Suryaa.co.in

Andhra Pradesh

మమ్మల్ని నమ్మండి.. మేం మారిపోయాం!

పశువుల డాక్టర్లు ఒకటయ్యారు!
( అన్వేష్)

ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా పశువుల డాక్టర్లు కావడం విశేషం. వీరంతా అమెరికాలో ఒకటయ్యారు. ఎన్నికలు ముగియడంతో ఒకప్పటి పశువుల డాక్టర్ అయిన గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వల్లభనేని వంశీ, కరుడుగట్టిన జగనాభిమాని.. అమెరికాలో పశువుల డాక్టర్‌గా పనిచేస్తున్న పంచ్ ప్రభాకర్ అండ్ అదర్స్, ఇటీవల అమెరికాలో ఒకచోట కలిశారు. ఆ సందర్భంగా సోషల్‌మీడియాలో బయటకొచ్చిన ఫొటో ఇది.

ఆసందర్భంగా వంశీ అక్కడి టీడీపీకి సానుకూలంగా ఉంటూ, చంద్రబాబు-లోకేష్‌తో సన్నిహితంగా ఉండే వారిని కలిశారన్నది సోషల్‌మీడియా వార్తల భోగట్టా. ఆ ప్రకారంగా తాను జగన్ ఒత్తిడి మేరకే చంద్రబాబు-భువనేశ్వరిని దూషించానని, తనకు బాబు అంటే చాలా అభిమానమని చెప్పారట. లోకేష్‌తో గతంలో ఉన్న మనస్పర్ధల వల్లే తాను దూరమయ్యాను తప్ప, టీడీపీ రక్తం తనలో ఉందని వివరించారట. అయితే ఈ పరిస్థితిలో మీ గురించి చెబితే, తమనే దూరం పెడతారని సదరు తమ్ముళ్లు ‘సారీ డాక్టర్’ అంటూ జారుకున్నారట.

ఇక టీడీపీలో వర్కవుట్ కాదని తెలిసి బీజేపీలో అగ్రనేతలతో సన్నిహితంగా ఉండేవారిని కలసి, తాను బీజేపీలో చేరతానని చెప్పారట. అయితే అక్కడ కూడా దాదాపు అలాంటి సమాధానమే వచ్చిందట. ఇవన్నీ సోషల్‌మీడియాలో వచ్చే.. ట అనే కథనాలే . నిజం వల్లభుడికెరుక?

ఇక వంశీ పక్కనే నిలబడ్డ వీర జగనాభిమాని పంచ్ ప్రభాకర్ అయితే.. ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల చేసిన ఒక వీడియో, జగనన్న కార్యకర్తలను నోరెళ్లబెట్టింది. ఇప్పటివరకూ తాను ఆవేశంలో తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే మన్నించాలని ఆ వీడియోలో మనసారా ప్రార్ధించారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల గాయపడిఉంటే క్షమించాలని కోరారు. దానితో ‘‘ఇందేదబ్బా.. పంచన్నలో ఇంతలో ఇంత మార్పు? కొంపదీసి జగనన్న పార్టీ ఓడిపోతుందని అమెరికాలో ఉన్నవాళ్లకూ తెలిసిందా ఏమప్పా’’ అని సోషల్‌మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

అంతేనా? జగనన్నను ఐదేళ్లపాటు మోసి, చంద్రబాబు-లోకేష్-టీడీపీని మూకుమ్మడిగా తిట్టిపోసిన ప్రముఖ జర్నలిస్టులు కమ్ యూట్యూబర్స్ గొంతులుకూడా ఎన్నికలకు కొంచెం ముందు.. ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోవడమే వింత. అప్పటిదాకా హైదరాబాద్ కేంద్రంగా, టీ డీపీపై ఒంటికాలితో లేచిన ఈ జర్నలిస్టు ప్రముఖులు.. కొద్దికాలం నుంచి టీడీపీ అనుకూలస్వరం వినిపిస్తుండంతో, సోషల్‌మీడియా ఆశ్చర్యంగా నోరెళ్లబెడుతోంది. అయితే మిగిలిన నెటిజన్లు మాత్రం.. ‘అన్నయ్యకు ఈనెల వైసీపీ పేమెంట్ ఇచ్చినట్లు లేదు’ అని కొందరు… ‘కొత్త పేమెంట్ పార్టీ కోసం అడ్వాన్సుబుకి ంగులేమో గురూ’ అంటూ పోస్టులు పెడుతున్నారు. సోషల్‌మీడియా కదా.. సోషలిజం మరి! ఎవరినేమంటాం చెప్పండి?!

LEAVE A RESPONSE