Suryaa.co.in

Telangana

టీఆర్‌ఎస్ అద్భుత ప్రగతి: తలసాని

అనేక విజయాలను సొంతం చేసుకొని TRS పార్టీ దేశంలో నే చరిత్ర సృష్టించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హై టెక్స్ లో ఈ నెల 25 వ తేదీన జరిగే TRS పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన TRS పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి లో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా నిలిచిందని చెప్పారు. ప్రజలు కూడా TRS పార్టీ ని తమ సొంత పార్టీ గా భావించి ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ నేపధ్యంలో ప్లీనరీని పండుగ వాతావరణం లో నిర్వహించేలా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రి వెంట MLA మాధవరం కృష్ణారావు, TRS నాయకులు గజ్జెల నగేష్ తదితరులు ఉన్నారు

LEAVE A RESPONSE