-జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు – రీయింబర్స్మెంట్ ఇచ్చానని చెబుతున్న జగన్ రెడ్డి మాటలు ఒట్టి బోగస్
– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి ప్రణవ్ గోపాల్
2019- 20, 2020 -21 విద్యా సంవత్సరాలకు గానూ నాలుగో క్వార్టర్ ఫీజు చెల్లింపులు జరగకపోవడం వలన కోర్సు పూర్తి చేసినా , సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మాత్రమే జరిపారని, ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వకపోతే కాలేజీ వారు సర్టిఫికెట్ ఎలా ఇస్తారు.?కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులు విషయంలో నిధులు విడుదల చేయకుండా పులివెందుల పంచాయితీలు ఎలా?విద్యార్థులు తాము చదువుకున్న చదువుకి ప్రయోజనం లేకుండా చేస్తున్నారు.
కుంటిసాకులతో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా, వారి జీవితాలతో ఆటలాడటం సిగ్గుచేటు.జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలి.రీయింబర్స్ మెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసింది.వెన్నుముక లేని హామీలిచ్చి , మేనమామ నంటూ విద్యార్థులు వెన్నుముకనే విరిచాడు.మరో రెండు నెలల్లో కోర్సు పూర్తి చేసుకోబోతున్న విద్యార్థుల యొక్క పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది.
విద్యార్థులకు పెండింగ్లో ఉన్న జగనన్న విద్యా దీవెన,వసతి దీవెన బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం.వైకాపా ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం గానే మిగిలిపోయింది.మోసకారి జగన్ రెడ్డి మేనమామను నమ్మితే, ఓట్లు దండుకొని అక్క చెల్లెమ్మలకు శోకం మిగిల్చాడు.