లిక్కర్ కేసు నిందితులు, భూబకాసురులు, అన్యమతస్థులు, గంజాయి స్మగ్లర్లను టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించారు
విశ్వనాథ్ రెడ్డి భారతీరెడ్డికి అనుచరుడు
బెంగళూరులో జగన్ రెడ్డి ప్యాలెస్ కు, అవినీతికి కాపలాదారుడు
టీటీడీ బోర్డులో అనేకమంది జాతిరత్నాలు
కర్రలకు పులులు, సింహాలు ఆగుతాయా?
తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత
తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనది. నేడు రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. టీటీడీ బోర్డులో అవినీతి పరులను, లిక్కర్ కేసు నిందితులను, అక్రమార్కులను, భూబకాసురులను, అన్యమతస్థులను, గంజాయి స్మగర్లను నియమించారు. ఇలాంటి వాళ్లను కార్యవర్గంలో చేర్చుకుని తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు.
భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో బోర్డు విఫలమవుతోంది. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. టీటీడీ పవిత్రత, ఇతర సౌకర్యాల కల్పనపై జగన్మోహన్ రెడ్డి ఏనాడూ దృష్టి పెట్టలేదు. భూమన కరుణాకర్ రెడ్డి క్రిష్టియన్. అలాంటి వ్యక్తిని ఛైర్మన్ గా చేశారు. వాళ్ల అమ్మాయికి క్రిష్టియన్ పద్దతిలో పెళ్లిచేశారనే వార్తలు ఉన్నా.. ఎలాంటి చలనం లేదు.
కొండను బోడిగుండు అని మాట్లాడిన చరిత్ర కరుణాకర్ రెడ్డిది. టీటీడీ బోర్డులో అనేకమంది జాతిరత్నాలు తీసుకున్నారు. ఇందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డికి టీటీడీ బోర్డు సభ్యత్వం ఇవ్వడం తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే. విశ్వనాథ్ రెడ్డి భారతీరెడ్డికి అనుచరుడు. ఇతను బెంగళూరులో జగన్ రెడ్డి ప్యాలెస్ కు, అవినీతికి కాపలాదారుడు.
సామినేని ఉదయభాను అబ్బాయి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబట్టాడు. మడకశిర ఎమ్మెల్యే కోల్డ్ స్టోరేజీన కబ్జా చేసిన కబ్జారాయుడు. 24 మంది జాతిరత్నాలే. శిద్దా రాఘవరావు కుమారుడిని తీసుకువచ్చి బోర్డు సభ్యత్వం ఇచ్చారు. ఎలాంటి పరిశీలన, చిత్తశుద్ధి లేకుండా బోర్డును ఏర్పాటుచేశారు. గతంలో టీడీపీ పాలనలో టీటీడీ పవిత్రతను కాపాడటం జరిగింది. చిరుత దాడిలో చిన్నారి చనిపోతే.. కర్రలు ఇస్తున్నారు. కర్రలకు పులులు, సింహాలు ఆగుతాయా?