నాగార్జునసాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్ట్ కు టూరిజం మిత్ర అవార్డు

-నాగార్జునసాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్ట్ కు అంతర్జాతీయ బాంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డు
-కోల్‌కతా లో జరిగిన అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో అవార్డు అందుకున్న ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య

అంతర్జాతీయ బాంగ్లాదేశ్ భూటాన్ ఇండియా నేపాల్ కంట్రీస్ టూరిజం మిత్ర అవార్డు. తెలంగాణా ప్రభుత్వం నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్ కు కోల్కత్తా సిటీ సెంటర్ సాల్ట్ లేక్ సిఐలు హాల్ లో అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక నిర్వాహక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న మూడురోజుల సదస్సు ప్రారంభోత్సవ సభలో కొరియా ఇండియా ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ చైర్మన్ భిక్షు దమ్మదీప చేతులమీదుగా బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అవార్డు అందుకున్నారు.

ఆసియా దేశాల్లోనే ప్రత్యేకతలు గల బుద్ధవనం లోని వివిధ విభాగాలు ,బౌద్ధశిల్పకళ, బౌద్ధపర్యాటకాభివృద్ధికి, బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు, శాంతిని పెంపొందిస్తున్న మల్లేపల్లి లక్ష్మయ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ను ప్రకటించినట్లు అంతర్జాతీయ బౌద్ధపర్యాటక నిర్వాహక మండలి వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి డా కౌలేష్ కుమార్ ,అధ్యక్షులు, డా రవీంద్ర పంత్ తెలిపారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధవనం స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని బెంగాల్ పర్యాటకశాఖ కార్యదర్శి డా. సుమిత్ర మోహన్, కేంద్ర పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు, డా. సాగ్నిక్ చౌధురి తెలిపారు.

సదస్సుకు హాజరైన బాంగ్లాదేశ్ బౌద్ధ భిక్షువు డా. కరుణానంద, నేపాల్ కు చెందిన రమేష్ థాపా , థాయిలాండ్ పర్యాటక మండలి ఉపాధ్యక్షులు, శ్రీమతి శాంసంగ్, బాంగ్లాదేశ్ పాటా కార్యదర్శి ,తారిష్ రహమాన్, శ్రీలంక ప్రతినిధి శ్రీమతి లంక తిలంక, బుద్ధవనం స్టాల్ ను సందర్శించి మల్లేపల్లి లక్ష్మయ్య ను అభినందించారు.

ఈ అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో బుద్ధవనం ప్రత్యేకతలపై మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం బుద్ధిజం ఎక్స్పర్ట్ కన్సల్టెంట్, డా. ఈమని శివనాగిరెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ వీడియో ప్రదర్శనకు సందర్శకులనుండి విశేష స్పందనవచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్, కె. అంజిరెడ్డి బుద్ధవనం డిజైన్ ఇంచార్జి శ్యామ్ సుందర్ రావు పాల్గొన్నారని మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు.