రేపటి ధర్నా మా బల ప్రదర్శన కాదు:హరీశ్ రావు,తలసాని

రేపు తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కోసం ఇందిరా పార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ప్రజల పక్షాన మేము ఎపుడూ ఉంటాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే నిలబడతాం. ఆనాడు ఆంధ్ర లో విలీనం అయిన మండలాల గురించి ఆనాడు బంద్ నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని మేము మహాధర్నా చేపడుతున్నాం. అన్ని రాష్ట్రాలకు ఒకే విదానం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. రైతుల పక్షాన నిలబడేందుకే ఈ మహా ధర్నా చేస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలు,కీలక నేతలు మొత్తం ధర్నాలో పాల్గొంటారు. ప్రజాస్వామ్య పక్షంగా ధర్నా. కేంద్రం కొత్తగా ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రభుత్వ బాధ్యత . గతంలో కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేశాయి.కేంద్రం తప్పించుకునే యత్నం చేస్తోంది. రేపటి ధర్నా మా బల ప్రదర్శన కాదు. రైతుల‌ పక్షాన కేంద్రం పై ఒత్తిడి‌ తేవడానికే ధర్నా.