Suryaa.co.in

Telangana

ట్రిపుల్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ ,రంజిత్ రెడ్డి

– రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషి మరో నయీమ్
– లియోనియా రిసార్ట్ లో ఫహీమ్ ఖురేషి పది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు
– లియోనియా ను మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి 330 కోట్ల రూపాయలకు కొట్టేశాడు
– ఇందులో బీజేపీ ఎంపీ లకు కూడా వాటా ఉంది. అందుకే దీనిపై వారు మాట్లాడటం లేదు
– బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు
– వసూలు చేసిన డబ్బు రాహుల్ గాంధీకి వెళ్తోంది
– పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్
– మాజీ ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఓ గురువింద గింజ .తన కింద నిలుపు చేసుకోని గురువింద లాంటోడు. దొంగే దొంగ అరిచినట్టుంది రేవంత్ తీరు. హామీలు అమలు చేయకుండా రేవంత్ రెడ్డి రే వోంట్ (Re won’t Reddy)రెడ్డి గా మారారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ను విచారణల పేరిట రేవంత్ వేధిస్తున్నారు.
కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్. రేవంత్ అంటే ట్రిపుల్ ఆర్ స్కామ్స్. కే టీ ఆర్ మీద కేసు సిగ్గు చేటు. అసలు ఏఐసీసీ అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇంగ్లిష్ అక్షర మాల ఏ నుంచి జడ్ వరకు కుంభ కోణాలు చేశారు.

పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్. మూడు రంగాల జెండాను పెట్టుకుని అవినీతి దందాలు చేస్తున్నారు.జాతీయ పతాకాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నా కాంగ్రెస్ తన జెండా ను మార్చుకోవాలి. రేవంత్ ముఖ్య సలహాదారులు ఐదు వేల కోట్ల రూపాయలకు దేంట్లో తక్కువ కమిషన్ తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓ బిల్డర్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకు కోర్టులో పిల్ వేశారు.

ట్రిపుల్ ఆర్ అంటే రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ ,రంజిత్ రెడ్డి స్కామ్స్. కేసీఆర్ వి ట్రిపుల్ ఆర్ స్కీమ్స్ అంటే రైతు బంధు , రైతు రుణమాఫీ , రైతు బీమా. స్కాం ల ద్వారా వసూలు చేసిన డబ్బు రాహుల్ గాంధీకి వెళ్తోంది. రేవంత్ అనుచరుడు ఫహీం ఖురేషి మరో నయీమ్ గా మారారు. లియోనియా రిసార్ట్ లో ఫహీమ్ ఖురేషి పది వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు

శామీర్ పేట లోని లియోనియా రిసార్ట్ 180 ఎకరాల్లో ఉంది. ఈ రిసార్ట్ బ్యాంకులకు 2200 కోట్ల బకాయిలు పడ్డది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నాడు ఈ లియోనియా ను మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి 330 కోట్ల రూపాయలకు కొట్టేశాడు. టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకుండా ఫహీమ్ ఖురేషి ఒత్తిడి తెచ్చి రంజిత్ రెడ్డికి లియోనియా దక్కేలా చేశారు. ఇందులో బీజేపీ ఎంపీ లకు కూడా వాటా ఉంది .అందుకే దీనిపై వారు మాట్లాడటం లేదు

లియోనియా కు డబ్బు బదిలీలో మనీ లాండరింగ్ కూడా ఉంది. ఈ వ్యవహారం పై విచారణ జరగాలి. విచారణ జరిపించకపోతే తప్పు జరిగినట్టే భావించాల్సి ఉంటుంది. బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు. కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారం లో వెంటనే రంగం లోకి దిగాలి. ఈ స్కాం ట్రయిలర్ మాత్రమే.

మరిన్ని స్కాం లు త్వరలోనే బయట పెడుతాం. తమ అవినీతి మచ్చలు చూసుకోకుండా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మీద వాగుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన నేత ,కరువు తీర్చే కాళేశ్వరం కట్టిన కేసీఆర్ మీదనే కేసులా? కేసీఆర్ మీద నిందలు వేసిన కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఉసురు తగలక మానదు. కే టీ ఆర్ మీద అవాకులు చవాకులు మానాలి.

హైదరాబాద్ కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కే టీ ఆర్ పై ఫార్ములా వన్ కేసు పెట్టారు. తప్పుడు కేసులు ఎప్పటికీ నిలవవు. ప్రెస్ మీట్ లో మన్నె గోవర్ధన్ రెడ్డి ,కె . వాసుదేవ రెడ్డి , పల్లె రవికుమార్ ,రవి నాయక్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE