పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి

– సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్ శనివారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో సంక్షేమ పధకాలను అందించాగాలిగామని, అన్ని వర్గాలకు చెందిన వారికీ ప్రయోజనం చేకూర్చ గలిగామని తెలిపారు. ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వేళల్లో ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నామని పద్మారావు గౌడ్ అన్నారు. భవిషత్తులో కూడా అదే పద్దతిని కొనసాగిస్తామని, సితాఫలమండీ లోని తమ కార్యాలయం పేదల సమస్యల పరిష్కార కేంద్రంగా కొనసాగుతుందని తెలిపారు.

కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, నేతలు లింగాని శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దార్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తమకు రావాల్సిన చేక్కులకు ప్రజలు ఎవరికీ డబ్బులు చెల్లించరాదని పద్మారావు గౌడ్ సూచించారు. 27 మందికి కళ్యాణ లక్ష్మి దాదాపు 27 లక్షల రూపాయల విలువచేసే చెక్కులను ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ అందించారు.

Leave a Reply