Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి కోసం తుమ్మల మధుస్మిత రూ.4 లక్షలు విరాళం

అమరావతి: రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సిఎం పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE