– దళితుల బతుకు మారాలంటే.. దేశం అధికారంలోకి రావాలంతే!
– మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘దళిత ద్రోహి జగన్ రెడ్డి-దళితుల బాంధవుడు, పేదల పెన్నిధి చంద్రన్న’ అన్న పుస్తకంపై చర్చ
చర్చలో పాల్గొన్న తెదేపా దళిత నాయకులు
వైకాపా ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి పాలనలో దినదిన గండంగా బ్రతుకుతున్నారు – వర్ల రామయ్య
జగన్ మామ అని దళితుల చేత పిలిపించుకుంటూ మామ అనే పదానికి జగన్ రెడ్డి అర్ధం మార్చేశాడు. మామ అని అంటూ దళితులను నయవంచన చేశారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై సామాజిక వివక్ష పెరిగిపోయింది. వైకాపాలోని దళిత ఎమ్మెల్యేలు దినదిన గండంగా బ్రతుకుతున్నారు. ప్రభుత్వంకు సలహా ఇచ్చిన విమర్శిస్తున్నారని అనుకుంటారేమో అని దళిత ఎమ్మెల్యేలు బయపడుతున్నారు. నర్శీపట్నం దళిత డాక్టర్ సుధాకర్ లా నన్ను చంపేస్తారేమో అని వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భయపడుతోంది. అందుకే ఆమె తన నియోజకవర్గానికి కూడా వెళ్ళలేకపోతోంది. ఇది వైకాపాలో దళిత ఎమ్మెల్యేల పరిస్థితి అని వర్ల జగన్ పై ధ్వజమెత్తారు.
దేశంలోని ముఖ్యమంత్రులందరిలో జగన్ రెడ్డి అతిపెద్ద నయవంచకుడు -నక్కా ఆనంద్ బాబు
జగన్ రెడ్డి దళితులకు చేసిన వంచన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేడు. 27 దళిత పథకాలను రద్దు చేశారు. దళితులకు రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కుల కోసం కూడా అడుక్కునే పరిస్థితి కల్పించారు. అందుకే జగన్ రెడ్డి దళిత ద్రోహి అనే పుస్తకం తీసుకొచ్చాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్న స్టికర్ లను ప్రతీ ఇంటికి తీసుకెళుతాం. 2019 ముందు దళిత వాడల్లో వర్షం కురిస్తే ప్యాంట్లు పైకి ఎత్తిపట్టుకునే నడిచే పరిస్థితులు ఉండేవి. చంద్రబాబునాయుడు అధికారం 2014 అధికారం చేపట్టిన తర్వాత 2019 లో అధికారం దిగిపోయే నాటికి దళిత కాలనీల్లో 6 వేల కి.మీ సీసీరోడ్లు వేశాం. జగన్ రెడ్డి గత నాలుగేళ్లుగా ఒక్క కి.మీ అన్న దళితవాడల్లో రోడ్డు వేశారా? ఇసుక మాఫియాను ప్రశ్నించిన వర ప్రసాద్ శిరోముండనం పై దేశ ప్రధమ పౌరుడు రాష్ట్రపతి స్పందించినా ఈ రాష్ర్ద ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి స్పందించడానికి టైం లేదు. జగన్ రెడ్డి పై నోరెత్తితే దళితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగిస్తున్నారు. దళితులకు 14 శాతం రిజర్వేషన్లను 15 శాతం కు పెంచిన ఘనత తెలుగుదేశంది. జగన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళతాం.
యర్రగొండపాలెంలో చంద్రబాబా నాయుడిపై దాడి చేసి ఎన్.ఎస్.జీ కమాండోల కాల్పుల్లో దళితులను బలిపెడదామని జగన్ రెడ్డి కుట్రపన్నాడు – బాలవీరాంజనేయ స్వామి
జగన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతాం. దళితుల్లో జగన్ రెడ్డిపై వ్యతిరేకత పెరగడం వల్లే దళిత మంత్రి సురేష్ చేత నడిరోడ్డుపై చొక్కా విడిపించారు. సిగ్గులేకుండా చొక్కా తెలుగుదేశం వాళ్లు చింపారని మేరుగ నాగార్జున పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. అసెంబ్లీలో నాపై దాడి చేసి నేనే వారిపై దాడి చేశానని అబద్దమాడారు. అసత్యాలను ప్రచారం చేయడంలో వైకాపా నాయకులు సిద్దహస్తులు. ఎర్రగొండపాళెంలో చంద్రబాబు నాయుడి రోడ్ షోపై, ఎన్.ఎస్.జీపై రాళ్లు విసిరి ఎన్.ఎస్.జీ కాల్పుల్లో దళితులను బలిపెడదామని జగన్ రెడ్డి కుట్రపన్నాడు. అది కాస్త విఫమవడంతో దళిత నాయకులను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మీటింగ్ పెట్టుకున్నాడు జగన్ రెడ్డి.
లోకేష్ గారి మాటలను వక్రీకరించి రాజకీయ లబ్దిపొందాలనుకున్నాడు- ఎం.ఎస్ రాజు
జగన్ రెడ్డి ఒక దళిత ద్రోహి. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్రం ులో దళితులపై దాడులు, హత్యలు, నేరాలు పెరిగిపోయాయి. డా. సుధాకర్ దగ్గర నుంచి డా. అచ్చెన్న వరకు దళితులపై వేలాది దాడులు జరిగాయి. అనంతపురంలో స్నేహలత, కడపలో నాగమ్మ, రేపల్లె రైల్వే స్టేషన్ లో దళిత మహిళ, సి.ఎం ఇంటి సమీపంలోని తాడేపల్లిలో మరో దళిత మహిళ రేప్ కు గురైతే జగన్ రెడ్డి పరామర్శించిన పాపాన పోలేదు. మరణాల్లో కూడా కులాన్ని చూసే దుర్మార్గుడు జగన్ రెడ్డి. దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన పార్టీ వైకాపా. పార్టీలకు అతీతంగా సబ్రమణ్యం కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. దళిత పథకాలను జనరలైజ్ చేసి దళితులను నట్టేట ముంచిన మోసగాడు జగన్ రెడ్డి. లోకేష్ అనని మాటలను వక్రీకరించి రాజకీయ లబ్దిపొందాలని జగన్ రెడ్డి కుయుక్తులకు పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలో అంబేడ్కర్ విదేశీ విద్యపై అంకులప్ప అనే దళితుడి అడిగిన ప్రశ్నకు లోకేష్ చెప్పిన సమాధానాన్ని మార్ఫింగ్ చేసి అసత్యాలను ప్రచారం చేయాలని చూశారు. లోకేష్ గారు చర్చకు రావాలని సవాల్ విసరడంతో తోకముడిచారు.
నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ రెడ్డి దళిత – గిరిజనులతో మైండ్ గేమ్ ఆడుతున్నారు -వంగలపూడి అనిత
నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ రెడ్డి దళిత-గిరిజనులతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. జగన్ రెడ్డి మైండ్ గేమ్ కు దళిత-గిరిజనులు పడిపోయే రోజులు పోయాయి. జగన్ రెడ్డి ప్రభుత్వంపై నోరు విప్పితే దళితులపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. దళిత మహిళలపై హత్యచారాల్లో దేశంలోనే ఏపీని నం.1 స్థానంలో నిలిపిన ఘనత జగన్ రెడ్డిది. ఎక్కడో హైదరాబాద్ లో జరిగిన ఘటనపై దిశ చట్టం తీసుకొచ్చానని చెబుతున్న జగన్ రెడ్డి ఇంటి ప్రక్కనే అత్యాచారంకు గురైన దళిత మహిళను ఎందుకు పరామర్శించలేదు?
దళిత బాంధవుడు నారా చంద్రబాబు నాయుడి చేతులమీదుగా డాక్టరేట్ గ్రంధం తీసుకోవడం నా పూర్వజన్మసుకృతం – రామాంజనేయులు
15 దళిత నియోజకవర్గాల చుట్టూ ఉన్న అమరావతి రాజధానిని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్ రెడ్డి. ‘దళిత ద్రోహి జగన్ రెడ్డి-దళిత బాంధవుడు, పేదల పెన్నిధి చంద్రన్న’ పుస్తకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతాం. రాజ్యాంగ స్పూర్తితో దళితుల శాశ్వత అభ్యున్నతికి, సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసింది. నారా చంద్రబాబు నాయుడు దళితుల సాధికారతకు అహర్నిశలు కృషి చేశారు. ఆయన స్పూర్తితోనే నేను ‘సోషియో-ఎకనామిక్ కండీషన్స్ ఆఫ్ ఎస్సీస్ ఇన్ కర్నూలు డిస్రిపూక్ట్: యాన్ ఎంపిరికల్ స్టడీ’ అన్న అంశంపై పరిశోధన చేశాను. నా పరిశోధనకు శ్రీకృష్ణదేయరాయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ కూడా ప్రధానం చేసింది. దళిత బాంధవుడు, దళితుల పెన్నిది శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి చేతుల మీదుగా నా దళిత సోదరుల మధ్యలో ఆ గ్రంధాన్ని తీసుకోవడం నాపూర్వజన్మ సుకృతం.