ సంస్కృతీ,సాంప్రదాయాల మీద మాట్లాడుతున్నాడు. ఇలా ఇదివరలో ఎవరూ మాట్లాడే సాహసం చేయలేదు. నాయకత్వ లోపం వలన AIDMK క్రమంగా వెనకపడుతున్నది. ఇది కూడా అన్నామలై కి కలిసి వచ్చింది. క్రమంగా AIDMK స్థానంలోకి అన్నామలై నాయకత్వంలో BJP వచ్చి చేరుతుంది.

ఇంతకీ NIA అరెస్ట్ చేసిన తీవ్రవాదులలో ఎక్కువమంది కేరళ నుండి అని అనుకుంటున్నాము కానీ అది నిజం కాదు. ఎక్కువమందిని అరెస్ట్ చేసింది తమిళనాడు నుండి ! రాబోయే రోజుల్లో BJP కార్యకర్తల హత్యలు తమిళనాడులో కూడా మొదలవుతాయి చూస్తూ ఉండండి !

Leave a Reply